మరింత యంగ్ గా .. హ్యాండ్సమ్ గా గోపీచంద్

గోపిచంద్ కు చెంబదిన ఓ పోస్టర్ అతని అభిమానులకు ఎంతో ఉత్సాహంనింపుతోంది. గోపీచంద్ హీరోగా దర్శకుడు మారుతి 'పక్కా కమర్షియల్' సినిమాను రూపొందించాడు. గోపీచంద్ మార్క్ యాక్షన్ తో పాటు, మారుతి మార్కు కామెడీ కలిసిన కథ ఇది. గోపీచంద్ ను ఫ్రెష్ లుక్ తో ఈ సినిమాలో మారుతి చూపించనున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ను వదిలారు. మరింత యంగ్ గా .. హ్యాండ్సమ్ గా ఈ పోస్టర్ లో గోపీచంద్ కనిపిస్తున్నాడు.


యూవీ క్రియేషన్స్ - గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. గోపీచంద్ సరసన నాయికగా రాశి ఖన్నా అలరించనుంది. గతంలో గోపీచంద్ - రాశి ఖన్నా కాంబినేషన్లో వచ్చిన 'జిల్' భారీ విజయాన్ని అందుకుంది. ఇక మారుతి దర్శకత్వంలో రాశి ఖన్నా చేసిన 'ప్రతి రోజూ పండగే' సినిమా కూడా బాగానే ఆడింది. అలా హిట్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు తాజా పోస్టర్ ద్వారా వెల్లడించారు.Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: