మేం వస్తే మీవీ కూడా కట్ చేస్తాం

(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డెస్క్)

తమ ప్రభుత్వం వస్తే వైసీపీ హయాంలో తీసుకొన్న నిర్ణయాలను రద్దు చేస్తామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. కుప్పం నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వృద్ధులకు పింఛన్లు తొలగిస్తున్నారీ దుర్మార్గులు అంటూ మండిపడ్డారు. ప్రస్తుతం తమ వాళ్ల పెన్షన్లు తొలగిస్తున్నారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్ల సంగతి చూసుకుంటామని హెచ్చరించారు. వలంటీర్ల బంధువుల పెన్షన్లు కట్ చేస్తామని స్పష్టం చేశారు. "ఈ ఊర్లో ఉండే వలంటీర్లూ మీరు ఇక్కడే ఉంటారు... ఎక్కడికీ ఎగిరిపోరు. బెదిరించొద్దు... మీ పని మీరు చేయండి, మా పని మేం చేస్తాం! వలంటీర్లను కూడా అడుగుతున్నా... ఈ వైసీపీ పాలనలో మీ బతుకులేమైనా బాగున్నాయా? మీకు రూ.5 వేలు ఇస్తూ, లక్ష రూపాయలు దోపిడీ చేస్తున్నారు" అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: