వేల్ఫేర్ పార్టీ ఆఫ్ నంద్యాల కన్వీనర్ గా
షేక్ అబ్దుల్ అలీం నియామకం

(జానో -జాగో వెబ్ న్యూస్_నంద్యాల ప్రతినిధి)

రాజకీయాల్లో అవినీతిని ప్రక్షాళనం చేసి స్వచ్ఛమైన పాలకులను తయారు చేయుటకు ఆవిర్భవించిన రాజకీయ పార్టీ 'వేల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా' అని, ఆ పార్టీ రాష్ట్ర కన్వీనర్ జీ.యం.జఫ్రుల్లా తెలిపారు. ఆదివారం నంద్యాల సందర్శించిన ఆయన వేల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా (WPI) నంద్యాల కన్వీనర్ గా షేక్ అబ్దుల్ అలీంను నియమించారు. క్రాంతి రేఖ గ్రంథాలయంలో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో ఆలీం మాట్లాడుతు


పార్టీ తనమీద ఉంచిన బాధ్యతగా ప్రజలలో పార్టీ తీసుకొని పోవుటకు నిరంతరం శ్రమిస్తానని అవినీతి రహిత పాలన కోసం తపించే మతాలకు అతీతంగా ఎవరైనా పార్టీ లో చేరవచ్చన్నారు. కార్యక్రమం లో పాల్గొన్న జమాఆతె ఇస్లామి హింద్ నంద్యాల శాఖ అధ్యక్షులు అబ్దుల్ సమద్ మాట్లాడుతూ కళంకనీయమైన రాజకీయాలను ప్రజలు ఏవగించుకుంటున్నారని, నీతీవంతులు యువత రాజకీయాల్లోకి వచ్చి మంచి పాలన ఇవ్వాలని స్వాగతించారు. ఇంకా జనాబ్ షబ్బీర్ హుసేన్, ఫజ్లే హఖ్, అన్సార్,సద్దాం తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: