ప్రకాశం జిల్లా రైతులు చేసిన పాపం ఏమిటి

మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

పంట నష్ట పరిహారం  చెల్లించే జాబితాలో ప్రకాశం జిల్లా లేకపోవడంపై మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రకాశం జిల్లా రైతులు  చేసిన పాపమేమిటీ అని ఆయన ప్రశ్నించారు. ఆదివారంనాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కందుల నారాయణ రెడ్డి మాట్లాడారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం తో పాటు ప్రకాశం జిల్లా రైతులు కూడా  వేల కోట్ల రూపాయల చేతికి వచ్చిన పంట నీటి పాలైందని తెలిపారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కడప, చిత్తూర్, నెల్లూరు, అనంతపురం జిల్లాలకు చెందిన అధికారులను సమగ్ర పంట నష్ట నమోదు చేయాలని ఆదేశించారని ఆ వరుసలో ప్రకాశం జిల్లా లేకపోవడం బాధాకరమని


ప్రకాశం జిల్లా పై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఇక్కడ కూడా మార్కాపురం డివిజన్లో భారీగా రైతులు పంట నష్టం చూశారని వందల కోట్ల రూపాయల పంట నీటిపాలైంది అని తక్షణమే ముఖ్యమంత్రి గారు ప్రకాశం జిల్లా ఉన్నత అధికారులకు  కూడా తగు ఆదేశాలు జారీ చేసి క్షేత్రస్థాయిలో పంట నష్ట సమగ్ర సర్వే చేసి రైతులను ఆదుకోవాలని సూచించారు.

 


ఇటీవల గత ప్రభుత్వాలు ఇచ్చిన పక్కా ఇళ్లకు రిజిస్ట్రేషన్ అంటూ పదివేల రూపాయలు ప్రతి ఇంటికి వసూలు మొదలుపెట్టారని రాష్ట్రం మొత్తం మీద 1500 కోట్ల రూపాయల వసూలు చేయాలని అధికారులకు టార్గెట్లు విధించి పేద ప్రజలను జలగల వలె వారి రక్తం పిలుస్తున్నారని, రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం అని, ఎవరు ఒక్క రూపాయి కూడా చెల్లించ వద్దని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెలలోపు పక్కా గృహాల లబ్ధిదారులకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తామని తెలిపారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటరీ తెలుగుదేశంపార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, మార్కాపురం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ మౌలాలి, బీసీ నాయకులు దూదేకుల మస్తానయ్య, షాకీర్ తదితరులు పాల్గొన్నారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


– ,  


  

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: