ఏమీ వాడుతున్నారో చెప్పండి:ఆనందయ్యకు ఆయూష్ నోటీసులు


(జానో జాగో వెబ్ న్యూస్-ఏపీ ప్రతినిధి)

ఒమిక్రాన్ మొదలు తాను దానికి మందు కనిపెట్టానని చెబుతున్న ఆనందయ్య అంశం ఓ వివాదంగానే మారింది. కరోనా వైరస్ మన దేశంలోకి ఎంటరైన తర్వాత ఇరు తెలుగు రాష్ట్రాల్లో బాగా పాప్యులర్ అయిన వ్యక్తి ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య. కరోనాకు ఆయన తయారు చేసిన ఆయుర్వేద మందు పెను సంచలనం అయింది. మద్రాస్ హైకోర్టు సైతం ఆయన మందును తయారు చేసి ఉచితంగా అందిస్తున్న వైనాన్ని కొనియాడింది. అయితే, తాజాగా ఆయనపై ఆయుష్ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతులు లేకుండా ఒమిక్రాన్ మందు అంటూ పంపిణీ చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. మందు పంపిణీకి సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. ఒమిక్రాన్ మందుకు ఏయే పదార్థాలు వాడుతున్నారో చెప్పాలని ఆదేశించింది. మీరు ఇచ్చే సమాధానం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పింది. మీరు పంపిణీ చేస్తున్న మందుకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేసింది. ఒమిక్రాన్ ను 48 గంటల్లో నయం చేస్తామని మందులు ఇస్తున్నారని... ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తెలిపింది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: