ఇన్‌స్టా అలర్ట్ సర్వీసుల చార్జీలను సవరించారు


(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డిస్క్)

తన బ్యాంకు కష్టమర్ల కోసం హెచ్ డీఎప్ సీ మళ్లీ కొన్ని వసరణలు చేపట్టింది.  ఇన్‌స్టా అలర్ట్ సర్వీసుల చార్జీలను సవరిస్తూ కీలక నిర్ణయాలు తీసుకొంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు ముఖ్యమైన అలర్ట్. బ్యాంక్ తాజాగా ఈమెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా పొందే ఇన్‌స్టా అలర్ట్ సర్వీసుల చార్జీలను సవరించింది. ఈ సవరించిన చార్జీలు జనవరి 1 నుంచే అమలులోకి వచ్చాయని బ్యాంక్ తెలిపింది. అందువల్ల బ్యాంక్‌లో అకౌంట్ కలిగిన వారు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం.. ఇన్‌స్టా అలర్ట్ ఎస్ఎంఎస్ సర్వీసుల కోసం కస్టమర్లు ఇదివరకు త్రైమాసికం చొప్పున రూ.3 చెల్లించేవారు. అయితే ఇప్పుడు ఒక్కో ఎస్ఎంఎస్‌కు 20 పైసలు + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇకపోతే ఈమెయిల్ అలర్ట్ సర్వీసులు అనేవి ఉచితంగానే లభిస్తున్నాయి. బ్యాంక్ కస్టమర్లు వారి అన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు సంబంధించిన అలర్ట్స్‌ను ఇన్‌స్టా అలర్ట్స్ సర్వీసుల ద్వారా పొందొచ్చు. దీని ద్వారా లావాదేవీ నిర్వహించిన వెంటనే వారికి ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా నోటిఫికేషన్ వస్తుంది. దీని వల్ల బ్యాంక్ ట్రాన్సా్క్షన్లపై కన్నేసి ఉంచొచ్చు. ఇన్‌స్టా అలర్ట్స్‌ను యాక్టివేట్ చేసుకోవడం వల్ల బిల్లు చెల్లింపు గడువు, శాలరీ క్రెడిట్, అకౌంట్‌లో ఎంత డబ్బు ఉంది వంటి పలు రకాల విషయాలు తెలుస్తూ ఉంటాయి. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ట్రాన్సాక్షన్ అలర్ట్‌లు రెగ్యులేటరీ నిబంధనల ప్రకారం ఖాతాదారులకు వస్తూనే ఉంటాయి. ఇక నెట్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ అలర్ట్స్ అనేవి ఇన్‌స్టా అలర్ట్స్‌ సర్వీసుల్లో భాగంగా కాదు. అంటే ఇన్‌స్టా అలర్ట్ సర్వీసుల కోసం నమోదు చేసుకోకపోయినా కూడా ఉచితంగానే నెట్ బ్యాంకింగ్ అలర్ట్స్ వస్తూనే ఉంటాయి.

 ఇన్‌స్టా అలర్ట్స్‌లో భాగంగా బ్యాంక్.. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు సంబంధిత ట్రాన్సాక్షన్ల అలర్ట్స్‌కు చార్జీలు వస్తుంది. బ్యాలెన్స్ ఇన్‌ఫర్మేషన్, ప్రమోషనల్ మెసేజెస్‌కు ఎలాంటి చార్జీలు ఉండవు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లు నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్ అయ్యి ఈ ఇన్‌స్టా అలర్ట్ సర్వీసుల కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒకవేళ వద్దనుకుంటే ఈ సర్వీసులను డీరిజిస్టర్ కూడా చేసుకోవచ్చు. మీకు ఏ ఏ లావాదేవీలకు అలర్ట్స్ వస్తాయో వివరాలు అందుబాటులో ఉంటాయి. మీకు నచ్చిన వాటికి అలర్ట్స్ సెట్ చేసుకోవచ్చు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: