బట్టలు సర్ధి సంపాధించవచ్చు...ఇది కూడా ఓ ఉపాధి


మారుతున్న ఆధునిక యుగంలో మనషుల ఉరుకులు..పరుగుల జీవితంతో కొత్తరకం ఉపాధి అవకాశాలు కూడా పుట్టుకొస్తున్నాయి. ఒకరి అవసరం ఇంకొకరికి అవకాశం అవుతుంది. వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే అదే ఆదాయ మార్గం అవుతుంది. ఇంట్లో పనులు చేసుకోవడానికి సమయం చిక్కని ఇలాంటి కాలంలో కొత్త కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. అలాంటి పనులను అందిపుచ్చుకుని కొంతమంది జేబు నిండా సంపాదించుకుంటున్నారు. చిన్న పనులనే క్రియేటివ్‌గా చేస్తూ నెలకు వేలల్లో జీతం తీసుకుంటున్నారు. ఆదాయంతో పాటు తృప్తిని పొందుతున్నారు. ఇంట్లో బట్టలు సర్దుతూ ఓ యువతి నెలకు రూ.50 వేలు సంపాదిస్తోంది. ఇంగ్లాండ్‌లో 19 ఏళ్ల అమ్మాయికి అదనంగా డబ్బులు అవసరం అయ్యాయి. పార్ట్‌ టైం జాబ్ చేయాలనుకుంది. అందుకోసం తనకు చేతనైన పనినే వృత్తిగా ఎంచుకుంది. అదే బట్టలు సర్దడం. రోజుకు 3 నుంచి 9 గంటలు అదే పనిని చేస్తోంది. అక్కడ చాలామందికి తమ వార్డ్ రోబో‌లో బట్టలు సర్దుకోవడానికి టైం ఉండదు. ఆ పనిని ఇతరులకు ఇస్తారు. ఆ పనినే లైసెస్టర్‌కు చెందిన స్టూడెంట్ ఎల్లా చేస్తోంది. వార్డ్‌రోబ్‌లో బట్టల్ని పద్ధతిగా సర్ది అందరి మెప్పు పొందుతుంది. అలా బట్టల సర్దడంలో ఎల్ల ప్రొఫెషనలిస్ట్ అయింది. దాంతో ఆమె ఈ ఆఫర్స్ వస్తున్నాయి. ఈ పని కోసం గంటకు రూ.1500 నుంచి 2000 వరకూ తీసుకుంటుంది. ఎల్లా మొదట్లో ఫ్రెండ్స్, బంధువుల ఇళ్లల్లో బట్టలను నీట్‌గా సర్దేది. దుస్తుల రంగులను బట్టి, దుస్తుల రకాలను బట్టి వార్డ్‌ రోబ్‌లో అందంగా సర్దడం ఎల్లా ప్రత్యేకత. అందుకే ఆమె చేసే పనికి గుర్తింపు వచ్చి బయట వాళ్లు కూడా డబ్బులిచ్చి పని చేయించుకోవడం మొదలుపెట్టారు. ఆమెకు ప్రస్తుతం 20 మంది రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారు. రెండు వారాలకోసారి వారి ఇంటికి వెళ్లి బట్టలు సర్ది వస్తోంది. ఇలా ఆమె రూ.50 వేల వరకూ సంపాదిస్తోంది. దుస్తులను చూడడం, సర్దడం ఎల్లాకు ఎంతో ఇష్టమట. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: