అమెరికాలో 95శాతం ఒమిక్రాన్ కేసులేనటా


(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డెస్క్)

మొన్నటి వరకు అమెరికాలో కరోనా తాడవిస్తే తాజాగా ఒమిక్రాన్ మరో ఉత్పధాన్ని తేనున్నదా అంటే అవుననే అంటున్నాయి వైద్య వర్గాలు. కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ముప్పతిప్పలు పెడుతోంది. లక్షలాది మందిని బలితీసుకుంటుంది. వైరస్ దాటికి ప్రజలు గడగడలాడిపోతున్నారు. కరోనా భారిన ప‌డిన‌ రోజుకు లక్ష సంఖ్యలో ఆస్పత్రుల పాలవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా నిన్న ( బుధవారం ) ఒక్కరోజే 25 లక్షలకు పైగా కరోనా కొత్త కేసులు వచ్చాయి. మళ్లీ వైరస్ తీవ్రత పెరగడంతో ప్ర‌పంచ‌దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమెరికాలో వచ్చిన కొత్త కేసుల్లో 95 శాతం ఒమిక్రాన్ వేరయంట్ వే అని భావిస్తున్నారు. ప్రపంచంలో అత్యధిక కేసులు అమెరికా, ఫ్రాన్స్‌లోనే నమోదువుతున్నాయి. ప్రపంచ దేశాల్లో కరోనా, ఒమిక్రాన్ విభృంభిస్తోంది. అమెరికాలో రోజుకు లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్న ( బుధవారం ) ఒక్కరోజే 7,04,661 మంది కొత్తగా వైరస్ భారినపడ్డారు. 1,802 మంది మరణించారు. ప్రస్తుతం లక్షమందికిపైగా బాధితులు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొంతున్నారు. కొత్తగా వచ్చిన కేసుల్లో 95 శాతం ఒమిక్రాన్ వేరియంట్‌వే అయి ఉంటాయని వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కేంద్రం భావిస్తోంది. కేసుల తీవ్రత చూస్తుంటే ఆందోళనకరంగా ఉందని పేర్కొంది. గత వారం రోజుల నుంచి సగటున రోజుకు 4 లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయని తెలిపింది. సగటున ప్రతి రోజు 14,800 మందికి పైగా ఆస్పత్రిలో కరోనా రోగులు చేరుతున్నారు. ఇది గత వారంతో పోల్చితే 63 శాతం అధికమని సీడీసీ తెలిపింది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: