నాడు టీ అందించిన చేతులవి...

ఆ వ్యక్తి నోట నేడు విద్యార్థులకు పాఠాలు

టీ విక్రేత, నేడు కన్నూర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ అయిన రఫీక్‌

 


కష్టపడితే సాధ్యంకానిది ఏదీ లేదు. సంకల్ప బలం గట్టిదైతే ఓటమిని చవిచూడరు. అదే కేరళలోని ఓ టీ విక్రేత ఆచరణలో చూపారు. 34 ఏళ్ల రఫీక్ ఇబ్రహీం కేరళ లోని పనమరం పంచాయతీలోని ఏకోమ్‌ గ్రామస్థుడు. టీ-షాప్ యజమాని కుమారుడు అయిన రఫీక్ తన  బాల్యం పేదరికo లో గడిపాడు.  కానీ రఫీక్ జీవితంలో మెరుగుపడాలనే పట్టుదలతో ఉన్నాడు. టీ అమ్ముతూ, జీపుల్లో క్లీనర్‌గా వెళ్లి హోటల్‌లో పనిచేసేవాడు. ఇన్ని కష్టాలు పడుతూ కూడా పుస్తకాలు చదవడం కొనసాగించాడు మరియు డాక్టరేట్ సంపాదించగలిగాడు. 

రఫిక్ తండ్రి, ఇబ్రహీం, తల్లి, నబీసా కూడా పాఠశాలకు హాజరు కాలేదు. ఇంట్లో పరిస్థితులు చదువుకు అనుకూలించకపోయినప్పటికీ, రఫీక్ మరియు అతని అక్క బుషారా ఇద్దరూ SSLC పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. “SSLC పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ పొందిన రఫిక్ పేదరికం కారణంగా జీపులో డ్రైవర్‌గా లేదా క్లీనర్‌గా పనిచేసాడు. 


అప్పుల ఊబిలో కూరుకుపోయిన తండ్రి టీ దుకాణాన్ని అమ్మేయడంతో కుటుంబ పోషణ కరువైంది. అందుకే 19 ఏళ్ల వయసులో రఫిక్ మైసూరులోని స్నేహితుడి వద్దకు వెళ్లి టీ అమ్మేవాడిగా మారాడు. రఫిక్  BSc కోర్సులో చేరాడు మరియు మొదటి సంవత్సరం పరీక్షలు పూర్తి చేశాడు. కానీ రఫిక్ టైఫాయిడ్‌ బారిన పడటం తో ఇంటికి తిరిగి వెళ్ళవలసి వచ్చింది. ఇంట్లో పరిస్థితి సరిగా లేకపోవటం తో రఫిక్ మలప్పురం జిల్లాలోని వండూర్‌కి వెళ్ళి, అక్కడి బస్టాండ్‌లోని  హోటల్‌లో ఉద్యోగం చేయవలసి వచ్చింది.

రఫీక్ ఖాళీ సమయాల్లో అక్కడి పుస్తకాల షాపుల్లో పుస్తకాలు, మ్యాగజైన్లు చదవడం మొదలుపెట్టాడు. అయితే, బస్టాండ్‌ను పునరుద్ధరించాలని అధికారులు నిర్ణయించడంతో హోటల్‌ను మూసివేయాల్సి రావడంతో రఫీక్ మళ్లీ ఉద్యోగం కోల్పోయాడు

ఆ తర్వాత రఫీక్‌ కలపేటలోని ఓ ఫుట్‌వేర్‌ షాపులో సేల్స్‌మెన్‌గా పనిచేసాడు.. అక్కడ రెండేళ్లు పనిచేశాడు, ఇంతలో రఫిక్ సోదరికి సమాంతర కళాశాల parallel college లో ఉపాధ్యాయ ఉద్యోగం రావడంతో పరిస్థితి మెరుగుపడింది. స్నేహితుల ప్రోత్సాహంతో కాలికట్ యూనివర్సిటీ పరిధిలో బీఏ ఎకనామిక్స్ కోర్సులో చేరాడు. కలపేటలోని జిల్లా గ్రంథాలయంలో చాలా పుస్తకాలు చదివాను అని రఫిక్ అన్నాడు.

తరువాత, రఫిక్ కాలడిలోని శ్రీ శంకర సంస్కృత విశ్వవిద్యాలయంలో MA మలయాళం కోర్సు ఎంట్రన్స్ పరీక్ష రాసాడు.తరువాత విశ్వవిద్యాలయం లో సీట్ పొందాడు.రఫీక్‌ ఎం.ఫిల్ పూర్తి చేసి, ప్రొఫెసర్ ఇలయిడోమ్ మార్గదర్శకత్వంలో 'సాహిత్య రూపం మరియు సాంస్కృతిక చరిత్ర‘literary form and cultural history’ 'పై  డాక్టరేట్ సంపాదించాడు. నవంబర్ 6న కన్నూర్ యూనివర్సిటీలోని నీలేశ్వర్ క్యాంపస్‌లో మలయాళ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా రఫీక్ చేరాడు.

"నేను హీరోని కాదు, నాలాంటి వెనుకబడిన ప్రజలు వేలాది మంది ఉన్నారు, అదృష్టాన్ని మార్చే దాతృత్వానికి తన జీవితమే ఉదాహరణ. ప్రజలు జీవితంలో పైకి రావడానికి కావలసినది సరైన సమయంలో సహాయం చేయడమే." అని రఫీక్ అంటాడు.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: