ఓటీఎస్‌పై దుష్ప్రచారాన్ని సీరియస్‌గా తీసుకోండి

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి


(జానో -జాగో వెబ్ న్యూస్_విజయవాడ బ్యూరో)

      జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం(వన్‌ టైం సెటిల్‌మెంట్)పై దుష్ప్రచారాన్ని సీరియస్‌గా తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సీఎం జగన్‌ మాట్లాడుతూ.. లబ్ధిదారుల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఓటీఎస్‌పై దుష్ప్రచారానికి సంబంధించి కఠినంగా ఉండాలని చెప్పారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. ఓటీఎస్‌ పథకం ద్వారా లక్షలమంది పేదలకు లబ్ధి చేకూరుతోందని, చట్టపరంగా హక్కులు దాఖలుపడతాయని తెలిపారు. మేలు చేస్తున్న పథకం పట్ల దురుద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రచారంపై చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారుల్లో సందేహాలు, అనుమానాలు ఉంటే అధికారులు ఒకటికి రెండుసార్లు అవగాహన కల్పించాలని సీఎం జగన్‌ సూచించారు. పథకం ద్వారా వచ్చే లబ్ధిని, రిజిస్టర్‌ పత్రాల ద్వారా లబ్ధిదారులకు మాఫీ అవుతున్న అసలు, వడ్డీ వివరాలను కూడా చూపించాలని సీఎం జగన్‌ పేర్కొన్నారు. 


ఈ సందర్భంగా మున్సిపల్‌, పట్టాణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ ఇది బలవంతపు పథకం కాదు, పేదలందరికీ ఉచిత ఇళ్ల పథకం ద్వారా ప్రయోజనం కలిగించేందుకే వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ స్కీమ్‌ ప్రవేశపెట్టామని అన్నారు. ఈ పధకం ద్వారా లబ్ధిదారులకు గృహహక్కు చేకూర్చేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ఇది బలవంతపు పథకం కాదని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.


స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారికే పథకం వర్తిస్తుందని తెలిపారు. పాదయాత్రలో వచ్చిన విజ్ఞప్తి మేరకు సీఎం జగన్‌ ఈ పథకం ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. కాగా, దీనిపై వివాదాస్పద ఆదేశాలు ఇచ్చిన అధికారిని సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు. ఒక పథకం ప్రకారం.. టీడీపీ కావాలనే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోందన్నారు. పేదలపై టీడీపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. 

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: