మహానగరంలో పిడుగులతో కూడిన వ ర్షానికి అవకాశం


(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డెస్క్)

హైదరాబాద్ నగరానికి పిడుగులతో కూడిన వర్ష సూచన ఉందని వాతావరణ వాఖ వెల్లడించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాదులో పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్ధిపేట, జనగాం, యాదాద్రి, సంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని వివరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. పిడుగులతో కూడిన వర్ష సూచన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. కాగా, ఆదివారం రాత్రి కూడా రాష్ట్రంలో పలుచోట్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: