పూలే సేవలు మరవలేనివి

పూలేకు ఘన నివాళ్లులర్పించిన కాంగ్రెస్ నేతలు

(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల  ప్రతినిధి)

నంద్యాల పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఆదివారంనాడు కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని రైతు నగరంలోనున్న నంద్యాల కాంగ్రెస్ కమిటీ డి సి సి ఆఫీసు నందు జ్యోతిరావు పూలే 131 వర్ధంతిని  నంద్యాల టౌన్ అధ్యక్షులు దాసరి చింతలయ్య ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా చింతలయ్యతోపాటు నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు షేక్ అబ్దుల్లా, సీనియర్ నాయకులు యస్ యండి ఫరూక్, వారు మాట్లాడుతూ ఏపీసీసీ అధికార ప్రతినిధి v, వాసు గారు ట్రెజరర్ టీచర్ ప్రసాద్, రైతు సమాఖ్య శివారెడ్డి, సీనియర్ నాయకులు అహ్మద్ హుసేన్ మరియు రెడ్డి హుస్సేన్  మరియు కార్యకర్తలు కలిసి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు జ్యోతిరావు పూలే చేసిన వంటిది త్యాగాలను


స్మరించుకుంటూ పులే 131 వ వర్ధంతిని జరుపుకోవడం జరిగింది అని తెలిపారు. సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడైన జ్యోతీరావ్ గోవిందరావ్ ఫులే మహారాష్ట్ర లోని సతారా జిల్లాలోని వ్యవసాయ కుటుంబంలో 1827 ఏప్రిల్‌ 11న జన్మించాడు. ఈ‍యన ఏడాదిలోపే పూలే తల్లి మరణించింది.జోతిరావుపులే 63 ఏళ్ల 7 నెలల 18 రోజుల జీవితాచరిత్ర తన చదువును కొనసాగిస్తున్న సమయంలోనే అంటే పూలే 13వ ఏట 9ఏళ్ల సావిత్రి బాయితో వివాహం జరిపించారు. తన చదువులు పూర్తి చేసుకున్న అనంతరం పూల వ్యాపారం చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకునేవారు. 1848లో జరిగిన ఒక సంఘటన పూలేని గాయపర్చింది. దీంతో పూలే అప్పటి నుంచి వివక్షపై పోరాడాలని నిశ్చయించుకున్నారు . దాంతోపాటు సమాజంలో స్త్రీలు విద్యావంతులు కావాలనే నిర్ణయానికొచ్చారు . తన భార్య సావిత్రిబాయి పూలేని పాఠశాలకు పంపించారు. 1848లో మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించారు. ఆయన స్థాపించిన పాఠశాలలో అన్ని కులాల వారికి ప్రవేశం కల్పించారు. అతను తక్కువ కులానికి చెందినవారు కావడంతో ఆ పాఠశాలలో విద్యను బోధించడానికి ఎవరూ ముందుకు రాలేదు. దాంతో తన భార్య సావిత్రి బాయి పూలేని ఆ పాఠశాలకు మొదటి మహిళా ఉపాధాయురాలిగా నియమించారు.. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


– ,  


   

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: