శాంతియుత పాదయాత్రపై ప్రభుత్వం ఉక్కుపాదం 

చరిత్ర హీనులుగా మిగలొద్దు

నారా చంద్రబాబు నాయుడు

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ బ్యూరో)

అమరావతి రైతుల పాదయాత్రకు ప్రజలు నుంచి వస్తున్న మద్దతు చూసి వైసీపీ ఓర్వలేక పోతోంది అందుకే పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు, అవరోదాలు కల్పిస్తోందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పోలీసులను అడ్దుపెట్టుకుని  ఉక్కుపాదం మోపుతోంది.  కోర్టు అనుమతి ఇచ్చిన పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించడం హేయమైన చర్య.  పాదయాత్రను కోవిడ్ ఆంక్షల పేరుతో అడ్డుకోవడం సమంజసం కాదు. జగన్ చేసిన ప్రజాసంకల్ప యాత్రకు 4 ఏళ్ళు అని నిన్న వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేసి బహిరంగ సభలు పెట్టారు. వారికి లేని కరోనా నిబంధనలు రైతుల పాదయాత్రకు వర్తిస్తాయా? సీఎంకు ప్రజా వ్యతిరేకత పెరుగుతుండటంతో ప్రజల్ని పోలీసులతో అనగదొక్కుతున్నారు.ఇప్పటికే రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసి 5 కోట్ల మంది భవిష్యత్తు ని అంధకారంలో కి నెట్టి క్షమిoచరాని తప్పు చేశారు.  5 కోట్ల మంది ఆకాంక్షలనుగుణంగా  రైతులు చేస్తున్న పాదయాత్రను అడ్డుకుని చరిత్ర హీనులుగా మిగిలిపోవద్దు. అని ఆయన హితవు పలికారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: