తిరుమలకు వచ్చిన అక్కినేని నాగార్జున


తిరుమలకు అక్కినేని నాగార్జున దంపతులు వచ్చి శ్రీవెంకటేశ్వర స్వామీని దర్శించుకొన్నారు. సంక్రాంతికి అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కాంబినేషన్‌లో వచ్చిన 'బంగార్రాజు' సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోన్న విష‌యం తెలిసిందే. కల్యాణ్ కృష్ణ రూపొందించిన ఈ సినిమాకు మంచి స్పంద‌న వ‌స్తుండ‌డంతో నాగార్జున త‌న భార్య అమ‌ల‌తో క‌లిసి ఈ రోజు తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. అనంతరం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... ప్రజలందరూ బాగుండాలని స్వామివారిని కోరుకున్నానని చెప్పారు. క‌రోనా కార‌ణంగా ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని, అవి తొల‌గిపోవాల‌ని ఆకాంక్షించారు. రెండు సంవత్సరాల తరువాత అయినా స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంద‌ని ఆయ‌న చెప్పారు. కాగా, అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించిన 'బంగార్రాజు' సినిమాలో నాగార్జున‌, నాగ‌చైత‌న్య, ర‌మ్యకృష్ణ‌, కృతిశెట్టి, రావు ర‌మేశ్, త‌దిత‌రులు న‌టించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: