వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన

రేపు మూడు జిల్లాలలో వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన

ప్రతిపక్షాల విమర్శలకు చెక్


(జానో -జాగో వెబ్ న్యూస్_ఏపీ పొలిటికల్ బ్యూరో)

వర్ష ప్రభావిత వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు పర్యటించనున్నారు. ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెడుతూ ఆయన వర్ష ప్రభావిత వరదకు గురైన మూడు జిల్లాలలో ఆయన పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించ లేదని, ప్రజలను గాలివానకు వదిలేశారని ఇటీవల ప్రతిపక్షాలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. వరదలు తగ్గుముఖం పట్టాక వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటిస్తానని, స్వయంగా ప్రజలతో మాట్లాడతానని ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగానే ఆయన గురువారం నాడు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతకొన్ని రోజులుగా భారీ వర్షాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తుఫాన్ కారణంగా లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వరద ధాటికి ముఖ్యంగా దక్షిణాంధ్ర, రాయలసీమ అల్లాడిపోయింది. వరద ప్రభావంతో అతలా కుతలమైన మూడు జిల్లాల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 2,3 తేదీల్లో జగన్ తన సొంత జిల్లా కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించి.. వరద బాధితులను పరామర్శించనున్నారు. ఇప్పటికే సీఎం జగన్ వరద ప్రభావిత జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో బాధితుల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు ఆయన మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌కు పర్యటన షెడ్యూల్‌ విడుదలైంది.

రెండో తేదీన గురువారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి బయలదేరి గన్నవరం విమానాశ్రయం నుంచి కడప చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్ లో రాజంపేట మండలం మదనపల్లి చేరుకుంటారు. పులపాతూరు గ్రామంలో సీఎం పర్యటిస్తారు. భారీగా దెబ్బ తిన్న గ్రామాన్ని సందర్శించి..బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడనున్నారు. సహాయ శిబిరాలను సందర్శించి..గ్రామ సచివాలయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి మందపల్లి గ్రామానికి వెళ్లనున్నారు. ఆ తరువాత వరదలకు కొట్టుకుపోయిన అన్నమయ్య డాం ప్రాంతాన్ని సీఎం స్వయంగా పరిశీలిస్తారు.


         


Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: