ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు

బిజెపి నాయకుడు బుడ్డ శ్రీకాంత్ రెడ్డి. అరెస్టు చేయాలి

జానో జాగో సంఘం నేత సయ్యద్ మహబూబ్ బాషా డిమాండ్


(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

కర్నూలు జిల్లాలో నెలకొన్న మత సామరస్యాన్ని కలుషితం చేలా వ్యవహరిస్తున్న బీజేపీ నేత బుడ్డా శ్రీకాంత్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి జిల్లాలో ప్రశాంత వాతావరణం తీసుకురావాలని జిల్లా పోలీసు ఉన్నతాధికార్లకు జానో జాగో (ముస్లింల అభివృద్ధి వేదిక ) జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా, ఆవాజ్ పట్టణ అధ్యక్షుడు బాబుల, మిల్లి కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి జిఎం గౌస్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి నాయకుడు బుడ్డ శ్రీకాంత్ రెడ్డి అనవసర విషయాల్లో జోక్యం.మతకలహాలు ముఖ్య లక్ష్యంగా దాడులు చేస్తున్నారని వారు విమర్శించారు. అతని వ్యవహార శైలి ప్రశాంత వాతావరణం చెడగొట్టేలా ఉందన్నారు. రాజకీయ కక్షలు కార్పణ్యాలు తోనే, మతం ముసుగులో దాడులు జరుగుతున్నాయని,

 


గత కొన్ని నెలలుగా మసీదు నిర్మాణానికి సంబంధించిన విషయంలో అక్కడ పనిచేస్తున్న కూలీలు, ఒక వర్గానికి చెందిన వారు ప్రార్థనల్లో ఉండగా తన అనుచర గణంతో బుడ్డా శ్రీకాంత్ రెడ్డి మూకుమ్మడిగా దాడి చేసి గాయపరచడం జరిగిందని వారు వెల్లడించారు. గతంలో ఇటువంటి సంఘటనలు ఆత్మకూరు పట్టణంలో ఎప్పుడూ జరగలేదన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా ఆత్మకూరు పట్టణం ఉన్నప్పటికీ ఇటువంటి నాయకుల వలన మత ఛాందస్సవాదం పెరిగిలా చేసి దాడులతో ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని వారు విమర్శించారు. అధికార పార్టీ నాయకులు, పోలీసు వారు కలగజేసుకుని  ఈ ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టే ఇటువంటి నాయకుల పై పీడీ యాక్ట్ నమోదు చేసి నియోజకవర్గ బహిష్కరణకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తద్వారానే ఆత్మకూరు పట్టణ, శ్రీశైలం నియోజకవర్గం ప్రశాంత వాతావరణంలో ఉంటుందని ఇటువంటి సంఘటనలు జరగకుండా కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.


Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: