బూతులు మాట్లాడే వాళ్లను వదిలేసి

అలాంటి వ్యాఖ్యలు వద్దని చెప్పిన మహిళలను వేధిస్తారా

కింజరాపు అచ్చెన్నాయుడు


(జానో -జాగో వెబ్ న్యూస్_విజయవాడ బ్యూరో)

బూతులు మాట్లాడిన వైసీపీ నేతల్ని వదిలేసి బూతులు మాట్లాడొద్దన్నందుకు తెలుగు మహిళలను వేధిస్తారా అని టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అరెస్టు చేయాల్సింది తెలుగు మహిళల్ని కాదు, అసెంబ్లీ సాక్షిగా స్త్రీజాతిని అవమానించిన వైసీపీ నేతల్ని అని ఆయన పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణిపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యల్ని ఖండించిన అనంతపురం తెలుగు మహిళా నేతల్ని పోలీసుల వేధించటం దుర్మార్గమాని అన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామమని, అనంతపురంలోని తెలుగు మహిళా బీసీ నేతల ఇళ్లలోకి వెళ్లి పోలీసులు సోదాల పేరుతో భయబ్రాంతులకు గురిచేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు.  పోలీసులు  వారిని ఎందుకు వేదిస్తున్నారు..? బూతులు మాట్లాడిన  వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలను వదిలేసి బూతులు మాట్లాడొద్దన్నందుకు తెలుగు మహిళలను వేధిస్తారా..? , వైసీపీ నేతలు మహిళలను అసభ్యంగా మాట్లాడుతుంటే సాటి మహిళలుగా స్పందించటం తప్పా అని ఆయన ప్రశ్నించారు. మహిళల‎ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా‎ మాట్లాడిన వైసీపీ ప్రజాప్రతినిధులకు భద్రత పెంచిన ప్రభుత్వం  మహిళలను కించపరిచేలా మాట్లాడొద్దంన్నందుకు తెలుగు మహిళలను అరెస్టు చేస్తామని బెదిరించటం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు. అరెస్టు చేయాల్సింది తెలుగు మహిళలను కాదు...అసెంబ్లీ సాక్షిగా మహిళా లోకాన్ని అవమానించిన వైసీపీ మంత్రి, ఎమ్మెల్యేలను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళల పట్ల వైసీపీ నేతల వ్యహహారశైలి, భాష ప్రజలు అసహ్యించుకుంటున్నారని. ముఖ్యమంత్రికి మహిళలపై ఏ మాత్రం గౌరవం ఉన్నా అసెంబ్లీలో మహిళలను అవమానించిన వారిని వెంటనే పదవుల నుంచి తొలగించి మహిళలకు క్షమాపణలు చెప్పాలని కోరారు.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: