పూలేకు ఘన నివాళ్లులు

పూలే సేవలు మరవలేనివి

ఏపీ ఎంబీసీ సంక్షేమ సంఘం నేతలు

మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటాలను బహూకరిస్తున్న..... ఏపీ ఎంబిసి సంఘం సభ్యులు

(జానోజాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

మహాత్మా జ్యోతిరావు పూలే 131 వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఏపీ ఎంబీసీ సంక్షేమ సంఘం నేతలు నివాళ్లులర్పించారు. కర్నూలు జిల్లా, పాణ్యం నియోజవర్గం, గడివేముల మండలం లో ఏపీ ఎంబిసి సంఘం వారు మహాత్మ జ్యోతి రావు పూలే చిత్రపటాలను బహూకరించడం జరిగింది. అసలు ఎవరు ఈ మహాత్మ జ్యోతిరావు పూలే అంటే ఎవరో తెలుసుకుందాం, ఆధునిక భారతదేశంలో మొట్టమొదట బ్రాహ్మణీయ, కులతత్వ సంస్కృతి కి  మతతత్వ సంస్థల పై  వ్యతిరేకతను ప్రదర్శించిన వ్యక్తి మహాత్మజ్యోతిరావు పూలే, ఆయన సతీమణి సావిత్రిబాయి ఈ దంపతులు ఇద్దరూ మహారాష్ట్ర వాసులు వీరి యొక్క ముఖ్య లక్ష్యం స్త్రీలు, శూద్రులు, అతి శూద్రులు అందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడం వారందరికి విద్యను నేర్పించి, విజ్ఞానవంతులుగా చేయడం వీరి యొక్క ఉద్యమ లక్ష్యం, మహాత్మ జ్యోతిరావు పూలే సామాజిక విప్లవ పిత గా గుర్తింపు పొందారు, ప్రత్యామ్నాయ వ్యవస్థ నిర్మాతగా 1873లో సత్యశోధక్ సమాజ్ అనే సంస్థను స్థాపించాడు. ఇది మొట్ట మొదటి కుల వ్యతిరేక ఉద్యమ సంస్థ, మహాత్మా జ్యోతిరావు పూలే ప్రధానంగా విద్యను ప్రతి ఒక్కరికి నేర్పించాలని తన జీవితాంతం కృషిచేసిన మహనీయుడు 28-11-21 వ తేదీన మహాత్మ జ్యోతిరావు పూలే 131 వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని ఆశయాలను వారి యొక్క ఉద్యమస్ఫూర్తిని ప్రతి పల్లె పల్లెకు తెలియజేయాలనే ఉద్దేశంతో గడివేముల మండల ఏపీ బీసీ సంఘం సభ్యులు గని ప్రభుత్వ పాఠశాల, గడివేముల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, గడివేముల ఎంపీడీవో విజయసింహారెడ్డి గారికి, గడివేముల ఎస్ఐ శ్రీధర్ గారికి, జెడ్ పి హెచ్ ఎస్ ఇన్చార్జి హెచ్ఎం దస్తగిరమ్మ గారికి మహాత్మ జ్యోతిరావు పూలే గారి చిత్రపటాలు అందించారు. ఈ సందర్భంగా ఏపీ ఏపీ బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె,ప్రసాద్ మాట్లాడుతూ 1-1-22 వ తేదీ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి నాటికి మండలంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పూలే గారి చిత్రపటాలు బహూకరించి ప్రతి విద్యార్థినీ విద్యార్థులకు జ్యోతి రావు పూలే గారి యొక్క ఆశయాలను వారి యొక్క ఉద్యమస్ఫూర్తిని తెలియజేస్తామని పేర్కొన్నారు, బడుగు బలహీన వర్గాలు చైతన్యం కావాలంటే ముఖ్యంగా వీరికి విద్య చాలా అవసరమని గ్రహించి విద్య లేకపోతే బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఎలా ఉంటుందో అని తెలియజేస్తూ

"విద్య లేకపోతే వివేకం నశిస్తుంది,

వివేకం లేక నీతి నశిస్తుంది,

నీతి లేక అభివృద్ధి కుంటుపడింది,

అభివృద్ధి లేక సంపద అదృశ్యమైంది,

సంపద లేక బడుగు బలహీన వర్గాలు క్షీణ దశకు చేరుకున్నారని,,,, వీటన్నిటికీ 

ప్రధాన మూల కారణం కేవలం విద్య మాత్రమేనని బలంగా విశ్వసించిన వ్యక్తి మహాత్మ జ్యోతిరావు పూలే అని పేర్కొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కే గోపాల్ మాట్లాడుతూ సమాజంలో సగభాగం స్త్రీలు ఉన్నారని, స్త్రీలకు విద్యను అందిస్తే తప్ప ఈ సమాజం లో మార్పు రాదని గ్రహించి ప్రథమంగా 1-1-1848 వ తేదీన పాఠశాలను ప్రారంభించారు. అదే భారతదేశంలో మొట్టమొదటి పాఠశాల 1855లో జ్యోతిరావు పూలే రాసిన "తృతీయ రత్న"అనే నవలలో ముఖ్య పాత్రధారులైన పాటిల్, జోగా బాయ్, అనే కూలి చేసుకునే భార్య భర్తలు ఇరువురు నీ వయోజన పాఠశాలలకు పంపడం, అనేది ఆ కథ యొక్క సందేశం, ఆనాడు పూలే గారు ప్రారంభించిన వయోజన విద్యాలయాలు ఇప్పటి ప్రభుత్వాలు రాత్రిపూట పాఠశాలలుగా నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లో ఏ పీ ఎం బీసీ సంఘం సభ్యులు, జి .వెంకటేశ్వర్లు,ఎం. వెంకన్న, కె.మద్దిలేటి, పి.సుబ్బరాయుడు, ఏ.ఈశ్వర్ ప్రసాద్, పాల్గొన్నారు,

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: