మళ్లీ విమానంతో వచ్చేసింది


(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డెస్క్)

కరోనా మన దేశంలో వ్యాప్తికంటే విదేశాల నుంచే దిగుమతి అవుతోంది. తాజాగా మరో ఘటన చోటు చేసుకొంది. ఇటలీ నుంచి భారత్ వచ్చిన ఓ విమానంలో 125 మంది ప్రయాణికులకు కరోనా నిర్ధారణ కావడం తెలిసిందే. ఇదిలావుంటే ఇటలీలోని రోమ్ నుంచి అమృత్ సర్ వచ్చిన మరో విమానంలోనూ కరోనా కలకలం రేగింది. ఈసారి 150 మంది కరోనా బాధితులుగా తేలారు. ఆ విమానంలో మొత్తం 290 మంది ప్రయాణికులు ఉండగా, విమానాశ్రయంలో అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ వచ్చిన వారి శాంపిల్స్ ను ఒమిక్రాన్ నిర్ధారణ కోసం జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ కు పంపారు. భారత్ లో కరోనా వ్యాప్తి ఉద్ధృతమైన సంగతి తెలిసిందే. ఒక్కరోజులో లక్ష కొత్త కేసులు నమోదు కావడం పట్ల నిపుణులు స్పందిస్తూ దేశంలో మూడో దశ కరోనా తాకిడి మొదలైందని అంటున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: