డాటా సైన్స్‌లో బహుళ విద్యా కార్యక్రమాలను,,, 

ప్రకటించిన ఒడిన్‌  స్కూల్‌


(జానో జాగో వెబ్ న్యూస్_బిజినెస్ బ్యూరో)

గ్రే క్యాంపస్‌లో భాగమైన ఒడిన్‌ స్కూల్‌, భారతదేశంలో నైపుణ్యవంతులైన  డాటా సైన్స్‌ ప్రొఫెషనల్స్‌ లభ్యత పరంగా ఉన్న అంతరాలను తగ్గించేందుకు తమ విద్యా కార్యక్రమాలు ప్రారంభించినట్లు వెల్లడించింది. ప్రభావవంతమైన శిక్షణా పరిష్కారాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించిన ఒడిన్‌ స్కూల్‌, మూడు నూతన అవకాశాలు ః సాంకేతిక రంగంలో మహిళల కోసం స్కాలర్‌షిప్‌ ; అందరికీ ఉచితంగా విద్య  మరియు యూనివర్శిటీ భాగస్వామ్యాలు – ఆవిష్కరించింది. ఇవన్నీ కూడా డాటా సైన్స్‌లో వారి కెరీర్‌లను నిర్మించడంలో ప్రజలకు సహాయపడటమే లక్ష్యంగా చేసుకున్నాయి.


‘ఉమెన్‌ ఇన్‌ టెక్‌’ స్కాలర్‌షిప్స్‌ను  ప్రధానంగా  మహిళలు ఆర్థిక అవరోధాలను అధిగమించడంలో సహాయపడటాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి.  వీటి ద్వారా డాటా సైన్స్‌లో శక్తివంతమైన కెరీర్‌లను నిర్మిస్తారు.  భారతదేశంలో డాటా సైన్స్‌లో 20% కన్నా తక్కువగా  మహిళలు పనిచేస్తున్నారన్న వాస్తవాలను పరిగణలోకి తీసుకుని ఒడిన్‌ స్కూల్‌, ఇప్పుడు ఔత్సాహిక మహిళలకు  ఒక కోటి రూపాయలను ఈ ఉత్సాహపూరితమైన విభాగంలో  ప్రోత్సహించేందుకు కేటాయించింది.. అత్యున్నత అర్హతలు కలిగిన  మహిళలకు 100%స్కాలర్‌షిప్‌లనూ అందజేస్తారు.


డాటా సైన్స్‌ ఔత్సాహికుల కోసం  ఉచిత మరియు ఎక్స్‌క్లూజివ్‌ వేదిక ‘అకాడవీ’ు. ఇది విజ్ఞానం, అవకాశాలు కోరుకునే ఔత్సాహికులు, ప్రొఫెషనల్స్‌, మేథావులు, పరిశ్రమ నిపుణులను ఒకే దరికి తీసుకురావడంతో పాటుగా డాటా సైన్స్‌ డొమైన్‌లో భాగస్వామ్యాలనూ తీసుకువస్తుంది.

కాలేజీలలో డాటా సైన్స్‌ నైపుణ్యం అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఒడిన్‌ స్కూల్‌ ప్రారంభించిన మరో  కార్యక్రమం ‘యుని–కాన్‌’. విద్యాసంస్థలతో భాగస్వామ్యం చేసుకుని ఫ్యాకల్టీ నైపుణ్యం మెరుగుపరచడంతో పాటుగా విద్యార్థులకు డాటా సైన్స్‌ పరంగా పలు అభ్యాస ప్రయోజనాలను సైతం పూర్తి ఉచితంగా అందిస్తుంది.

ఒడిన్‌స్కూల్‌ ఇప్పుడు ఆరు నెలల పాటు బూట్‌క్యాంప్‌ను డాటా సైన్స్‌లో అందిస్తుంది. ఇది యువ ప్రొఫెషనల్స్‌, గ్రాడ్యుయేట్లకు తమ కెరీర్‌లను మరింత మెరుగుపరుచుకునేందుకు తోడ్పడే రీతిలో డిమాండ్‌లో ఉన్న నైపుణ్యాలను సైతం పొందేందుకు తోడ్పడుతుంది. ఈ కార్యక్రమానికి  పరిశ్రమ నిపుణులు నేతృత్వం వహించనున్నారు. వీరు అభ్యర్థులకు ముఖాముఖి  మెంటార్‌షిప్‌ సదస్సులను సైతం అందించనున్నారు. 

‘‘ఒడిన్‌ స్కూల్‌ వద్ద, మేము ఉద్యోగాధారిత అభ్యాస అనుభవాలను అందిస్తుంటాము. కెరీర్‌ శిక్షణా కార్యక్రమాల ప్రదాతగా, ఈ అభివృద్ధి చెందుతున్న రంగంలో  కెరీర్‌లను పొందాలనుకుంటున్న ప్రజలకు తోడ్పడేందుకు సైతం మేము మా కోర్సులను తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నాము. అకాడమీ మరియు ఉమెన్‌ ఇన్‌ టెక్‌ స్కాలర్‌షిప్స్‌ ఖచ్చితంగా తమ కెరీర్‌లలో ముందంజలో ఉండాలని కోరుకునే అభ్యర్థులందరికీ వారి ఆర్ధిక స్థితిగతులతో సంబంధం లేకుండా భారీ అవకాశంగా నిలుస్తాయి. అదనంగా, దేశంలో సాంకేతిక రంగంలో భావి తరాలను తీర్చిద్దిద్దాలనుకుంటున్నాము. యుని–కాన్‌ కార్యక్రమం, ప్రస్తుత సాంకేతికత ధోరణులకనుగుణంగా ఫ్యాకల్టీకి సహాయపడటంతో పాటుగా వారు భావి నిపుణులను తీర్చిదిద్దడంలోనూ తోడ్పడనుంది’’ అని విజయ్‌ పసుపులేటి, సీఈవో అండ్‌ కో ఫౌండర్‌ – గ్రే క్యాంపస్‌ మరియు ఒడిన్‌ స్కూల్‌ అన్నారు.

అప్‌స్కిల్లింగ్‌ వేదికగా ఇది తమ విద్యార్థులపై పెట్టుబడులు పెడుతుంది. ఒడిన్‌ స్కూల్‌ యొక్క బూట్‌ క్యాంప్‌లు కెరీర్‌ సేవలతో వస్తున్నాయి. వీటిలో పనిప్రాంగణాలలో ప్రవర్తన నైపుణ్యాలపై వర్క్‌షాప్స్‌, వారాంతపు తరగతులతో ప్రత్యక్ష అనుసంధానం, పూర్తి ప్లేస్‌మెంట్‌ అసిస్టెన్స్‌ వంటివి ఉన్నాయి. భారతదేశంలో సుప్రసిద్ధ డాటా ఆధారిత సంస్థలలో పలువురు ఔత్సాహికులకు ఉద్యోగావకాశాలను ఒడిన్‌ స్కూల్‌ అందించింది.


Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: