తుఫాన్ ఏఫెక్ట్...రాకపోకలకు అంతరాయం

జావద్‌ తుపాన్‌ ప్రభావతో 95 రైళ్లు రద్దు

(జానో జాగో వెబ్ న్యూస్-ఏపీ ప్రతినిధి)

తుఫాను కారణంగా ఏపీలోని జన జీవితాలు స్థంభించిపోతే ఇతర ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్లే రైలు ప్రయాణికులకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తుఫాను..వరదల  కారణంగా పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ లు కొట్టుకుపోయాయి. తాజాగా జావద్ తుపాను ఎఫెక్ట్ కారణంగా తూర్పు కోస్తా రైల్వే అప్రమత్తం అయింది. గురువారం నుంచి మూడు రోజుల పాటు పలు రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది. ఈ మేరకు మొత్తం 95 రైళ్లను రద్దు చేసింది. గురువారం రద్దు చేసిన రైళ్లు : సిల్చార్ త్రివేండ్రం సెంట్రల్‌, త్రివేండ్రం శాలీమార్‌,  బెంగుళూరు కంటోన్మెంట్‌- గౌహతి,  అహ్మదాబాద్‌-పూరి ఎక్స్‌ప్రెస్‌, కన్యాకుమారి- దిబ్రుఘర్‌

శుక్రవారం రద్దు చేసిన రైళ్లు:

పూరి- గుణుపూర్, భువనేశ్వర్-రామేశ్వరం, హౌరా-సికింద్రాబాద్ పలకనామ ఎక్స్‌ప్రెస్‌, పూరి-యశ్వంత్‌పూర్‌ గరీబ్ రథ్, హౌరా-యశ్వంత్ పూర్-దురంతో, భువనేశ్వర్-ముంబై కోణార్క్ ఎక్స్ ప్రెస్, పురిలీయా-విల్లుపురం ఎక్స్ ప్రెస్, పురీ-తిరుపతి, హౌరా-హైదరాబాద్ -ఈస్ట్ కోస్ట్, హౌరా-చెన్నై కోరమండల్, హౌరా-మైసూర్ వీక్లీ, సంత్రాగాచ్చి-చెన్నై, విశాఖపట్నం హౌరా ఎక్స్ ప్రెస్, హౌరా-యశ్వంత్ పూర్, హౌరా-చెన్నై మెయిల్, పాట్నా-ఎర్నాకులం ఎక్స్ ప్రెస్, రాయగఢ్-గుంటూరు ఎక్స్ ప్రెస్, సంబల్ పూర్-నాందేడ్ ఎక్స్ ప్రెస్, కొర్బా-విశాఖ. ధన్ బాద్-అలిప్పీ, టాటా-యశ్వంత్ పూర్, పూరీ-అహ్మదాబాద్, భువనేశ్వర్-జగదల్పూర్, చెన్నై సెంట్రల్‌-హౌరా, హైదరాబాద్-హౌరా, చెన్నై-భువనేశ్వర్, 1226 యశ్వంత్ పూర్-హౌరా-దూరంతో, సికింద్రాబాద్-హౌరా-ఫలక్ నుమా, తిరుపతి-పూరీ, యశ్వంత్ పూర్-హౌరా, సికింద్రాబాద్-భువనేశ్వర్-విశాఖ ఎక్స్‌ప్రెస్‌, చెన్నై-హౌరా, వాస్కో-హౌరా, తిరుచురాపల్లి-హౌరా, బెంగళూర్-భువనేశ్వర్, ముంబై-భువనేశ్వర్, విశాఖ-కొర్బా, విశాఖ-రాయగఢ్, గుంటూరు-రాయగఢ్,  జగడల్ పూర్-భువనేశ్వర్, జునాఘర్ రోడ్-భువనేశ్వర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 


శనివారం రోజు రద్దు అయిన రైళ్లు:

భువనేశ్వర్-ప్రశాంతి నిలయం, హాతియా-బెంగుళూరు, భువనేశ్వర్-విశాఖ, భువనేశ్వర్-సికింద్రాబాద్, గుణపూర్-పూరీ, విశాఖ – నిజాముద్దీన్- సమత ఎక్స్ ప్రెస్, విశాఖ-కిరండోల్ రైళ్లను రద్దు చేశారు. మొత్తంగా 95 రైళ్లను రద్దు చేసినట్టు తూర్పు కోస్తా రైల్వే అధికారులు ప్రకటించారు.


Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: