'స్వచ్ఛత అందరికోసం'

- డాబర్ హనీ వారి ప్రచారం

- నేడు ప్రత్యేక అవసరాలు గల వ్యక్తుల అంతర్జాతీయ దినోత్సవం

(జానో -జాగో వెబ్ న్యూస్_బిజినెస్ బ్యూరో)

ప్రపంచంలోనే నంబర్ వన్ బ్రాండ్ గా ప్రత్యేక గుర్తింపు పొందిన డాబర్ హనీ స్వచ్ఛత గురించిన సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 3 వ తేదీ  ప్రత్యేక అవసరాలు గల వ్యక్తుల అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని 'స్వచ్ఛత అందరి కోసం' అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రచారంలో భాగంగా రూపొందించిన ఫిల్మ్ ను రూపొందించింది.  సాధికారత, సమానావకాశాలు తదితర అంశాలను కూర్చి రూపొందించిన ఈ ఫిల్మ్ ప్రచారానికి వినియోగించుకోనున్నారు. 


'ప్రత్యేక అవసరాలు గల వ్యక్తులు సాధారణ ప్రజలకు ఏమాత్రం తీసిపోరనే భిన్నమైన సందేశాన్ని ఈ ప్రచారం ద్వారా ఇవ్వాలని సంస్థ భావిస్తున్నాం. సంస్థ అభివృద్ధి లో ప్రత్యేక అవసరాలు గల ప్రజల పాత్రా తక్కువేమీ కాదు.  వారికి కృతజ్ఞతలు తెలుపుకునేందుకు ఈ ప్రత్యేకమైన రోజును సావకాశంగా భావిస్తున్నాము. తమ జీవితంలోని ఒడిదుడుకులను ఎదుర్కోవడంలో  ఒకరికొకరుగా నిలిచి, ప్రతీ క్షణాన్ని మధురఘట్టంగా  ఎలా మలుచుకున్నారనే సందేశాన్ని ఈ వీడియో ప్రతిఫలింపచేస్తుం. స్వచ్ఛతకు మారుపేరైన డాబర్ తేనె ప్రజల జీవితాల్లో ఎలాంటి ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుందో చెప్పడానికి ఇదో ప్రతీక అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. తియ్యదనం,  ఆరోగ్యంతోపాటు సంబరాలను పంచుతుంది' అని డాబర్ ఇండియా లిమిటెడ్ కేటగిరి హెడ్ శ్రీ కునాల్ శర్మ చెప్పారు.


ఈ ప్రచార కార్యక్రమం రూపుదాల్చడం, అమలుపరచడం వెనుక కింటెల్  ఏజెన్సీ పాత్ర ఎంతో ఉంది.  వికలాంగులు  మనలాగే సాధారణ జీవితం గడపడమే కాదు, ఇటువంటి అద్భుతమైన ఉత్పత్తులను నిస్సందేహంగా మనలాగే వినియోగిస్తారు కూడా. అలా వివియోగించే ఎందరో స్నేహితులు నాకు ఉన్నారు. వారు మనలాగే తమ జీవితాల్లోని ప్రత్యేక రోజులను, ఉత్సవాలను మనలాగే ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రతికూలతలను  అవగాహన చేసుకుని, వాటిని అంగీకరించి మరీ వారు ఎంతో సంతోషమైన జీవితాన్ని గడపడం వారి ప్రత్యేకతగా చెప్పవచ్చు. అటువంటి ప్రత్యేకత ద్వారా నేను కూడా ఎంతో కొంత స్ఫూర్తి పొందాను. ఇటువంటి సినిమాల ద్వారా వారికి మంచి అవకాశాలు కల్పించడంగా నేను భావిస్తున్నాను.  మూసపద్ధతి ఆలోచనలకు స్వస్తి పలికేలా

నాకు కొత్త పాఠాలు నేర్పిన వారికి  ధన్యవాదాలు' అని కింటేల్  వ్యవస్థాపక సీఈఓ సహస్ర బుద్ధి అన్నారు.

ప్రముఖ కవి, రచయిత మరియు నటుడు స్వానంద్ కిర్కిరే ఈ ఫిల్మ్ కు స్క్రిప్ట్ రాయడంతోనే అది ఉన్నత స్థాయికి చేరుకుంది. స్వతంత్రత మరియు సాధికారతలను ముఖ్యాంశంగా అంధ జంటను పాత్రధారులుగా మలిచి  అందంగా వ్రాసిన ఈ స్క్రిప్ట్ కు

తన గాత్రాన్ని కూడా అందించడం మరో విశేషం.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: