హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన,,,,

మైఫస్ట్‌ ఎక్స్‌పీ


(జానో -జాగో వెబ్ న్యూస్_బిజినెస్ బ్యూరో)

భారతదేశపు అత్యాధునిక ఏఐ–ఎంఎల్‌ ఆధారిత జాబ్‌ గ్యారెంటీ ప్రోగ్రామ్‌ మైఫస్ట్‌ఎక్స్‌పీ . ఇంటర్న్‌షిప్స్‌ లేదా ఉద్యోగ భద్రత కోసం వెదుకుతున్న వ్యక్తులకు సహాయపడుతుంది. ఈ విభాగంలో అగ్రగామి  మరియు భారతదేశంలో  అతిపెద్ద  కో –లివింగ్‌ మరియు స్టూడెంట్‌ హౌసింగ్‌ బ్రాండ్‌ జోలో ఆవిష్కరించిన  మైఫస్ట్‌ఎక్స్‌పీ ని నేడు హైదరాబాద్‌లో ఆవిష్కరించిన వెంటనే సానుకూల స్పందనను చవిచూసింది.

జోలో కమ్యూనిటీ వద్ద  ఈ ఆలోచన ఉద్భవించింది. మహమ్మారి కాలంలో లీడర్‌ షిప్‌ బృందంతో  పాటుగా ఆవాసితులు ఉద్యోగాలు కోల్పోయిన వారికి మరో ఉద్యోగం పొందడంలో సహాయపడ్డారు. ఉద్యోగ ఇంటర్వ్యూలకు ఏ విధంగా సిద్ధం కావాలి, ఉద్యోగానికి తగిన విజ్ఞానం ఉండటమనేది ఆ ఉద్యోగం పొందడంలో  ఏ విధంగా సహాయపడుతుందనేది సైతం టీమ్‌ తెలుసుకోగలిగింది. విభిన్నమైన ప్రోగ్రామ్‌ల ద్వారా ప్రజలు ఏమి అభ్యసిస్తున్నారు మరియు ఉద్యోగాలలోకి తీసుకునేటప్పుడు ఎంప్లాయర్లు ఏమి ఆశిస్తారనే అంశాల నడుమ సమస్యలను తీర్చడమే లక్ష్యంగా మైఫస్ట్‌ఎక్స్‌పీ చేసుకుంది.


ఈ నూతన ఆవిష్కరణ గురించి డాక్టర్‌ నిఖిల్‌ సిక్రీ, సీఈవో అండ్‌ కో–ఫౌండర్‌, మై ఫస్ట్‌ ఎక్స్‌పీ మాట్లాడుతూ ‘‘సరైన  ఉద్యోగం పొందడంలో  విద్యార్థులు, వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ ఎదుర్కొంటున్న సమస్యలకు తగిన పరిష్కారమందించేలా ఓ పరిష్కారం తీసుకురావాలన్న స్ఫూర్తిని మహమ్మారి మాకు కలిగించింది. అతి తక్కువ ఉద్యోగార్హతలు కలిగి ఉండటం చేత చాలా మంది తమ కలల ఉద్యోగాలను పొందలేకపోతున్నారు. మైఫస్ట్‌ఎక్స్‌పీతో ఉద్యోగార్థులకు, ఉద్యోగులను నియమించుకునే వారికి పరస్పర ప్రయోజనం పొందగలరు’’ అని అన్నారు.

మైఫస్ట్‌ఎక్స్‌పీ సీఓఓ జవహార్‌ సహుకరు మాట్లాడుతూ ‘‘ఈ కంపెనీ జాబ్‌ గ్యారెంటీడ్‌ ప్రోగ్రామ్‌ ఎక్స్‌పీ జాబ్స్‌ను సైతం అందిస్తుంది. తమ తొలి ఉద్యోగం లేదా ఉద్యోగ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న వారికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసేలా తీర్చిదిద్దారు’’ అని అన్నారు.

మైఫస్ట్‌ఎక్స్‌ యొక్క  సీటీఓ అమిత్‌ దీక్షిత్‌ మాట్లాడుతూ ‘‘అత్యుత్తమ ఫలితాలకు భరోసానందిస్తూ  భారతదేశంలో విప్లవాత్మక వేదికను మెషీన్‌ లెర్నింగ్‌ సాంకేతికత తోడుగా మైఫస్ట్‌ ఎక్స్‌పీ అభివృద్ధి చేసింది. ఇది స్ర్కీనింగ్‌, కోర్సు పంపిణీ మొదలు ఇంటర్వ్యూ వరకూ అనుమతిస్తుంది. ఈ వేదిక కృత్రిమ మేథస్సు మరియు మెషీన్‌ లెర్నింగ్‌ మోడల్స్‌ను వినియోగిస్తుంది. తద్వారా వినియోగదారులకు సౌకర్యవంతమైన అనుభవాలను సైతం అందిస్తుంది’’ అని అన్నారు.

మైఫస్ట్‌ఎక్స్‌పీ పై ఇప్పటికే  600కు పైగా కార్పోరేట్స్‌ నుంచి 5వేలకు పైగా ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి రోజూ 2వేలకు పైగా అభ్యర్థులను పరీక్షిస్తున్నారు.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: