సమగ్ర ప్రణాళికతో వేగంగా

భూముల రీసర్వే ప్రక్రియ


(జానో -జాగో వెబ్ న్యూస్_మార్కాపురం ప్రతినిధి)

భూముల రీసర్వే ప్రక్రియ సమగ్ర ప్రణాళికతో వేగంగా పూర్తి చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ జె.వెంకటమురళి(ఆర్.బి.అండ్ ఆర్), ఆదేశించారు. భూముల రీసర్వే ప్రక్రియపై రెవిన్యూ అధికారులు, సర్వేయర్లు, వి.ఆర్.ఓ.లతో మార్కాపురం డివిజన్ స్ధాయి సమావేశం పెద్దారవీడు మండలం ఓబులక్కపల్లి గ్రామంలోని దొడ్ల డెయిరీ ఆవరణలో గురువారం జరిగింది. ముందుగా తర్లుపాడు మండలం కేతగుడిపాడు గ్రామంలో అన్యాక్రాంతమైన ఏ.పి.ఎం.జె.పి., ఏ.పి.బి.సి. సంక్షేమ పాఠశాల భూమిని జె.సి. పరిశీలించారు. అనంతరం మార్కాపురం మండలంలోని రాయవరం గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పధకం సర్వే, రుణాలు తిరిగి చెల్లింపు ప్రక్రియను ఆయన పరిశీలించారు.


లక్ష్యం మేరకు రుణాల తిరిగి చెల్లింపు వేగంగా పూర్తి చేయాలన్నారు. సిబ్బంది పనితీరు సరిగా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పనివేళల్లో కార్యాలయంలో లేకుండా వెళ్లడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. గడువు దాటిన అర్జీలు పెండింగ్ లో ఉండడంపై ఆయన పలు సూచనలు చేశారు. పనితీరు మెరుగుపరుచుకోవాలని, ప్రజలకు మంచి సేవలు అందించాలని ఆయన తెలిపారు.

       భూముల రీసర్వే పూర్తయితే గ్రామ సచివాలయాలన్నీ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా మారుతాయని జిల్లా సంయుక్త కలెక్టర్ జె.వెంకటమురళి తెలిపారు. ఇక నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభ తరమవుతుందన్నారు. దీంతో రెవిన్యూ దస్త్రాలు స్వచ్ఛీకరణ జరుగుతాయన్నారు. అలాగే రైతుల భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కారమవుతాయని ఆయన వివరించారు. రైతులు, నిరుపేదలు కార్యాలయాల చుట్టూ తిరిగేపని ఉండదన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలననుసరించి సర్వే సమర్ధంగా చేపట్టాలన్నారు. జిల్లాలో 8.60 లక్షల వ్యవసాయ భూములు ఉన్నాయన్నారు. ఇప్పటివరకు 86వేల ఎకరాలలో డ్రోన్ ల ఆధారంగా ఛాయచిత్రాలను తీసినట్లు వివరించారు.


వివిధ గ్రామాలలోని రైతుల భూములను రీసర్వేలో కొలతలు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఇప్పటివరకు భూముల సర్వే సుమారుగా 10 శాతం జిల్లాలో జరిగిందన్నారు. సర్వే ప్రక్రియ వేగంగా నిర్వహించడానికి ఈ నెలాఖరులోగా 30 రోవర్లు, రెండు డ్రోన్ లు ప్రకాశంజిల్లాకు రానున్నాయని తెలిపారు. రైతుల భూములను పక్కాగా సర్వే చేయాలని ఆయన చెప్పారు. ఒంగోలు డివిజన్ పరిధిలో అత్యధికంగా సర్వే జరిగిందన్నారు. భూముల విస్తీర్ణాన్ని డ్రోన్ లు, రోవర్ల ద్వారా పక్కాగా కొలతలు వేయాలన్నారు. పంట భూముల సరిహద్దులను స్పష్టంగా నిర్ధారించాలన్నారు. 70 నుంచి 85 శాతం పొలాల గట్లు ఆధారంగా కొలతలు వేయాలని ఆయన సూచించారు. క్షేత్రపరిశీలనలో సరిహద్దులు గుర్తించలేని పరిస్ధితులలో రోవర్ ద్వారా నిర్ధారించుకోవాలన్నారు. రైతులకు అవగాహన కల్పించడం రెవిన్యూ అధికారుల బాధ్యాతేనని ఆయన వివరించారు. రీ సర్వేలో  భూమి కొలతలు వేస్తున్న సమయంలో రైతులను చైతన్య పరచాలని, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమంపై అవగాహన కల్పించాలని ఆయన పలు సూచనలు చేశారు. 

   ఈ సమావేశంలో మార్కాపురం ఆర్.డి.ఓ. కె.లక్ష్మీశివజ్యోతి, ప్రత్యేక ఉప కలెక్టర్ శ్రీదేవి, సర్వే ల్యాండ్స్ ఎ.డి. నాగూర్ బాష, తహశీల్దార్లు, మండల,గ్రామ సర్వేయర్లు, వి.ఆర్.ఓ.లు తదితరులు పాల్గొన్నారు.

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండిAxact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: