వచ్చే ఏడాది చివరికల్లా పీఎంఏవై ఇళ్లు

హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం

పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం


(జానో -జాగో వెబ్ న్యూస్_విజయవాడ బ్యూరో)

రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) పథకం కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ధిష్ట కాల పరిమితిని నిర్ణయించిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై తదుపరి విచారణ అవసరంలేదని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ పథకం కింద నిర్మించిన ఇళ్ల నిర్మాణంపై టీడీపీ నేత దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌) పరిష్కరిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. ప్రభుత్వం తాను నిర్దేశించిన కాలపరిమితి మేరకు నడుచుకుంటుందని ఆశిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద రాష్ట్రంలో 84వేల ఇళ్ల నిర్మాణం జరిగిందని, ఈ ఇళ్లను లబ్ధిదారులకు అందజేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరుకు చెందిన టీడీపీ కార్యకర్త జాలా బాలాజీ గత ఏడాది హైకోర్టులో పిల్‌ దాఖలుచేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇటీవల సీజే ధర్మాసనం విచారణ జరిపింది.


ఈ సందర్భంగా ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లోని అంశాలను ధర్మాసనం ప్రస్తావించింది. 45వేల ఇళ్లను ఈ ఏడాది డిసెంబర్‌ చివరి నాటికి లబ్ధిదారులకు అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అందులో పేర్కొంది. 2022 మార్చి నాటికి 75వేలు ఇళ్లు, జూలై 22 నాటికి 70వేలు, డిసెంబర్‌ 22 నాటికి 72 వేల ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తామని వివరించింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ఈ వ్యాజ్యంపై తదుపరి విచారణ అవసరంలేదంటూ ఉత్తర్వులు జారీచేసింది. 



         

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: