మీ ఎంపీలు ఎక్కడ దాక్కున్నారు ?

ఎంపీలు ప్రత్యేక హోదాపై ప్రశ్నించారా ?

డాక్టర్ సాకే శైలజనాథ్ 


(జానో జాగో వెబ్ న్యూస్-ఏపీ పొలిటికల్ బ్యూరో)

అధికార వైసీపీకి రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదని, పునర్విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్ పై జగన్ రెడ్డి ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించడంలేదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డీ మీ పార్టీకి చెందిన 23 మంది ఎంపీలు ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ తో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఎంపీలు ఎందుకు మౌనం వహిస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్రం మెడలు వంచుతామన్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తన పదవిని కాపాడుకోవడానికి కేంద్రం వద్ద  మోకరిల్లుతున్నారని విమర్శించారు. ఈ మేరకు గురువారం విజయవాడ ఆంధ్ర రత్న భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న రైల్వే జోన్ ఎప్పటి నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలో కాలవ్యవధిని ఖరారు చేయలేమని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేసినా అధికార వైసీపీ ఎంపీలు ఆందోళన చేయకుండా ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రానికి జీవ నాడి అయిన పోలవరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో చాలావరకు నిధులు తెచ్చి పూర్తి చేస్తే గత, ప్రస్తుత ప్రభుత్వాలు ఆ ప్రాజెక్టుకు నిధులు తేవడంలో విఫలమవుతున్నాయని ఆరోపించారు.

వరద నష్టంపై కేంద్ర సాయం ఏదీ ?

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రకృతి  సృష్టించిన విలయంతో సంభవించిన వరద నష్టం పై సాయం చేయాల్సిన కేంద్రం ఇప్పటివరకు ఒక్క పైసా నిధులు విడుదల చేయకపోయినా ఎందుకు మౌనం వహిస్తున్నారని శైలజనాథ్ ప్రశ్నించారు. వరదల వల్ల జరిగిన పంట నష్టం, మౌలిక వసతులకు రూ. 6.054 కోట్ల నష్టం జరిగినట్లు ప్రాధమికంగా అంచనా వేసినా ఇప్పటివరకు కేంద్రం సాయం ప్రకటించక పోవడం శోచనీయమని అన్నారు. నవంబర్ 16 నుంచి 18 తేదీల మధ్య దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కురిసిన అసాధారణ వర్షాల కారణంగా నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలను కనీవినీ ఎరుగని రీతిలో వరదలు ముంచెత్తాయని, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. రోడ్లు, వంతెనలు, రైలు పట్టాలు, విద్యుత్ లైన్లు, స్తంభాలు వరదలో కొట్టుకుపోయాయన్నారు . వరదలు ముంచెత్తడంతో కొన్ని జలాశయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వేలాది ఎకరాల్లో కోతలకు సిద్ధమైన పంట వరద నీటిలో కొట్టుకుపోయింది. సుమారు లక్షా 85 వేల హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యానవన పంటలు ధ్వంసమైపోయాయని చెప్పారు. కేంద్ర బృందం పర్యటించినా నిధుల ఊసే లేదని ఆరోపించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం విఫలమైందని పీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్ ఆరోపించారు.


పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయరా ?

పోలవరం ప్రాజెక్టులో కీలకమైన పునరావాసం నత్తనడకన సాగుతోందని, ఇప్పటివరకు నాలుగో వంతు కూడా పునరావాసం పూర్తి కాలేదని, ప్రాజెక్టు పూర్తికి, పునరావాసానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గడువులు నిర్దేశించుకొంటున్నా ఆచరణ మాత్రం అందుకు తగ్గట్లుగా సాగడం లేదని శైలజనాథ్ విమర్శించారు. పునరావాసంలో వెనకబడినట్లుగానే, ప్రాజెక్టు నిర్మాణంలో కూడా పనులు బాగా వెనకబడి ఉన్నాయని, ప్రాజెక్టు పురోగతి, పునరావాసం సహా కీలకాంశాలపై ఆంధ్రప్రదేశ్ సమర్పించిన నివేదిక ప్రకారం ఇప్పటి వరకు పునరావాసానికి సంబంధించిన పనులు 20.19 శాతం మాత్రమే జరిగాయిని, పునరావాస కాలనీలు, వాటిలో వసతుల కల్పన, ప్రత్యామ్నాయ భూసేకరణ ఇలా అన్నింటిలోనూ నత్తనడకే అని ధ్వజమెత్తారు. ఈ పనులన్నింటికీ కలిపి రూ.35,669 కోట్లు అవసరమని అంచనా వేస్తే ఇప్పటి వరకు చేసిన ఖర్చు రూ.6654 కోట్లేనని, మరో రూ.29 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని, నిర్వాసితుల సామాజిక, ఆర్థిక పరిస్థితిపై సర్వే కూడా ఇంకా పూర్తి కాలేదని  తెలిపారు.   నిర్వాసితులకు రూ.8,112 కోట్లు చెల్లించాల్సి ఉంటే ఇప్పటివరకు రూ.580 కోట్లు మాత్రమే చెల్లించారని, పునరావాస కాలనీల్లో గృహనిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాలకు రూ.13,212 కోట్లు అవసరమైతే చేసిన ఖర్చు రూ.800 కోట్లు మాత్రమేనని, దీంతో   నిర్వాసితుల పరిస్థితి దిక్కుతోచని విధంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరిగాయని, తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. తక్షణం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించడంతో పాటు పనులు పూర్తి చేయాలని వీటన్నింటిపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎంపీలు లోక్ సభలో కేంద్ర ప్రభుత్వంపై పోరాడాలని శైలజనాథ్ డిమాండ్ చేశారు.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: