మోడీ గారూ మౌనం వీడండి..


(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డిస్క్)

ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం బెంగళూరుకు విద్యార్థులు కొందరు, ఆ కాలేజీ సిబ్బంది ప్రధాని నరేంద్ర మోదీకి ఓ బహిరంగ లేఖ రాశారు. ఇటీవల హరిద్వార్ లో జరిగిన సంత్ కాళీ చరణ్ మహారాజ్ వ్యాఖ్యలపై ఈ లేఖను రాశారు. హిందూయిజం రక్షణకు హిందూ నేతనే ఎన్నుకోవాలంటూ సంత్ కాళీ చరణ్ మహారాజ్  పిలుపునిచ్చారు.  ‘‘ప్రధాని నరేంద్ర మోదీ గారూ.. మీ మౌనం విద్వేషం నిండిన గొంతులను మరింత పెంచుతోంది. అది మన దేశ ఐక్యత, సమగ్రతకే పెను ప్రమాదం. మనల్ని విడగొట్టాలని చూసే అలాంటి గొంతులపై కఠిన చర్యలు తీసుకోండి. కులాలు, మతాలవారీగా హింసను పెంచే విద్వేష ప్రసంగాలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. చర్చిలు సహా ప్రార్థనా మందిరాలను ఇటీవల తగులబెడుతున్న సందర్భాలున్నాయని, దీంతో దేశంలో ఓ రకమైన భయం వెంటాడుతోందని అన్నారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: