వైభవంగా ప్రారంభమైన ఏపీ సీఎం కప్

మండల స్థాయి ఎంపికలు

పాల్గొన్న క్రీడాకారిణి, క్రీడాకారులు

(జానో జాగో వెబ్ న్యూస్_గడివేముల ప్రతినిధి)

కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం లోని స్థానిక జడ్.పి.హెచ్.ఎస్  స్కూలు ఆవరణలో ఏపీ సీఎం కప్ పోటీలు రంగ రంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎంపీడీవో విజయ సింహారెడ్డి, ముఖ్య అతిథులుగా గడివేముల ఎమ్మార్వో నాగమణి, గడివేముల ఎస్సై శ్రీధర్,    గడివేముల జడ్పిటిసి సభ్యులు ఆర్.బి,చంద్రశేఖర్ రెడ్డి, గడివేముల ఎంపీపీ నాగ మద్దమ్మ, గడివేముల ఎం పి టి సి వంగాల మహేష్ రెడ్డి, గడివేముల సర్పంచ్ రమణమ్మ, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ చెన్నకేశవులు,జడ్పీహెచ్ఎస్ స్కూల్ ఇన్చార్జి హెచ్ఎం దాస్తగిరమ్మ, ఏపీ సీఎం కప్ కోఆర్డినేటర్ పిచ్చిరెడ్డి,కర్నూలు జిల్లా క్రీడా సమాఖ్య కార్యదర్శి రమణారెడ్డి,ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. క్రీడాకారులను ఉద్దేశించి ఎంపీడీవో విజయ సింహారెడ్డి మాట్లాడుతూ

ఏపీ సీఎం కప్ కబడ్డీ పోటీలను ప్రారంభిస్తున్న గడివేముల జడ్పిటిసి సభ్యులు ఆర్ బి చంద్రశేఖర్ రెడ్డి
ప్రతి గ్రామంలోని, మండలాలలోని ఆసక్తి గల క్రీడాకారులు అందరూ ఏపీ సీఎం కప్ కప్పులో భాగస్వామి కావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోటీలను ఈ క్రీడా సంబరాలను ప్రారంభించారని కావున ప్రతి క్రీడాకారులు వారి వారి ఇ ఆటలలో నైపుణ్యాన్ని నిష్ణాత ను కలిగిన క్రీడాకారులను ఎంపిక చేయడం జరుగుతుందని గ్రామీణ స్థాయిలో ఉండే క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే ఏపీ సీఎం కప్ క్రీడలను ప్రారంభించారని కావున క్రీడాకారులు మరియు క్రీడాకారిణిలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
మహిళా వాలీబాల్ పోటీలను ప్రారంభిస్తున్న గడివేముల ఎమ్మార్వో నాగమణి

గడివేముల మండల ఎమ్మార్వో నాగమణి గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే ఆటలు అవసరం అని ఆటల తోనే ఇతరుల పట్ల స్నేహ భావము వారికి మానసికంగా ఇబ్బందులు ఎదురైనప్పుడు వాటిని ఎలా సమర్థవంతంగా ఎదుర్కోవాలనే ధైర్యాన్ని సమయస్ఫూర్తిని ఇచ్చేవి కేవలం ఆటలు తోనే సాధ్యమని ఆమె పేర్కొన్నారు.

క్రీడాకారులకు భోజన వసతి కల్పించిన జడ్పిటిసి సభ్యులుు ఆర్ బి చంద్రశేఖర్ రెడ్డి ని సన్మానిస్తున్న జడ్పీ హైస్కూల్ వ్యాయామ ఉపాధ్యాయులు మరియు ఇతర ఉపాధ్యాయులు

గడివేముల జడ్పిటిసి సభ్యులు ఆర్బి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఆరోగ్యవంతులుగా ఉండేందుకు గ్రామంలోని నైపుణ్యంగల క్రీడాకారులను గుర్తించేందుకు ఏపీ సీఎం కప్ పోటీలను ప్రారంభించారు అని క్రీడాకారులు అందరూ ఆటలలో నైపుణ్యాలను ప్రదర్శించాలని ఆయన పేర్కొన్నారు.

గడివేముల మండల ఎస్సై శ్రీధర్ గారు రు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ నేర్పే వే ఆటస్థలాలు అని క్రీడల్లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడు ఎంతో ఆరోగ్యంగా,దృఢంగా,మానసికంగా, ఉల్లాసంతో, క్రమశిక్షణ తో ఉండడానికి ఈ ఆటలు ఎంతో ఉపయోగపడతాయని,ఎంతో మంది క్రీడాకారులు నైపుణ్యం ఉన్న నాకు ఆర్థిక స్తోమత లేదు,నేను ఎంపిక కాను, అని చాలా మంది క్రీడాకారులు నిరుత్సాహ పడుతుంటారు,అయితే అలాంటి వారు నిరుత్సాహ పడకుండా వారి ఆటల్లో నైపుణ్యం ఉంటే నేను ఆర్థిక సాయం చేసి క్రీడాకారులకు చేయూత ఇస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో  మండల గడివేముల మండలం లోని 16 గ్రామాల్లోని క్రీడాకారిణిలు మరియు క్రీడాకారులు 250 మంది  ఆసక్తి గల క్రీడాకారులు పాల్గొన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు రవికుమార్, వెంకట్ ,ఇమామ్, కవిత ,బి వి ఆర్ ,కళాశాల వ్యాయామ ఉపాధ్యాయులు కృష్ణ ,రవి పెద్ద రాజు, తదితరులు పాల్గొన్నారు. ఏపీ సీఎం కప్పులో పాల్గొనడానికి వచ్చినటువంటి క్రీడాకారులు అందరికీ ఉచిత భోజనాన్ని ఏర్పాటు చేసిన ఆర్ బి చంద్రశేఖర్ రెడ్డికి  క్రీడాకారిణి, క్రీడాకారులు మరియు వ్యాయామ ఉపాధ్యాయులు, జెడ్ పి హెచ్ ఎస్ స్కూల్ ఉపాధ్యాయులు, అందరూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు


 


Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: