సీఎన్‌జీ రూ.63.50 నుంచి రూ.66కు పెంపు...


(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డెస్క్)

మొన్నటి వరకు పెట్రోల్ బాధుడు  తప్పదు అన్నట్లుగా పరిస్థితి తయారైతే తాజాగా సీఎన్జీ, పీఎన్జీ గ్యాస్ ధరలు పెంచి వాహనదార్లకు చుక్కులు చూపిస్తున్నాయి. మూడు వారాల వ్యవధిలోనే వరుసగా రెండో సారి సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలు పెరిగాయి. సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలు పెంచుతున్నట్టు మహానగర్ గ్యాస్ లిమిటెడ్ ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ముంబై మెట్రోపాలిటన్ రీజన్(ఎంఎంఆర్)లో సీఎన్‌జీ బేస్ ధర కేజీకి రూ.2.50 పెంచుతున్నట్టు కంపెనీ తెలిపింది. అదేవిధంగా డొమెస్టిక్ పీఎన్‌జీ ధర ఒక్కో స్టాండర్డ్ క్యూబిక్ మీటర్‌కి(ఎస్‌సీఎం) రూ.1.50 పెంచినట్టు చెప్పింది. కాగా, గత నెల 18వ తేదీనే సీఎన్‌జీ, పీఎన్‌జీ రేట్లను మహానగర్ గ్యాస్ లిమిటెడ్ పెంచింది. ధరలను పెంచడంతో.. సీఎన్‌జీ ధరలు కేజీకి రూ.63.50 నుంచి రూ.66కు పెరిగినట్టు మహానగర్ గ్యాస్ లిమిటెడ్(ఎంజీఎల్) అధికార ప్రతినిధి చెప్పారు. పీఎన్‌జీ ధరలు కూడా ఒక్కో ఎస్‌సీఎంకి రూ.38 నుంచి రూ.39.50కి పెంచినట్టు పేర్కొన్నారు. దేశీయంగా గ్యాస్ కేటాయింపులు తగ్గిపోవడంతో ధరలను పెంచినట్టు ఎంజీఎల్ చెప్పింది. పెరుగుతోన్న సీఎన్‌జీ, పీఎన్‌జీ అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఈ కంపెనీ గ్యాస్‌ను సరఫరా చేస్తోంది. మార్కెట్ ధరకు మించి నేచురల్ గ్యాస్ ధరలు పెరుగుతుండటంతో, ఎంపీఎల్ ఇన్‌పుట్ గ్యాస్ ధర కూడా పెరిగింది. ఈ ప్రభావం కన్జూమర్లపై పడింది. సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలను, కంపెనీ గత నెల 18నే పెంచింది. డిసెంబర్ 18న ఒక్కో కేజీ సీఎన్‌జీపై రూ.2.00, పీఎన్‌జీ రేట్లు ఒక్కో ఎస్‌సీఎంపై రూ.1.50 పెంచుతున్నట్టు తెలిపింది. ఈ ప్రభావం 16 లక్షల పీఎన్‌జీ కస్టమర్లపై, 8 లక్షల సీఎన్‌జీ కస్టమర్లపై చూపించింది. ఎంజీఎల్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం 24 లక్షల మంది కస్టమర్లపై ప్రతికూల ప్రభావం చూపింది. పండగకు ముందు కూడా అక్టోబర్‌లో సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలను ఎంజీఎల్ రెండుసార్లు పెంచింది. ఆ తర్వాత నవంబర్‌లో, మళ్లీ డిసెంబర్‌లో రేట్ల పెంపు చేపట్టింది.రేట్ల పెంపు చేపట్టినప్పటికీ పెట్రోల్, డీజిల్ ప్రస్తుత ధరలపై సీఎన్‌జీ సుమారు 59 శాతం, 30 శాతం పొదుపులను అందజేస్తోంది. పీఎన్‌జీ పెట్రోల్, డీజిల్ ధరలపై 22 శాతం పొదుపును ఇస్తోంది.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: