యోగి సర్కార్ రైతులకు ఎన్నికల ఆఫర్


(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డెస్క్)

ఎన్నికలు వస్తే చాలు అధికార పార్టీ ప్రజలపై వరాలు కురిపిస్తే...మే వస్తే ఇది చేస్తాం అది చేస్తామని ఇతర పార్టీలు హామీలు కురిపించడం పరిపాటి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. వ్యవసాయ వినియోగ విద్యుత్ చార్జీలను సగానికి సగం తగ్గించింది. పట్టణాల్లోని బోరుబావుల కనెక్షన్లకు సంబంధించి ప్రస్తుతం యూనిట్‌కు రూ. 6 వసూలు చేస్తుండగా దీనిని మూడు రూపాలయలకు తగ్గించింది. గ్రామీణ ప్రాంతాల్లోని పంప్‌సెట్ కనెక్షన్ల యూనిట్ ధరను రెండు రూపాలయ నుంచి రూపాయికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పట్టణాల్లోనూ ఫిక్స్‌డ్ చార్జీల ధరలను తగ్గించింది. హార్స్ పవర్‌‌కు ఇప్పటి వరకు రూ. 130 వసూలు చేస్తుండగా, దానిని రూ. 65కు తగ్గించింది. గ్రామాల్లో ఇది రూ. 70గా ఉండగా, రూ. 35 చేసింది. అలాగే, మీటర్లు లేని కనెక్షన్ల హార్స్ పవర్ రేటును రూ. 170 నుంచి రూ. 85కు తగ్గించింది. ఈ సందర్భంగా సీఎం ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. రైతులు సంతోషంగా ఉన్నప్పుడే రాష్ట్రం స్వయం సమృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. కాగా, ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కాస్త ముందుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. యూపీలో ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా, ఫిబ్రవరి 10న తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: