యర్రగొండపాలెం గ్రామ పంచాయితీ అభివృద్ధికి ,,,,,,

విశేషంగా కృషి 

మంత్రి ఆదిమూలపు సురేష్


(జానో -జాగో వెబ్ న్యూస్_మార్కాపురం ప్రతినిధి)

నియోజకవర్గ కేంద్రమైన యర్రగొండపాలెం గ్రామ పంచాయితీ అభివృద్ధికి విశేషంగా కృషి చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. మంగళవారం గ్రామ పంచాయితీ ఆధ్వర్యములో ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణానికి ఆనుకొని ఉన్న పంచాయితీ స్ధలములో 30 రూములతో నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు.

    ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ రూముల నిర్మాణం ద్వారా పంచాయితీకి అద్దెల రూపంలో ఆదాయం పెరగనున్నట్లు చెప్పారు. యర్రగొండపాలెంలో శాశ్వతమైన పనుల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టినట్లు  ఆయన చెప్పారు. ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాన్ని ప్రజల సౌకర్యార్ధం పట్టణ నడిబొడ్డున ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ పాటికే పంచాయితీ నిధులతో ప్రాంగణాన్ని అభివృద్ధి పరచినట్లు పేర్కొన్నారు. మరిన్ని నిధులు మంజూరు చేయించి ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. ప్రయాణికులకు ప్రాంగణంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. పుల్లలచెరువు రోడ్డులో రైతు బజారు నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. అక్కడే టీటిడి కల్యాణ మండపాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. మార్కెట్ యార్డు గోడౌన్ల నిర్మాణం, రహదారుల నిర్మాణం జరుగుతుందన్నారు. వంద పడకల వైద్యశాల పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. యర్రగొండపాలెం పట్టణంలో అన్ని అంతర్గత రహదారులను సిమెంటు రోడ్లుగా మార్చే ప్రక్రియ దాదాపుగా పూరైందన్నారు. 


   ఈ కార్యక్రమములో ఏఎంసి చైర్మన్ ఒంగోలు మూర్తిరెడ్డి, ఎంపిపి దొంతా కిరణ్ గౌడ్, జడ్పిటిసి విజయభాస్కర్, సర్పంచ్ రామావత్ అరుణాబాయి, పంచాయితీ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, తహసిల్దార్ వాడాల వీరయ్య, సర్వేయర్ సురేష్, సి.ఐ.దేవప్రభాకర్, ఎస్.ఐ.పి.సురేష్, వైసిపీ నాయకులు పాల్గొన్నారు.

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండిAxact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: