ఎవరికి ఏ మేర రిజర్వేషన్


(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డెస్క్)

నీట్ లో ప్రవేశాలకు గానూ సుప్రీం కోర్టు ఏ ఏ వర్గాలకు ఏ మేర రిజర్వేషన్ అమలు చేయాలో తేల్చేసింది. నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పోస్ట్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పును వినిపించింది. నీట్ పీజీ అడ్మిషన్లలో రిజర్వేషన్ల కోటాలను ఖరారు చేసింది. కొద్దిసేపటి కిందటే తుది తీర్పు ఇచ్చింది. ఈ పీజీ అడ్మిషన్లలో ఇతర వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి ఎంత శాతం మేర రిజర్వేషన్ ఇవ్వాలనే విషయంపై తన తుది నిర్ణయాన్ని ఇచ్చింది. ఇందులో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్‌ను కల్పించింది. ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీకి 10 శాతం మేర సీట్లను రిజర్వ్ చేస్తూ కొద్దిసేపటి కిందటే తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువడించింది. ఇందులో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్‌ను కల్పించింది. ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీకి 10 శాతం మేర సీట్లను రిజర్వ్ చేస్తూ కొద్దిసేపటి కిందటే తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువడించింది. నీట్ పీజీ అడ్మిషన్లలో ఆర్థికంగా వెనుకబడిన తరగతులవారి అర్హతను కేంద్ర ప్రభుత్వం ఇదివరకే నిర్ధారించిన విషయం తెలిసిందే. ఈడబ్ల్యూఎస్ కోటాను నిర్ధారించడానికి ఎనిమిది లక్షల రూపాయల వార్షికాదాయాన్ని ప్రాతిపదికగా తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ అఫిడవిట్‌ను సుప్రీంకోర్టుకు అందజేసింది. ఎనిమిది లక్షల రూపాయలు లేదా అంతకంటే తక్కువ వార్షికాదాయం ఉన్న కుటుంబాల వారిని ఆర్థికంగా వెనుకబడిన తరగతికి చెందిన వారిగా గుర్తించి, రిజర్వేషన్ కల్పిస్తామని పేర్కొంది. కేంద్రం నుంచి అఫిడవిట్ అందిన నేపథ్యంలో- దీనిపై దాఖలైన పిటీషన్‌పై విచారణను వేగవంతం చేయాలని, అత్యవసరంగా వాదనలను చేపట్టాలని కేంద్రం కోరింది. తుషార్ మెహతా.. ఈ పిటీషన్‌ను విచారణ చేస్తోన్న సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ సారథ్యంలోని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో రెసిడెంట్ డాక్టర్లు ఆందోళనకు దిగిన నేపథ్యంలో కేంద్రం దిగి వచ్చింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోటా ఎనిమిది లక్షల రూపాయల వార్షికాదాయంగా నిర్దారించింది. వారి ఆందోళనను విరమింపజేయడానికి అత్యవసరంగా విచారించాలని కోరింది 

2021-2022 విద్యాసంవత్సరంలో నీట్ పీజీ అడ్మిషన్లలో అఖిల భారత కోటాలో ఇతర వెనుకబడిన వర్గాల (ఓబీసీ) వారికి 27 శాతం, ఈడబ్ల్యూఎస్ వారికి 10 శాతాన్ని కేంద్రం కల్పించిన విషయం తెలిసిందే. అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్/డెంటల్ కోర్సుల (ఎంబీబీఎస్/ఎండీ/ఎంఎస్/డిప్లొమా/బీడీఎస్/ఎండీఎస్) అడ్మిషన్లకు ఈ రిజర్వేషన్ కోటాను వర్తింపజేసింది. ఇందులో ఈడబ్ల్యూఎస్ కోటాపై రిజర్వేషన్లను కల్పించడంపై సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. ఈడబ్ల్యూఎస్ కోటా అంశంలో డాక్టర్లు సైతం ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. 14 రోజులుగా వారు ధర్నాలు, ఆందోళనలు, నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తోన్నారు. దీనితో కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ కోటా ప్రాతిపదికను ఖరారు చేసింది. వార్షికాదాయం ఎనిమిది లక్షల రూపాయలుగా నిర్ధారించింది. ఈ మేరకు ఇటీవలే సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఓబీసీ కేటగిరీ తరఫున తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే సహా ఇతర సంఘాలు పిటీషన్లను దాఖలు చేశాయి. డీఎంకే తరఫున సీనియర్ అడ్వొకేట్ పీ విల్సన్, ఇతర సంఘాల తరఫున శ్యామ్ దివాన్ తమ వాదనలను వినిపించారు. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం వాదనలను ఆలకించింది. ఈ సందర్భంగా జస్టిస్ డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. లక్షలాదిమంది అభ్యర్థులు, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రెండు రోజుల్లోనే ఈ పిటీషన్‌పై విచారణను పూర్తి చేశామని అన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాను నిర్దారించడానికి పాండే కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు.Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: