అది వస్తే మాత్రం ప్రమాదమే


(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డెస్క్)

ఓ భారీ గ్రహశకలం భూమి వైపునకు దూసుకొస్తోంది. సైజులో అత్యంత భారీ పరిమాణంగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని శాస్త్ర వేతలు పేర్కొంటున్నారు. దాని వేగం కూడా ఇదివరకటి అస్టరాయిడ్లతో పోల్చుకుంటే.. రెట్టింపు ఉందని అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వెల్లడించింది. ఇంకొద్ది రోజుల్లో ఈ గ్రహశకలం భూకక్ష్యలోకి ప్రవేశించే ప్రమాదం లేకపోలేదని పేర్కొంది. దీనివల్ల కొన్ని విపత్కర పరిస్థితులు తలెత్తవచ్చని అంచనా వేస్తున్నట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. న్యూయార్క్‌లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఎత్త 381 మీటర్లు. దాని అంచును కూడా పరిగణనలోకి తీసుకుంటే.. ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. టిప్ వరకు ఉన్న ఎత్తు 443 మీటర్లు. 102 అంతస్తులు ఉంటాయి ఇందులో. దీనికి రెండున్నర రెట్ల పరిమాణంలో ఉంటుందీ అస్టరాయిడ్. ఇది భూమి వైపు అసాధారణ వేగంతో దూసుకొస్తోంది. ఈ నెల 18వ తేదీన భూకక్ష్యలోకి ప్రవేశిస్తుందని నాసా శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. అమెరికా కాలిఫోర్నియాలోని గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ సైజు కంటే పెద్దగా ఉండొచ్చని అంచనా వేశారు. ఈ బ్రిడ్జ్ పొడవు 2,737 మీటర్లు. ఈ గ్రహశకలం ఇప్పటిది కాదు. 1994లో దీన్ని గుర్తించారు. 1994 ఆగస్టు 9న ఆస్ట్రేలియాలోని సైడింగ్ స్ప్రింగ్ అబ్జర్వేటరీ సైంటిస్ట్ రాబర్ట్ మెక్‌నాట్ దీన్ని కనుగొన్నారు. భవిష్యత్తులో ఇది భూమికి అత్యంత సమీపానికి వస్తుందంటూ అప్పట్లో రాబర్ట్ మెక్‌నాట్ అంచనా వేశారు. ఆ అంచనా తప్పలేదు. వాస్తవరూపాన్ని దాల్చింది. భూమికి అత్యంత సమీపానికి వస్తోండటం వల్ల ప్రమాదకరమైన గ్రహశకలంగా నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ గ్రహశకలం వేగం సెకనుకు 19.56 కిలోమీటర్లు. కన్నుమూసి తెరిచే లోపలే మాయం అయ్యేంత వేగంతో ఇది ప్రయాణిస్తోంది. గంటకు 43,754 మైళ్లతో భూకక్ష్య వైపునకు దూసుకొస్తోందని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ నెల 18వ తేదీన ఈస్టర్న్ టైమ్ జోన్ (ఈఎస్టీ) ప్రకారం సాయంత్రం 4:51 నిమిషాలు, కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్ జోన్ ప్రకారం.. ఉదయం 9:23 నిమిషాలకు ఈ అస్టరాయిడ్ భూమికి అత్యంత సమీపానికి చేరుకుంటుందని, అదే వేగంతో విశ్వాంతరాల్లోకి దూసుకెళ్తుందని పేర్కొన్నారు. అత్యంత సమీపానికి వచ్చినప్పుడు భూమికి, ఈ గ్రహశకలానికి మధ్య ఉండే దూరం 1.2 మిలియన్ మైళ్ల దూరం ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు అన్నారు. ఇది భూమికి-చంద్రుడికి మధ్య ఉన్న దూరంతో పోల్చుకుంటే 5.5 రెట్లు ఎక్కువ. దీనివల్ల భూమికి వచ్చే ప్రమాదం ఏదీ లేనప్పటికీ.. దాని ప్రభావం వల్ల శాటిలైట్ నెట్‌వర్క్స్ ప్రభావితమౌతాయని అంచనా వేశారు. భూమికి 1.2 మిలియన్ల దూరంలో ఓ భారీ గ్రహశకలం కళ్లు చెదిరే వేగంతో ప్రయాణించడం అసాధారణ విషయమని చెప్పారు. అదొక్కటే కాకుండా.. మరిన్ని అస్టరాయిడ్లు ఈ నెలలోనే భూకక్ష్యను సమీపిస్తాయని పేర్కొంది. ఏడు మీటర్ల వ్యాసం గల 2014 వైఈ15 తోకచుక్క గురువారం నాడు భూమికి 4.6 మిలియన్ మైళ్ల దూరం నుంచి వెళ్తుంది. నాలుగు మీటర్ల పొడవు ఉండే 2020 ఎపీ1 గ్రహశకలం శుక్రవారం భూమికి 1.08 మిలియన్ మైళ్ల దూరం నుంచి దూసుకెళ్తుంది. ఈ నెల 11వ తేదీన 2013 వైడీ48 అనే మరో అస్టరాయిడ్.. భూమికి 3.48 మిలియన్ మైళ్ల దూరం నుంచి ప్రయాణిస్తుంది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: