నవంబర్ 2021

 ఏపీలో పేదల ఇళ్ల నిర్మాణానికి,,,

మార్గం సుగమం


(జానో జాగో వెబ్ న్యూస్-విజయవాడ బ్యూరో)

రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలు ఉండకూడనే ఉద్దేశంతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ “ ఇళ్ల నిర్మాణ పథకానికి “ మార్గం సుగమమైంది. రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్లు పథకంపై హైకోర్టులోని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్‌ బెంచ్‌ మంగళవారం రద్దు చేసింది. దీంతో ఇళ్ల స్థలాలపై హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను పిటిషనర్లు వెనక్కి తీసుకున్నారు.


కాగా, గత నెల 8వ తేదీన పేదలందరికీ స్థలాలు పథకంలో భాగంగా ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో ఎటువంటి నిర్మాణాలు చేయొద్దని హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పిచ్చిన విషయం తెలిసిందే. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఈ మేరకు హైకోర్టులోని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నట్లు డివిజన్‌ బెంచ్‌ తీర్పునిచ్చింది. 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


– ,  


   


 

 భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫిట్‌నెస్‌

సంక్షేమంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోన్న పోర్టల్‌

అత్యున్నత స్థాయి వ్యక్తిగతీకరణ  అందిస్తున్న స్మార్ట్‌ మిర్రర్‌ 

(జానో జాగో వెబ్ న్యూస్-బిజినెస్ బ్యూరో)

స్మార్ట్‌ మిర్రర్‌ ఆధారిత వ్యక్తిగతీకరణ ఫిట్‌నెస్‌ మరియు వెల్‌నెస్‌ ఉపకరణం, పోర్టల్‌ను అధికారికంగా నేడు మార్కెట్‌లోకి విడుదల చేశారు. పోర్టల్‌  ఫౌండర్లు ఇంద్రనీల్‌ గుప్తా మరియు విశాల్‌ చందపేట తో పాటుగా నగరంలోని సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ ఉత్పత్తికి సంబంధించి వినూత్నమైన, అత్యున్నత స్ధాయి ఉత్పత్తి ఫీచర్లును వివరించారు.

పోర్టల్‌లో  వందలాది వర్కవుట్స్‌ను ఆన్‌డిమాండ్‌ మరియు లైవ్‌ క్లాస్‌ల రూపంలో హిట్‌, స్ట్రెంగ్త్‌, డ్యాన్స్‌ ఫిట్‌నెస్‌, ఎండ్యూరెన్స్‌, యోగా, మైండ్‌ఫుల్‌నెస్‌, న్యూట్రిషన్‌ కోచింగ్‌ లో పొందవచ్చు.  ఈ ఉపకరణంలో ఉన్న బయో సెన్సార్లు ఒకరి రక్తపోటు, గ్లూకోజ్‌, ఈసీజీ, రెస్పిరేటరీ రేట్‌ వంటివి కూడా గుణిస్తారు. ఇవి వ్యక్తిగత వ్యాయామ ప్రక్రియను రూపొందించుకోవడంలో సహాయపడతాయి.


ఈ ఆవిష్కరణ సందర్భంగా పోర్టల్‌ ఫౌండర్‌ అండ్‌ సీఈవో ఇంద్రనీల్‌ గుప్తా మాట్లాడుతూ ‘‘అత్యున్నత శ్రేణి వ్యక్తిగత శిక్షణను పోర్టల్‌ అందించడంతో పాటుగా ప్రపంచ శ్రేణి పర్సనల్‌ ట్రైనర్‌ను సైతం పొందే అవకాశం అందిస్తుంది. తమ జీవనశైలికి లోబడి ఆరోగ్యవంతమైన ప్రక్రియలను చురుగ్గా స్వీకరించే అవకాశమూ అందిస్తుంది. ఆకర్షణీయమైన ఈ స్మార్ట్‌మిర్రర్‌, అత్యున్నత స్ధాయి వ్యక్తిగతీకరణతో పాటుగా ఏఐ శక్తివంతమైన ఫార్మ్‌ ఫీడ్‌బ్యాక్‌తో సమగ్రమైన ఆరోగ్య, సంక్షేమ సహచరునిగా నిలుస్తుంది. ప్రతి ఇంటిలోనూ నూతన తరపు వ్యక్తిగతీకరించిన ఫిట్‌నెస్‌ను పోర్టల్‌ తీసుకురానుందని ఆశిస్తున్నాము’’అని అన్నారు.

పోర్టల్‌ ఫౌండర్‌ మరియు సీటీఓ విశాల్‌ చందపేట మాట్లాడుతూ ‘‘మారుతున్న  వినియోగదారుల అవసరాలను పరిగణలోకి తీసుకుని ఈ స్మార్ట్‌ మిర్రర్‌ తీర్చిదిద్దాము.  నేడు ఫిట్‌నెస్‌ ప్రియులు జిమ్‌ వాతావరణంలో మాత్రమే తమ శిక్షణ ఉండటం మాత్రం కాకుండా నాణ్యమైన శిక్షణను కోరుకుంటున్నారు. ఈ స్మార్ట్‌మిర్రర్‌తో వారు వ్యక్తిగతీకరించిన ఫిట్‌నెస్‌ ప్రోగ్రామ్‌లను ఇంటివద్దనే పొందవచ్చు’’ అని అన్నారు.

 11.03 లక్షల మంది విద్యార్థులకు రూ.686 కోట్లు

కరోనా సమయంలోనూ విద్యా దీవెనతో ఫీజుల చెల్లింపు

గత సర్కారు బకాయిలతో కలిపి ఇప్పటివరకు రూ.6,259 కోట్లు చెల్లింపు

(జానో జాగో వెబ్ న్యూస్-విజయవాడ బ్యూరో)

కరోనా సమయంలో కూడా విద్యార్థుల చదువులకు ఇబ్బంది లేకుండా ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను చెల్లిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది మూడో విడతగా 11.03 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన కింద రూ.686 కోట్లు మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కడం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. 'ఈ రోజు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 11.03 లక్షల మంది విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందిస్తున్నాం. 2021 ఏప్రిల్‌ 19న మొదటి విడత.. జూలై​ 29న జగనన్న విద్యా దీవెన రెండో విడత నిధుల్ని నేరుగా తల్లుల ఖాతాల్లో జమచేశాం. పేదరికం చదువుకు అవరోధం కారాదు. ఉన్నత చదువులు అభ్యసిస్తేనే తల రాతలు మారుతాయి. కుటుంబంలో ఎంతమంది ఉన్నా అందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందిస్తున్నాం. బ్యాంకు ఖాతాల్లో జమవుతున్న ఫీజులు కాలేజీలకు తప్పకుండా కట్టాలి. లేకుంటే నేరుగా కాలేజీలకు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. ఉన్నత విద్యకోసం కాలేజీల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగింది' అని సీఎం జగన్‌ అన్నారు. 


సీఎం జగన్‌ మాటల్లోని ముఖ్యాంశాలు..

గతంలో నాన్నగారు ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను తీసుకు వచ్చారు. ఆ తర్వాత వచ్చిన నాయకులు ఈ పథకాన్ని దెబ్బతీస్తూ వచ్చారు. కాలేజీలకు ఏళ్లతరబడి బకాయి పెట్టారు. దీనివల్ల కాలేజీల్లో నాణ్యతను అడిగే పరిస్థితి ఎలా వస్తుంది?. కాలేజీకి రావొద్దని, పరీక్షలు రాయనివ్వమని అన్న ఘటనలు కూడా మనం చూశాం. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు.. అలాంటి పరిణామాల నేపథ్యంలోనే నెల్లూరు జిల్లాలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన పాదయాత్రలో నాకు ఎదురైంది. ఇలాంటి పరిస్థితులు ఎవ్వరికీ రాకూడదనే అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగులు ముందుకేశాం. అర్హులైన విద్యార్థులందరికీ కూడా వందకు వందశాతం పూర్తి ఫీజు రియంబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నాం. కుటుంబంలో ఎంత మంది పిల్లలు చదువుతున్నా.. వారికి పూర్తిగా ఫీజు రియంబర్స్‌మెంట్ ‌ఇస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఐటీఐ,పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌.. ఈకోర్సులు చదివే పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నాం. తల్లిదండ్రుల ఖాతాలో ప్రతి మూడు నెలలకు ఒకసారి జమచేస్తున్నాం. కాలేజీలకు పిల్లల తల్లులే వెళ్లి కాలేజీల పరిస్థితులను వసతులను చూసి,కాలేజీలకు ఫీజులు చెల్లించే బాధ్యతలను తల్లిదండ్రులకే అప్పగిస్తున్నాం. లోటుపాట్లు ఉంటే యాజమాన్యాలను వాళ్లు ప్రశ్నించగలుగుతారు. దీనివల్ల కాలేజీల్లో జవాబుదారీతనం పెరుగుతుంది


మంచి ఉద్దేశంతో జగనన్న విద్యాదీవెన మొదలుపెట్టాం

మీ ఖాతాల్లో జమ అయిన సొమ్మును వారం రోజుల్లోపు కాలేజీలకు వెళ్లి ఫీజులు చెల్లించాల్సిన బాధ్యత మీపై ఉంది. ప్రభుత్వం మీకు ఇచ్చిన తర్వాత కూడా మీరు కాలేజీలకు ఇవ్వకపోతే.. మీ ఖాతాలకు కాకుండా.. ఆఫీజుల సొమ్మును ఇవ్వక తప్పని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది. దయచేసి ప్రతి తల్లీ కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. గతంలో మెరిట్‌ఉన్నా.. ఆర్థిక భారం కారణంగా ప్రైవేట్‌ కాలేజీలు, ప్రైవేటు యూనివర్శిటీల్లో పేద విద్యార్థులకు అడ్మిషన్లు పొందలేని పరిస్థితి గతంలో ఉండేది. వీటిలో మార్పులు తీసుకు వచ్చాం. అన్ని ప్రైవేటు యూనివర్శిటీల్లో మెడికల్, డెంటల్‌ అయితే ఖచ్చితంగా యాభైశాతం, ఇతర కోర్సుల్లో అయితే 35 శాతం సీట్లు గవర్నమెంటు కోటాలో భర్తీ చేయాలని మార్పులు తీసుకు వచ్చి చట్టం చేశాం. ఇంతకుముందు అవకాశంలేని పేద విద్యార్థులకు అవకాశం వస్తోంది. ఈ ఏడాది దాదాపు 2118 విద్యార్థులకు అవకాశం వచ్చింది. వీరికి పూర్తి ఫీజు రియంబర్స్‌ మెంట్‌ఇస్తున్నాం. ప్రతిభ ఉన్న అర్హులైన పేదవిద్యార్థులకు గతానికి భిన్నంగా చదువుకునే అవకాశం లభించింది. మనసున్న ప్రభుత్వంగా మనం ఇవన్నీ చేస్తున్నాం. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెనల ద్వారా చదువులకు ప్రాధాన్యత ఇస్తున్నాం. మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సర్వే రిపోర్టులో మన రాష్ట్రంలో ఉన్నత విద్యకోసం కాలేజీల్లో చేరే విద్యార్థల జీఈఆర్‌ రేష్యో 2020 నాటికి 35.2 శాతానికి పెరిగింది. 2018 –19 తో పోలిస్తే.. 2019–20 మధ్య పెరుగుదల దేశవ్యాప్తంగా 3.04 అయితే, మన రాష్ట్రంలో 8.6శాతంగా నమోదయ్యింది. జీఈఆర్‌ దేశవ్యాప్తంగా ఎస్సీల్లో 1.7శాతం, ఎస్టీల్లో 4.5 శాతం, బాలికల్లో 2.28శాతం  ఉంటే.. మన రాష్ట్రంలో ఎస్సీల్లో 7.5, ఎస్టీల్లో 9.5శాతం.. విద్యార్థినుల్లో 11.03శాతంగా నమోదయ్యింది. చదువుల కోసం భారం ఉండకూడదు. గొప్ప చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేయాలి. దేశం కన్నా మనం మెరుగ్గా ఉన్నాం ప్రయాణించాల్సిన దూరం చాలా ఉంది. మీ అందరి ఆశీస్సులు, దేవుడి దయతో ఆ గమ్యాన్ని మనం చేరుకుంటాం. జగనన్న వసతి దీవెన కింద ఐటీఐ చదివేవారికి రూ.5వేలు, పాలిటెక్నిక్‌ చదివేవాళ్లకి రూ.15వేలు, డిగ్రీ, ఇతర కోర్సులు చదివేవారికి రూ.20వేలు ఇస్తున్నాం. ఇప్పటివరకూ 2,267 కోట్ల రూపాయలు ఇచ్చాం. మంచి మేనమామలా, తల్లులందరికీ మంచి అన్నగా, తమ్ముడిగా మంచి చేస్తున్నాం. విద్యాదీవెన, వసతి దీవెన ఈ రెండు పథకాలకి కలిపి ఈ రెండు ఏళ్లలో రూ.8,500 కోట్లకుపైగా ఇచ్చాం.

కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలు

విజయనగరం జిల్లాల్లో గురజాడ జేఎన్టీయూ యూనివర్శిటీని తీసుకువస్తున్నాం, ఒంగోలులో ఆంధ్రకేసరి యూనివర్శిటీని తీసుకువస్తున్నాం,కడపలో ఆర్కిటెక్చర్‌ యూనివర్శిటీని తీసుకువస్తున్నాం,కురుపాంలో ఇంజినీరింగ్‌కాలేజీ, సాలూరులో ట్రైబల్‌ యూనివర్శిటీ, పాడేరులో మెడికల్‌ కాలేజీ తీసుకువస్తున్నాం

2019 నుంచి ఇప్పటివరకూ కొత్తగా మరో 10 డిగ్రీలు కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం, నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 154 ప్రభుత్వ డిగ్రీకాలేజీల్లో 880 కోట్లతో నాడు – నేడుకు శ్రీకారం చుడుతున్నాం

మరో 2 సంవత్సరాల్లో ఇవన్నీకూడా పూర్తిగా పనులు అవుతాయి. డిగ్రీ కోర్సుల్లో కూడా మార్పులకు శ్రీకారం చుట్టాం. ఇంగ్లీష్‌ మీడియం వైపు అడుగులువేస్తున్నాం

టెక్ట్స్‌ బుక్‌లో ఒక పేజీ తెలుగు, ఒక పేజీ తెలుగు ముద్రిస్తున్నాం. ఉద్యోగాలు ఇచ్చే కోర్సులుగా వీటిని తీర్చిదిద్దుతున్నాం. ఏకంగా 30 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలను ఏర్పాటు చేయబోతున్నాం. ఒక స్కిల్‌ యూనివర్శిటీని కూడా తీసుకువస్తున్నాం. అని ఆయన పేర్కొన్నారు.

ఇదిలావుంటే... వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక గత చంద్రబాబు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1,778 కోట్ల బకాయిలతో కలిపి ఇప్పటివరకు మొత్తం రూ.6,259 కోట్లు ఫీజు చెల్లించారు. ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టాక విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ విద్యా పథకాల కింద 1,97,38,694 మంది విద్యార్థులకు రూ.34,753.17 కోట్ల వ్యయం చేశారు.   

పేదరికం విద్యకు అడ్డు కాకూడదు: మంత్రి ఆదిమూలపు సురేష్‌

విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. 'పేదరికం విద్యకు అడ్డు కాకూడదు. టీడీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి తూట్లు పొడిచింది. కానీ మన ప్రభుత్వం కోవిడ్‌ పరిస్థితుల్లోనూ జగనన్న విద్యాదీవెన అమలు చేస్తున్నామని' ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


– ,  


   


 


 వైసీపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

కందుల నారాయణ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

మార్కాపురం నియోజకవర్గంలోని తర్లుపాడు మండలం లో గల తాడివారిపల్లి గ్రామపంచాయతీ యొక్క తెలుగుదేశం పార్టీ బూత్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మార్కాపురంం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను ఏ రకంగా జనాల్లోకి తీసుకువెళ్లాలి అనే అంశంపై  కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.


ఈ కార్యక్రమంలో తర్లుపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉడుముల చిన్నప రెడ్డి, ఒంగోలు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కంచర్ల కాశయ్య, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు పుచ్చనూతల గోపీనాథ్, మార్కాపురం మండల తెలుగుదేశం నాయకులు తాండ్ర వెంకటేశ్వర్లు, మార్కాపురం మాజీ మున్సిపల్ కౌన్సిలర్ చలువాది వెంకటేశ్వర్లు, బోగినేని చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

 ప్రపంచాన్ని దడపుట్టిస్తున్న ఓమిక్రాన్..

అది ఎలా ఉంటుందో తెలుసా

ఆ వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకొందామా చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ ప్రస్తుతం ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్‌ ప్రతి మూడు నెలల కోసారి.. కొత్త రూపంతరం చెంది. ప్రజలను కబలిస్తోంది. అయితే.. ప్రస్తుతం ఈ వైరస్‌ ఓమిక్రాన్ రూపంలో వచ్చి.. అందరినీ వణికిస్తుంది. అయితే. ఈ ఓమిక్రాన్‌ అంటే. ఏమిటి ? దీని లక్షణాలు ఏంటి ? ఎలాసోకుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

1 . ఇది కొత్త కరోనా రకం . ఇది మన దేశం లో రెండో వేవ్ { మార్చ్ – మే 2021 } కి కారణం అయిన డెల్టా వైరస్ కంటే ఆరు రెట్లు ఎక్కువ వేగం గా విస్తరిస్తుంది . డెల్టా మార్చ్ లో మన దేశం తో మొదలై అక్టోబర్ నాటికి ప్రపంచం లోని అన్ని దేశాలను చుట్టేసింది . డెల్టా కంటే ఆరు రెట్లు ఎక్కువ వేగం అంటే ఓమిక్రాన్ ను నిలువరించడం అసాధ్యం . కట్టడి చర్యలు అనేది వినడానికి బాగుంటాయి . వాస్తవంగా, అందునా జనాభా ఎక్కువ ఉన్న భారత దేశం లో అసాధ్యం .2 . ఓమిక్రాన్ దక్షిణాఫ్రికా దేశం లో ముందుగా గుర్తించారు . ఆస్ట్రేలియా , ఇటలీ , జర్మనీ , నెథర్లాండ్ , బ్రిటన్ , ఇజ్రాయెల్, హాంగ్ కాంగ్ , బోట్స్వానా , బెల్జియం దేశాల్లో ఇది ఇప్పటికే వుంది .

౩. ఓమిక్రాన్ సోకిన వారు కనబరిచే లక్షణాలు : 1 బాగా అలసట గా ఉండడం , కొద్ది పాటి కండరాల నొప్పి , గొంతులో కొద్ది పాటి గరగర , పొడి దగ్గు . తక్కువ మందిలో కొద్ది పాటి జ్వరం . చికెన్ గున్యా కు దీనికి చాలా మాటకు ఒకటే లక్షణాలు .


4 . ఎవరికి సోకుతుంది ?

మొదటి వేవ్ లో కరోనా బారిన పడిన వారికి సోకవచ్చు . వారి ఇమ్మ్యూనిటి బాగా దెబ్బ తినే ఉంటే తప్పించి వారి పై దీని ప్రభావము అత్యంత స్వల్పం . అసలు వచ్చినట్టే తెలియదు . ఇప్పటిదాకా కరోనా సోకకుండా , వాక్సిన్ రెండు డోసులు తీసుకొన్న వారికి సోక వచ్చు . రెండు రోజులు అలసట , పొడి దగ్గు , 101 డిగ్రీలు దాటని జ్వరం తో ఇది పోతుంది . ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం ఉండదు . రెండో వేవ్ లో డెల్టా సోకిన వారికి ఇది సోకే అవకాశం బాగా తక్కువ. సోకినా వారికే అర్థం కాకుండా అంటే ఎలాంటి లక్షణాలు లేకుండా పోతుంది . ఇప్పటిదాకా కరోనా బారిన పడకుండా అంతే కాకుండా వాక్సిన్ వేసుకోకుండా ఉన్న వారికి ఇది సోకుతుంది . వారి ఇమ్మ్యూనిటి బాగుంటే కోలుకొంటారు .

5 . ఎవరికి డేంజర్? : భయపడే వార్తలను పదేపదే చదివే వారికి, వినేవారికి డేంజర్ . వారి భయమే వారి పాలిట శాపంగా మారుతుంది . ఓమిక్రాన్ చంపదు. భయం ముంచేస్తుంది . ముందుగా ఆల్ఫా వైరస్ వచ్చింది . అటుపై దాని కంటే అనేక రెట్ల వేగం తో విస్తరించే డెల్టా వచ్చింది . ఇప్పుడు అంతకంటే ఎక్కువ వేగంతో ఓమిక్రాన్ . కట్టడి చర్యల పేరుతొ మీ భయాన్ని మార్కెటింగ్ చేసుకొనే ప్రయత్నాలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి . కరోనా ను నుంచి ముక్కున్న మానవుడు తప్పించుకోలేడు,  కరోనా పోతుంది అని ఇంకా నమ్మే అమాయక ప్రజలు కోకొల్లలుగా వున్నారు . కరోనా ఎక్కడికీ పోదు . మరో వంద ఏళ్ళైనా ఉంటుంది . మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో స్పానిష్ ఫ్లూ కలుగ చేసిన వైరస్ ఇంకా మన మధ్యే వుంది . అది సాధారణ జలుబు కలుగ చేస్తుంది . మొదటి ప్రపంచ యుద్ధ కాలం లో అది ప్రాణాంతకం అయిన మాట వాస్తవం . కానీ మ్యుటేషన్ లు జరిగే కొద్దీ బలహీన పడి జలుబు ఫ్లూ వైరస్ గా నిలిచిపోయింది . కరోనా కూడా అంతే .. ఒళ్ళు నొప్పుల వైరస్ గానో మరో స్వల్ప లక్షణాలు కలుగచేసే వైరస్ గా నో స్థిరపడి పోతుంది . మీ జీవిత కాలం లో ఎన్నో సార్లు సోకుతుంది . సోకినా ఏమీ కాదు . భయపడే వ్యక్తిని ఎవరూ రక్షించలేరు .

6 . ఓమిక్రాన్ కు మోనోక్లోనల్ యాంటీబోడీ కాక్టెయిల్ పనిచేసే అవకాశం తక్కువ . విపరీతంగా భయపడే వారు , లేదా ఇమ్మ్యూనిటీ మరీ బలహీనంగా ఉన్న వారు తప్పించి మిగతా వారికి దీని అవసరం రాదు .

7 . మ్యుటేషన్ ల కు గురికావడం సూక్షజీవుల లక్షణం . { ఆ మాటకు వస్తే అన్ని జీవులు . కాకపోతే సూక్షజీవుల పై ప్రభావం ఎక్కువ } . ఓమిక్రాన్ రేపు మరో రూపంలోకి మారొచ్చు . దాన్ని ఆపలేము . దాన్ని పట్టించుకోవలసిన అవసరం లేదు . మన ఇమ్మ్యూనిటి నే మనకు రక్ష. ప్రతి రోజు కనీసం అరగంట ఎండలో నడవండి . శరీరానికి డి విటమిన్ అందివ్వండి . శాఖాహారులు బి 12 విటమిన్ మాత్రలు తీసుకోండి . తినే ఆహారం లో ప్రోటీన్ లు ఎక్కువగా { కనీసం ముప్పై శాతం } ఉండేలా చూసుకోండి . పన్నీర్ , మొలికెత్తిన పెసలు , పుట్టగొడుగులు , బ్రోకలీ , జామ కాయ , చికెన్ , ఫిష్ మటన్ , గుడ్డు ప్రోటీన్ అందించే ఆహార పదార్తాలు . రోజుకు పెద్దలు నాలుగు లీటర్ల నీరు తాగాలి . చెమట పట్టేదాకా వ్యాయామం { కనీసం నడక } చెయ్యాలి . శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వాలి . నిద్ర బాగా పోవాలి.

ఇవన్నీ ఇమ్మ్యూనిటి ని బలపరుచుకొనే మార్గాలు. అన్నింటికన్నా భయం పెద్ద విలన్ .. భయం ఇమ్మ్యూనిటి ని చంపేస్తుంది . అదే ఫార్మసురుల అస్రం. భయం తో మళ్ళీ మీ ఆస్తులు ఖాళీ చేసి వారి గోదాముల్లో నోట్ల కట్టలు సంచుల్లో దాచుకొనే అవకాశాన్ని కల్పించుకొంటున్నారు . తస్మాత్ జాగ్రత్త.

వేవ్ అంటే ఆసుపత్రిల్లో బెడ్ లు దొరకపోవడం , అంబులెన్సు ల క్యూలు .. ఇలాంటి స్థితి రాదు . కానీ మన దేశం లో కరోనా అంటే భయపడే వారు కోకొల్లలుగా వున్నారు . ఇన్నాళ్లయినా నిజాన్ని గ్రహించలేని వారు , భయం వద్దని చెబితే మొండిగా, మూర్ఖంగా వాదించేవారు వున్నారు . వారిని ఓమిక్రాన్ నుంచి ఎవరూ రక్షించలేరు . తత్త్వం బోధపడేటప్పటికీ వారు ఉండక పోవచ్చు .. ఉన్నా ఆస్తులు పోగొట్టుకొని అనారోగ్యం తో .. ఇలా చెబుతున్నందుకు సారీ . నిజం నిష్టూరంగా ఉంటుంది . తప్పదు . భయాన్ని బహిష్కరించండి . నిర్భయంగా వుండండి . అప్రమత్తత అవసరం . అలసట అనిపిస్తే పల్స్ ఆక్సీ మీటర్ లో ఆక్సిజన్ శాతం వారం రోజుల పాటు రోజుకు ఒక సారి చెక్ చేసుకోండి . అది 94 పైగా ఉంటే హ్యాపీగా గా కాలం గడపండి.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


– ,  


   


 


 పేద వధువుకు టేకు మంచం బహూకరణ

వితరణ చాటిన మసూల్దార్ ఉమెన్ ఎంపవర్మెంట్ సొసైటీ

(జానో జాగో వెబ్ న్యూస్_నంద్యాల ప్రతినిధి)

మసూల్దార్ ఉమెన్ ఎంపవర్మెంట్ సొసైటీ,నంద్యాల* వారి ఆధ్వర్యంలో నందమూరి నగర్ కు చెందిన పేద ముస్లిం వధువుకు పెళ్లి కానుక గా టేకు మంచం ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నాయకులు ఇద్రుస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు యస్ యండి ఫరూక్ మాట్లాడుతూ తన పెద్ద కూతురి ఫార్హిన్ పుట్టినరోజు  సందర్భంగా ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు అలానే సొసైటీ వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ రెహమాన్ పర్వీన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ  వారు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కా చెల్లెలు అంటూ ముద్దులు పెట్టడం తప్ప వారికి ఎటువంటి సహాయం చేయకుండా షాదీ ముబారక్ లాంటి పథకాలను మైనారిటీ బ్యాంక్ లాంటి పథకాలను


తుంగలో తొక్కుతున్నారని దీన్ని మైనార్టీ సోదరులె కాకుండా అన్ని వర్గాల వారు గ్రహించాలని ఈ ప్రభుత్వానికి రాబోయే 2024 ఎలక్షన్ లో గుణపాఠం చెప్పాలని చెప్పారు అలాగే వధువు తల్లి మాట్లాడుతూ ఇంతటి సాయం చేస్తున్నా సొసైటీ వారికి కృతజ్ఞతలు తెలిపారు వీరి వీరి కుటుంబాలు సంతోషకరంగా ఉండాలని ఆయురారోగ్యాలతో ఉండాలని ఆమె కోరుకున్నారు.  ఈ కార్యక్రమానికి విచ్చేసిన  అందరికీ సొసైటీ సెక్రెటరీ షేక్ అబ్దుల్లా కృతజ్ఞతలు తెలిపారు

 రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేసేంతవరకు....

పోరాటం సాగిస్తాం

రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ

(జానో జాగో వెబ్ న్యూస్_గడివేముల ప్రతినిధి)

కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గం లో రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల( జేఏసీ )ఆర్ వి ఎఫ్, బీసీ ,ఎస్సీ, ఎస్టీ ,మైనార్టీ విద్యార్థి యువజన సంఘాల సమాఖ్య, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీల, ఆధ్వర్యంలో పాణ్యం జూనియర్ కళాశాల నుండి  భారీ ర్యాలీ గా బయలుదేరి పాణ్యం నేషనల్ హైవే పై రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలు రాజధానిగా ప్రకటించి హైకోర్టును ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రారంభించాలని వారు విజ్ఞప్తి చేశారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమకు రావలసిన హక్కులు అన్నింటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు.


శ్రీభాగ్ ఒప్పందం లోని హక్కులకు ఏ రాజకీయ పార్టీ లు అడ్డుపడుతున్న ఆ పార్టీలకు పుట్టగతులుండవని, రాయలసీమ హక్కుల కోసం పోరాటం చేయని పార్టీ కార్యాలయాలను,పార్టీ నాయకుల ఇళ్లను ముట్టడిస్తామని తెలిపారు. అమరావతి రియల్ ఎస్టేట్ పెయిడ్ ఆర్టిస్ట్ రైతుల పాదయాత్ర హాస్యాస్పదం అని


ఆ యాత్రకు కు రాయలసీమ ప్రజలు మంగళం పాడుతారని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల ( జేఏసీ ) సభ్యులు ప్రతాప్,శివ కృష్ణ యాదవ్,రియాజ్,వెంకటాద్రి, కేజీ శ్రీనివాసులు, ఆర్ వి ఎఫ్ సభ్యులు,బీసీ ,ఎస్సీ ,ఎస్టీ ,మైనార్టీ విద్యార్థి యువజన సంఘాలు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు ,పాల్గొన్నారు.

 ప్రమాదంలో గాయపడిన మహిళ తల్లిదండ్రులకు... 

పోగొట్టుకున్న వస్తువుల అందజేత

ఎస్పై కోటయ్య వెల్లడి 

(జానో జాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

ఇటీవల ప్రమాదంలో గాయపడిన మహిళలకు ప్రమాద ఘటన స్థలంలో పోగొట్టుకొన్న విలువైన వస్తువులను ఆమె తల్లిదండ్రులకు తిరిగి అప్పగించామని మార్కాపురం రూరల్ ఎస్పై కోటయ్య తెలిపారు. ఆయన తెలిపిన వివరాల  ప్రకారం...ఆదివారంనాడు సాయంత్రం మార్కాపురం మండలం రాయవరం గ్రామం ఇలాకాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్ పై ఆటో పడడం వల్ల   ఆటో డ్రైవర్ మరణించగా,


అదేవిధంగా ఆటోలో ప్రయాణిస్తున్న పిన్నిక సుబ్బులు భర్త శ్రీను వయసు 30 సంవత్సరాలు, తమ్మడపల్లి గ్రామం ,పెద్దారవీడు మండలం. అనునామెకు స్వల్పగాయాలయ్యాయి. మాట్లాడ లేని పరిస్థితిలో  ఉన్న ఆమెను 108 అంబులెన్స్  ద్వారా మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. వెంటనే తాను, తన సిబ్బంది ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించు సమయంలో ఆటోలో ఒక పర్సు దొరికింది, ఆ పర్స్ లో గాయపడిన మహిళ యొక్క  పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, నగదు 42,950/, ఒక  బంగారు చెవి కమ్మలు, సెల్ ఫోన్ ఉన్నాయి. వాటిని ఈ రోజు గాయపడిన ఆ మహిళా తల్లిదండ్రులకు భద్రంగా అప్పగించాం. అని ఎస్పై కోటయ్య తెలిపారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


– ,  


   


 రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

◆తుఫాను ప్రభావంతో వేలాది ఎకరాల్లో పంట నష్టం 

◆త్వరితగతిన పంట నష్ట సర్వే నిర్వహించాలి

◆అర్హులైన ప్రతి రైతుకు పరిహారం అందించాలి 

◆జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు వినతి 


(జానో జాగో వెబ్ న్యూస్_ఒంగోలు ప్రతినిధి)

 ప్రకాశం జిల్లాలో తుఫాను ప్రభావం కారణంగా  కురిసిన భారీ వర్షాలకు వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, మాజీ ఎమ్మెల్యేలు ముత్తుముల అశోక్ రెడ్డి ,కందుల నారాయణరెడ్డి, తెలుగుదేశం పార్టీ నేతలు గూడూరిఎరిక్షన్ బాబు, దామచర్ల సత్యలు వినతి పత్రం అందజేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయనను కలిసి క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితిని వివరించారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుఫాను ప్రభావంతో చేతికొచ్చిన పంటలన్నీ నీటిపాలు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.రోజుల తరబడి వర్షం కురవడంతో పంటల నీటిలో కుళ్ళి పోయాయన్నారు. కోటి ఆశలతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి మిరప, పొగాకు ,పత్తి, మినుము పంటల సాగు చేశారని అకాల వర్షంతో పంటలు నీటిపాలయ్యాయని పేర్కొన్నారు. వీటితో పాటు కూరగాలు తదితర ఉద్యాన పంటలు వేలాది ఎకరాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. చేతికొచ్చిన పంటలు  వరుస వర్షాలతో నీటి పాలుకావడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని వారు పేర్కొన్నారు. కాలం కలిసి రాక అప్పుల భారంతో సేద్యం చేయలేని పరిస్థితుల్లో రైతన్నలు ఉన్నారని ప్రభుత్వం వారిని ఆదుకోవాలన్నారు.

దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం పంట నష్టం సర్వే నిర్వహించి తక్షణమే రైతాంగానికి పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్క రైతుకు పరిహారం అందేలా చర్యలు తీసుకొని రైతాంగాన్ని ఆదుకోవాలని వారు కలెక్టర్ కు విజ్ఞప్తి  చేశారు. రైతులు మళ్లీ పంటలు సాగు చేసుకునేందుకు ఉచితంగా ఎరువులు విత్తనాలు అందించాలని కోరారు. పుట్టెడు కష్టాల్లో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. డీపీఆర్ లను తెలంగాణ సకాలంలో సమర్పించింది

ఏపీ ఒక్కటి కూడా సమర్పించలేదు

బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు


(జానో జాగో వెబ్ న్యూస్-ఏపీ పొలిటికల్ బ్యూరో)

డీపీఆర్ లను తెలంగాణ సకాలంలో సమర్పించిందని, కానీ ఏపీ ఒక్కటి కూడా సమర్పించలేదని వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు తీవ్రంగా ధ్వజమెత్తారు. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం అనుమతి లేని నీటి పారుదల ప్రాజెక్టుల డీపీఆర్ లు 6 నెలల్లో పంపాల్సి ఉంటుందని తెలిపారు. లేకపోతే అనుమతి లభించందని వెల్లడించారు. అయితే, తెలంగాణ 12 ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్ లను సకాలంలో సమర్పించిందని, ఏపీ ఒక్కటి కూడా సమర్పించలేదని జీవీఎల్ తెలిపారు. రాజకీయాలు తప్పితే రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా సీఎం జగన్ గారూ అంటూ ట్వీట్ చేశారు.

 సీఎం వ్యాఖ్యలు చేతగానితనానికి నిదర్శనం

ఆ మరణాలన్నీ  ప్రభుత్వ హత్యలే

ఫ్లడ్ మేనేజ్ మెంట్‌లో ప్రభుత్వం ఘోర విఫలం

దీనిపై న్యాయ విచారణ జరగాలి

భూతుల్లో వైసీపీతో పోటీపడం

అప్పులతో ఏపీ బ్రాండ్‌ కు దెబ్బ

నారా చంద్రబాబు నాయుడు


(జానో జాగో వెబ్ న్యూస్-ఏపీ పొలిటికల్ బ్యూరో)

వరద ముంపు ప్రాంతాలకు తాను వెళితే సహాయక కార్యక్రమాలకు ఆటంకమని సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం ఆయన చేతగానితనమేనని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. వరదల కారణంగా జరిగిన మరణాలన్నీ ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనన్నారు. ఈ ఘటనలపై కచ్చితంగా న్యాయ విచారణ జరగాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్యనేతలతో సోమవారంనాడు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా పలు కీలక విషయాలతో పాటు వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలపై చర్చించారు. వరదలతో చనిపోయిన వారివి కచ్చితంగా ప్రభుత్వ హత్యలేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ముంపు ప్రాంతాలకు వెళితే సహాయక కార్యక్రమాలకు ఆటంకమని సీఎం జగన్ రెడ్డి వ్యాఖ్యానించడం చేతగానితనమేనని బాబు విమర్శలు గుప్పించారు. ఫ్లడ్ మేనేజ్ మెంట్‌లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, దీనిపై కచ్చితంగా న్యాయ విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు.. వరద బాధితులకు ఇంతవరకూ ఎలాంటి నష్ట పరిహారం అందలేదని ఆయా పంటలకు టీడీపీ హయాంలో చెల్లించిన ఇన్ పుట్ సబ్సీడీని కూడా తగ్గించారన్నారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ నిధులు రూ.1,100 కోట్లు బాధితులకు ఇవ్వకుండా దారి మళ్లించారని బాబు ఆరోపించారు. వరి వేయవద్దని చెబుతూ రైతులను వ్యవసాయానికి దూరం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. మేం అధికారంలోకి వచ్చాక : ‘పంట బీమా ప్రీమియం కట్టకుండా జగన్ రెడ్డి మోసం చేస్తున్నారు. రాష్ట్ర వాటా చెల్లించకపోవడంతో కేంద్ర సాయం కూడా అందని పరిస్థితి నెలకొంది. బీమా కట్టకపోవడంతో రైతులకు పరిహారం అందని పరిస్థితి వచ్చింది. 2020లోనూ పంట బీమా ప్రీమియం కట్టకుండా అసెంబ్లీలో కట్టామని అబద్ధం చెప్పారు. ఓటీఎస్ పథకం పేరుతో రూ.14,261 కోట్లు పేదల నుంచి వసూలు చేయడాన్ని విరమించుకోవాలి. ప్రభుత్వం కేటాయించిన ఇళ్లకు ఏ ఒక్కరూ కూడా రూపాయి కట్టాల్సిన అవసరం లేదు.  టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తాం. ప్రజా సమస్యలు చర్చించే గౌరవ సభను జగన్ రెడ్డి కౌరవ సభగా మార్చారు. అన్ని గ్రామాలు, పట్టణాల్లో గౌరవ సభలు నిర్వహించి.. మహిళల పట్ల వైసీపీ వైఖరితో పాటు క్షేత్రస్థాయి సమస్యలు, ప్రజా సమస్యలు చర్చిస్తాం. సీఎఫ్ఎంఎస్‌ను దుర్వినియోగం చేస్తున్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీ ఖాతాల్లో జమచేయకుండా నిధులు పక్కదారి పట్టించారు’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఇదిలావుంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీతో పాటు ఇతర యూనివర్సిటీల నిధుల్ని ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పోరేషన్ లిమిటెడ్‌లో డిపాజిట్ చేయాలని ఒత్తిడి తీసుకురావడాన్ని ఈ సమావేశంలో టీడీపీ నేతలు ఖండించారు.


దీనిపై చంద్ర బాబు స్పందిస్తూ...‘‘చట్ట వ్యతిరేకమైన నిధుల బదిలీ ప్రక్రియను తక్షణమే విరమించుకోవాలి. స్వయం ప్రతిపత్తి కలిగిన యూనివర్సిటీల నిధుల మళ్లింపు విద్యావ్యవస్థ ప్రమాణాల్ని దిగజార్చుతుంది. అభయ హస్తం పధకాన్నీ జగన్ రెడ్డి నిర్వీర్యం చేశారు. డ్వాక్రా మహిళలు ఎల్ ఐసీలో పొదుపు చేసుకున్న రూ. 2,200 కోట్లను స్వాహా చేశారు. ఎల్ఐసీని తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం దుర్మార్గపు చర్య. ప్రభుత్వ ఉద్యోగుల పోరాటానికి టీడీపీ సంఘీభావం తెలపాలి. ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి’ అని తెలుగు టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారు. ‘సమర్థంగా పనిచేసిన నేతలకు భవిష్యత్‌లో తగిన ప్రాధాన్యత ఉంటుంది. ఫేక్ ఓట్లు తొలగింపుపై పార్టీ నేతలు కృషి చేయాలి. 2019 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వంపై అబద్ధాలను పదేపదే ప్రచారం చేసి జగన్ రెడ్డి లబ్ధి పొందారు. ఈ దుష్ప్రచారాన్ని అడ్డుకోవడంలో మనం విఫలమయ్యాం. ఇప్పుడు అక్రమ కేసులు, కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. జగన్ రెడ్డి అణచివేతను బలంగా తిప్పికొట్టాలి. జగన్ రెడ్డి విధ్వంస తీరు, విపరీతమైన అప్పులతో రాష్ట్ర బ్రాండ్ దెబ్బతింది. భవిష్యత్‌లో రాష్ట్ర ఉనికికే ప్రమాదం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. 20 ఏళ్లయినా ఈ సమస్యల నుంచి బయటపడే పరిస్థితి లేదు. ఉన్మాదంతో ముందుకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ను కాలరాస్తున్నారు’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఇటీవల అసెంబ్లీ ఘటన గురించి ప్రస్తావన రాగా వైసీపీ భూతులతో టీడీపీ పోటీ పడదని, అధికార పార్టీ తీరును క్షేతస్థాయిలో ఎండగట్టాలని టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారు. ప్రభుత్వం కేటాయించిన ఇళ్లకు రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలు చర్చించే గౌరవ శాసనసభను కౌరవ సభగా మార్చారని దుయ్యబట్టారు. అన్ని గ్రామాలు, పట్టణాల్లో గౌరవ సభలు నిర్వహించి మహిళల పట్ల వైసీపీ వైఖరితో పాటు క్షేత్రస్థాయి సమస్యలు, ప్రజాసమస్యలు చర్చిస్తామన్నారు. డ్వాక్రా మహిళలు ఎల్‌ఐసీలో పొదుపు చేసుకున్న రూ.2,200 కోట్లను స్వాహా చేశారని చంద్రబాబు ఆరోపించారు. చట్ట వ్యతిరేక నిధుల బదిలీ ప్రక్రియను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ విధ్వంస తీరు, విపరీతమైన అప్పులతో రాష్ట్ర బ్రాండ్‌ దెబ్బతింటోందన్నారు.


 భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫిట్‌నెస్‌

సంక్షేమంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోన్న పోర్టల్‌

అత్యున్నత స్థాయి వ్యక్తిగతీకరణ  అందిస్తున్న స్మార్ట్‌ మిర్రర్‌

 

(జానో జాగో వెబ్ న్యూస్-బిజినెస్ బ్యూరో)

స్మార్ట్‌ మిర్రర్‌ ఆధారిత వ్యక్తిగతీకరణ ఫిట్‌నెస్‌ మరియు వెల్‌నెస్‌ ఉపకరణం, పోర్టల్‌ను అధికారికంగా నేడు మార్కెట్‌లోకి విడుదల చేశారు. పోర్టల్‌  ఫౌండర్లు ఇంద్రనీల్‌ గుప్తా మరియు విశాల్‌ చందపేట తో పాటుగా నగరంలోని సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ ఉత్పత్తికి సంబంధించి వినూత్నమైన, అత్యున్నత స్ధాయి ఉత్పత్తి ఫీచర్లును వివరించారు.


పోర్టల్‌లో  వందలాది వర్కవుట్స్‌ను ఆన్‌డిమాండ్‌ మరియు లైవ్‌ క్లాస్‌ల రూపంలో హిట్‌, స్ట్రెంగ్త్‌, డ్యాన్స్‌ ఫిట్‌నెస్‌, ఎండ్యూరెన్స్‌, యోగా, మైండ్‌ఫుల్‌నెస్‌, న్యూట్రిషన్‌ కోచింగ్‌ లో పొందవచ్చు.  ఈ ఉపకరణంలో ఉన్న బయో సెన్సార్లు ఒకరి రక్తపోటు, గ్లూకోజ్‌, ఈసీజీ, రెస్పిరేటరీ రేట్‌ వంటివి కూడా గుణిస్తారు. ఇవి వ్యక్తిగత వ్యాయామ ప్రక్రియను రూపొందించుకోవడంలో సహాయపడతాయి.

ఈ ఆవిష్కరణ సందర్భంగా పోర్టల్‌ ఫౌండర్‌ అండ్‌ సీఈవో ఇంద్రనీల్‌ గుప్తా మాట్లాడుతూ ‘‘అత్యున్నత శ్రేణి వ్యక్తిగత శిక్షణను పోర్టల్‌ అందించడంతో పాటుగా ప్రపంచ శ్రేణి పర్సనల్‌ ట్రైనర్‌ను సైతం పొందే అవకాశం అందిస్తుంది. తమ జీవనశైలికి లోబడి ఆరోగ్యవంతమైన ప్రక్రియలను చురుగ్గా స్వీకరించే అవకాశమూ అందిస్తుంది. ఆకర్షణీయమైన ఈ స్మార్ట్‌మిర్రర్‌, అత్యున్నత స్ధాయి వ్యక్తిగతీకరణతో పాటుగా ఏఐ శక్తివంతమైన ఫార్మ్‌ ఫీడ్‌బ్యాక్‌తో సమగ్రమైన ఆరోగ్య, సంక్షేమ సహచరునిగా నిలుస్తుంది. ప్రతి ఇంటిలోనూ నూతన తరపు వ్యక్తిగతీకరించిన ఫిట్‌నెస్‌ను పోర్టల్‌ తీసుకురానుందని ఆశిస్తున్నాము’’అని అన్నారు.

పోర్టల్‌ ఫౌండర్‌ మరియు సీటీఓ విశాల్‌ చందపేట మాట్లాడుతూ ‘‘మారుతున్న  వినియోగదారుల అవసరాలను పరిగణలోకి తీసుకుని ఈ స్మార్ట్‌ మిర్రర్‌ తీర్చిదిద్దాము.  నేడు ఫిట్‌నెస్‌ ప్రియులు జిమ్‌ వాతావరణంలో మాత్రమే తమ శిక్షణ ఉండటం మాత్రం కాకుండా నాణ్యమైన శిక్షణను కోరుకుంటున్నారు. ఈ స్మార్ట్‌మిర్రర్‌తో వారు వ్యక్తిగతీకరించిన ఫిట్‌నెస్‌ ప్రోగ్రామ్‌లను ఇంటివద్దనే పొందవచ్చు’’ అని అన్నారు.

 ఏపీ ప్రభుత్వ చర్యలు భేష్

కేంద్ర బృందం ప్రశంస      

ఏ రాష్ట్రం ఇలాంటి చర్యలు తీసుకోలేదు

నష్టం మాత్రం అపారం               

ముఖ్యమంత్రితో కేంద్ర బృందం భేటీ

వరద బాధిత ప్రాంతాల్లో పర్యటన వివరాలు తెలిపిన బృందం

ఈ విపత్తు హృదయ విచారకరం-సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి

ఉదారంగా ఆదుకోండి-కేంద్ర బృందాన్నికోరిన ముఖ్యమంత్రి


(జానోజాగో వెబ్ న్యూస్-ఏపీ పొలిటికల్ బ్యూరో)

భారీ వర్షాలకు అతలకుతలపైనా ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వ చర్యలు భేషుగా ఉన్నాయని కేంద్ర బృందం ప్రశంసించింది. వరద ప్రాంతాల్లో పర్యటించి బాధితులన పరామర్శించిన కేంద్ర బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని కలిసింది. ఈ సందర్భంగా వరద బాధితుల కోసం ప్రభుత్వం తీసుకొన్న చర్యలను కేంద్ర బృందం ప్రశంసించింది. వరద బాధిత ప్రాంతాల్లో పరిశీలించిన అంశాలను సీఎం వై.ఎస్.జగన్ కు కేంద్ర బృందం వివరించింది. కేంద్ర హోంమంత్రిత్వశాఖ సలహాదారు కునాల్‌ సత్యార్థి కేంద్ర బృందం తరఫున వివరాలు అందించారు. మూడు రోజులపాటు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించామని కునాల్‌సత్యార్థి ఈ సందర్భంగా తెలియజేశారు. వీలైనన్ని గ్రామాలను, వరద కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలనూ పరిశీలించామన్నారు. కడప జిల్లాకు భారీ నష్టం వాటిల్లిందని, అక్కడి గ్రామాలను కూడా పరిశీలించామని ఆయన వెల్లడించారు. పశువులు చనిపోయాయి, రోడ్లు, భవనాలు, ప్రాజెక్టులులాంటి మౌలిక సదుపాయాలు బాగా దెబ్బతిన్నాయని ఆయన అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘మీ నాయకత్వంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ప్రశంసనీయం, అంకిత భావంతో పనిచేసే అధికారులు మీకు ఉన్నారు, వీరంతా మాకు మంచి సహకారాన్ని అందించారు, యువకులు, డైనమిక్‌గా పనిచేసే అధికారులు ఉన్నారు, విపత్తు సమయంలో అద్భుతంగా పనిచేశారు, మా పర్యటనల్లో వివిధ రాజకీయ ప్రనిధులను, మీడియా ప్రతినిధులను కలుసుకున్నాం, ప్రతి ఒక్కరూ కూడా వరదల్లో రాష్ట్ర ప్రభుత్వం పనితీరును ప్రశంసించారు, సంప్రదాయంగా వరదలు వచ్చే ప్రాంతం కాదు, అలాంటి ప్రాంతంలో ఊహించని రీతిలో వర్షాలు పడ్డాయి, ఇంత స్థాయిలో వరదను తీసుకెళ్లగలిగే పరిస్థితి అక్కడున్న నదులు, వాగులు, వంకలకు లేదు, కరువు ప్రాంతంలో అతి భారీవర్షాలు కురిశాయి, ఈ స్థాయిలో వరదను నియంత్రించగలిగే రిజర్వాయర్లు, డ్యాంలు కూడా ఈ ప్రాంతంలో లేవు, ఉన్న డ్యాంలు, రిజర్వాయర్లు కూడా ఈస్థాయి వరదలను ఊహించి నిర్మించినవి కావు, ఇలాంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా తలెత్తున్నాయి, కరువు ప్రాంతాల్లో కుంభవృష్టి, నిరంతరం మంచి వర్షాలు కురిసేచోట కరువు లాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి, తీరందాటిన తర్వాత అల్పపీడనం వెంటనే తొలగిపోలేదు, అది చాలా రోజులు కొనసాగింది, కడప జిల్లాలో వరదల వల్ల నష్టం అధికంగా ఉంది, అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిన చోట... నష్టం అపారంగా ఉంది, చిత్తూరులో జిల్లాలో కొంత భాగం, నెల్లూరులో కూడా వరదల ప్రభావం అధికంగా ఉంది, కడప జిల్లాలో మౌలికసదుపాయాల నిర్మాణాలు దారుణంగా దెబ్బతిన్నాయి, పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది, పంట చేతికందుతున్న సమయంలో నీట పాలైంది, శెనగ పంట కూడా తీవ్రంగా దెబ్బతింది, వాటర్‌ స్కీములు కూడా దెబ్బతిన్నాయి, అన్నమయ్య నుంచి వెళ్లే తాగునీటి సరఫరా వ్యవస్థలకు తీవ్ర నష్టం వాటిల్లింది, ఇరిగేషన్‌కూ తీవ్ర నష్టం ఏర్పడింది, బ్రిడ్జిలు, రోడ్లు తెగిపోవడం వల్ల చాలా గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి, వరద బాధిత ప్రాంతాల్లో అధికారులు చాలా బాగా పనిచేశారు, విద్యుత్ శాఖతో సహా అన్నిరకాల శాఖలు చాలా బాగా పనిచేశాయి, అత్యవసర సర్వీసులను వెంటనే పునరుద్ధరించడంలో అధికారులు చాలా బాగా పనిచేశారు, ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు ఇంత త్వరగా కరెంటు పునరుద్ధరణ అన్నది సహజంగా జరగదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ప్రశంసనీయం, సహాయ కార్యక్రమాలకోసం కలెక్టర్లకు వెంటనే నిధులు ఇచ్చారు. దీనివల్ల పనులు చాలా వేగంగా జరిగాయి. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ఏర్పాటును మేం చూడలేదు, ఈ డబ్బును బాధితులను వెంటనే ఆదుకునేందుకు వాడుకున్నారు, అలాగే జేసీబీలు పెట్టి.. అవసరమైనచోట యుద్ధ ప్రాతిపదికిన పనులు చేపట్టారు, సహాయక శిబిరాలను తెరిచి ముంపు బాధితులను ఆదుకున్నారు, క్షేత్రస్థాయిలో అధికారులు తీసుకున్న ఈ చర్యలన్నీ ప్రశంసనీయం, వరదల వల్ల జరిగిన నష్టంలో 40శాతం రోడ్లు, భవనాలు ల్లాంటి రూపేణా జరిగింది. 32 శాతం నష్టం వ్యవసాయం, అనుబంధ రంగాల్లో జరిగింది, ఇగిగేషన్‌ స్కీంల రూపేణా 16శాతం మేర జరిగింది, వీలైనంత మేర ఆదుకోవడానికి మావంతు సహకారాన్ని అందిస్తాం.’’ అని కేంద్ర బృందం పేర్కొంది. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో నిబంధనల సడలింపు చేయాలని కోరింది. భారీ వర్షాలు కారణంగా పంటలు దెబ్బతిన్నంటున తేమ, ఇతరత్రా నిబంధనల విషయలో సడలింపులు ఇవ్వాలని కేంద్ర బృందాన్ని రాష్ట్ర  ప్రభుత్వం కోరింది.ఈ విపత్తు హృదయవిదారకరం- సీఎం వై.ఎస్.జగన్

ఇలాంటి విపత్తు హృదయవిదారకరమని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. నష్టం అంచనాలకోసం మీరు ఆయా ప్రాంతాల్లో పర్యటించినందుకు కేంద్ర బృందానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఉదారంగా, మానవతా పరంగా స్పందించాలని కేంద్ర బృందాన్ని ఆయన కోరారు. మేం పంపించిన నష్టం వివరాల్లో ఎలాంటి పెంపూ లేదని ఆయన తెలియజేశారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ...‘‘నష్టం అంచనాల తయారీకి క్షేత్రస్థాయిలో మాకు సమర్థవంతమైన వ్యవస్థఉంది, ప్రతి గ్రామంలో ఆర్బీకే ఉంది, ప్రతి రైతు పంటకూడా ఇ–క్రాప్‌ అయ్యింది, సోషల్‌ఆడిట్‌కూడా చేయించాం, ఇ– క్రాప్‌కు సంబంధించి రశీదుకూడా రైతుకు ఇచ్చాం, నష్టంపోయిన పంటలకు సంబంధించి కచ్చితమైన, నిర్దారించబడ్డ లెక్కలు ఉన్నాయి, క్షేత్రస్థాయిలో నష్టానికి సంబంధించి వాస్తవ వివరాలను మీకు అందించాం, కోవిడ్‌ నియంత్రణా చర్యలకోసం వినియోగించినందువల్ల ఎస్టీఆర్‌ఎఫ్‌ నిధులు నిండుకున్నాయని మా ఆర్థిక శాఖ కార్యదర్శి మీకు వివరించారు, పనులు చేయాలంటే నిధులు అవసరం, వెంటనే అడహాక్‌ ప్రాతిపదికన నిధులు ఇవ్వాలని కోరుతున్నాం, కేంద్ర బృందం చేసిన సూచనలనూ పరిగణలోకి తీసుకుంటాం, దీర్ఘకాలంలో ఇలాంటి విపత్తులను నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం, వరదనీటిని తరలించడానికి ఇప్పుడున్న కాల్వల సామర్థ్యాన్ని పెంచేలా ఇటీవలే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం, వీలైనంత త్వరగా పెద్దమొత్తంలో నీటిని తరలించే అవకాశం ఏర్పడుతుంది, ఈకార్యక్రమంలో భాగంగా ఇప్పుడున్న రిజర్వాయర్లు, డ్యాంలపై పరిశీలన చేసి తగిన చర్యలు చేపడతాం, ఆటోమేటిక్‌ వాగర్‌ గేజ్‌ సిస్టంపైనా దృష్టిపెడతాం.’’ అని ఈ సందర్భంగా కేంద్ర బృందానికి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కోరారు.


 ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలు ఏవి

మీ హామీ హామీగానే మిగిలిపోయింది

 వైయస్ జగన్ కు సోము వీర్రాజు బహిరంగ లేఖ


(జానో జాగో వెబ్ న్యూస్_ఏపీ పొలిటికల్ బ్యూరో)

ఏకగ్రీవంగా సర్పంచ్ లను ఎన్నుకున్న గ్రామాలకు ప్రోత్సాహక నగదు విడుదల చెయ్యాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కోరారు. ఈ మేరకు ఆదివారం నాడు సీఎంకు సోము వీర్రాజు ఓ బహిరంగ లేఖ రాశారు. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ హామీగానే మిగిలిపోయింది అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు ప్రకారం 2 వేలు జనభా ఉన్న గ్రామపంచాయితీ  ఏకగ్రీవం అయితే రూ.5 లక్షల  ప్రోత్సాహకం, 2 వేలకు పైబడి 5 వేల వరకు జనభా కలిగిన గ్రామ పంచాయితీకి రూ. 10 లక్షలు, 5 వేల నుండి 10 వేల వరకు జనాభా కలిగిన గ్రామ పంచాయితీకి రూ.15 లక్షలు, 10 వేలు పైబడిన గ్రామ పంచాయితీకి ఏకగ్రీవంగా ఎన్నుకుంటే రూ. 20 లక్షలు ప్రోత్సాహకం ఇస్తామని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది అని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు రాసిన లేఖలోని సారాంశం ఇలా ఉంది. ''నవ మాసాలు నిండినా మీ ప్రోత్సాహకం అందలేదు...  మీరు ఇచ్చిన హామీ మేరకు గ్రామ అభివ్రుద్దిని దృష్టిలో ఉంచుకుని గ్రామస్తులు అందరూ ఏకమై ప్రోత్సాహకాలు కోసం ఏకగ్రీవం చేసి గ్రామసర్పంచ్ లను ఎన్నుకుని తొమ్మిది మాసాలు దాటినా ప్రోత్సాహకం అందలేదన్న విషయాన్ని బహిరంగ లేఖ ద్వారా  ముఖ్యమంత్రికి  గుర్తుచేస్తున్నాను.


రాష్ట్రంలోని  13,371 పంచాయితీలకుగాను పలు పంచాయితీలు నగర పంచాయితీలుగా మార్చడంతో పాటు ఇతర సమస్యలు కారణంగా 13,097 గ్రామపంచాయితీలకు ఫిబ్రవరిమాసంలో  నాలుగుదశల్లో  గ్రామ పంచాయితీలకు  ఎన్నికలు నిర్వహించారు.

ఈ ఎన్నికలకు సంబంధించి  గ్రామపంచాయితీలు  ఏకగ్రీవం చేసుకుంటే గతంలో  వేలల్లో  ఉండే  ప్రోత్సాహకాన్ని లక్షల్లోకి మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ఛీఫ్ సెక్రటరీ ఆదిత్యనాధ్ దాస్ జనవరి 26 వ తేదీన ప్రభుత్వ ఉత్తర్వులను విడుదల చేశారు. ఒక కాపీని సమాచార పౌరసంబందాల శాఖ కమీషనర్ కు అదేవిధంగా పంచాయితీరాజ్ శాఖ కు పంపారు. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు ప్రకారం 2 వేలు జనభా ఉన్న గ్రామపంచాయితీ  ఏకగ్రీవం అయితే అయిదు లక్షలు  ప్రోత్సాహకం, 2 వేలకు పైబడి 5 వేల వరకు జనభా కలిగిన గ్రామ పంచాయితీకి 10 లక్షలు, 5 వేల నుండి 10 వేల వరకు జనాభా కలిగిన గ్రామ పంచాయితీకి 15 లక్షలు, 10 వేలు పైబడిన గ్రామ పంచాయితీకి ఏకగ్రీవంగా ఎన్నుకుంటే 20 లక్షలు ప్రోత్సాహకం ఇస్తామని,.ఉత్తర్వులలో మీ ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఇదే నిజమని నమ్మిన  గ్రామ పంచాయితీలలో ప్రజలు మహాత్మాగాంధీ  కలలుకన్న గ్రామ స్వరాజ్యం సిద్దిస్తుందని గ్రామ పంచాయితీలు ఆర్ధిక పరిపుష్టం అవుతాయని  2,199  గ్రామ పంచాయితీలు ఏక గ్రీవం చేసుకుంటే కనీసం నయాపైసా ప్రోత్సాహకం అందించలేదు. ముఖ్యమంత్రిగారూ, మీరు మాటతప్పను, మడమ తిప్పను అనే పదాన్ని తరుచుగా ఉచ్చరిస్తారు,.అదే క్రమంలొ, మీ ప్రభుత్వం విడుదల చేసిన ప్రోత్సహకాల  ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని ఈ బహిరంగ లేఖ ద్వారా డిమాండ్ చేస్తున్నాను. గ్రామాల అభివృద్ధి ద్వారా మాత్రమే దేశాభివృద్ధి జరుగుతుందని,. ఐతే, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి గమనిస్తే చిత్తశుద్ధి కరువయ్యిందని స్పష్టంగా తెలుస్తోంది. ప్రోత్సాహకాల కోసం మీరు విడుదల చేసిన ఉత్తర్వులు  ఉత్తుత్తివి కాదని నిరూపించండి. మీరు గ్రామ పంచాయితీల అభివృద్దికి కట్టుబడి ఉన్నారని నమ్మకం రావాలంటే,. మీ ప్రభుత్వ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయండి. 

బిజెపి రాష్ట్రశాఖ  ద్వారా నెల రోజులు గడువు ఇస్తోంది. ఈ లోగా మీ ప్రభుత్వం  ప్రోత్సహకాలు అందించడానికి సమయంతో కూడిన కార్యచరణ  ఉండాలని ఈ  లేఖ ద్వారా  మీకు గుర్తు చేస్తున్నాను.  లేదంటే బిజెపి ఈ అంశంపై ఉద్యమబాట పడుతుంది. 

అదే విధంగా  మీరు  జిల్లాల్లోని ఆర్ధిక వ్యయమంతా కాంప్రెహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ సిస్టం పరిధిలోకి తీసుకురావడంవల్ల స్థానికసంస్థలు బలపడవు సరికదా బలహీనపడుతున్నాయి! అందువల్ల గ్రామపంచాయితీలకు నేరుగా నిధులు వెళ్లకుండా మీ  ప్రభుత్వం మోకాలొడ్డుతోంది. ఏ చిన్నపని జరిగినా, వాటికి నిధులు చెల్లింపు కష్టసాధ్యమౌతోంది. ఈ విధంగా స్థానికసంస్థల ఆర్ధికాధికారం మీ గుప్పిట్లో పెట్టుకోవడం దారుణమైన విషయంగా మీకు గుర్తుచేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు గ్రామ పంచాయితీలకు విడుదల చేస్తుంటే, రాష్ట్రప్రభుత్వం ఆ నిధులను నేరుగా పంచాయితీలకు వెళ్లకుండా అడ్డుకోవడాన్ని భారతీయ జనతా పార్టీ ఈ లేఖ ద్వారా ఆక్షేపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్రామాల అభివృద్ధి కోసం తీసుకుంటున్న నిర్ణయాలకు రాష్ట్ర ప్రభుత్వం విధానాల కారణంగా గ్రామీణులకు నేరుగా అంతిమ ఫలాలు-ఫలితాలు అందటంలేదని బహిరంగ లేఖ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పదలుచుకున్నాను.  

మీ విధానం కారణంగా గ్రామపంచాయితీల ఆర్ధిక కార్యకలాపాలకు విఘాతం కలుగుతోంది. మీరు ప్రవేశపెట్టిన ఏకగవాక్ష విధానం నుండి స్థానికసంస్థల కార్యకలపాలను వేరుచేయాలని ఈ లేఖ ద్వారా  కోరుతున్నాను. ఏది ఏమైనా ఈ లేఖ ద్వారా ఒకటి స్పష్టం చేయదల్చుకున్నాను గ్రామపంచాయితీల ఆర్ధికవ్యవహారాల్లో రాష్ట్రప్రభుత్వం అడ్డుగోడగా వ్యవహరించడానికి వీలులేదు. అదేవిధంగా ఏకగ్రీవంగా ఎన్నికలు నిర్వహించిన గ్రామపంచాయితీలకు ప్రోత్సాహకనిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాను. ప్రోత్సహాకఉత్తర్వుల కోసం ఆయా గ్రామాల ప్రజలు వేయికళ్ళతో ఎదురుచూస్తున్న సంగతి ముఖ్యమంత్రి  మరవకుండా ఉంటే మంచిదని లేఖ ద్వారా తెలియపరుస్తున్నాను.'' అని సోము వీర్రాజు ఆ లేఖలో పేర్కొన్నారు.

 దేశీ 2021 మేకిన్ ఆంధ్రప్రదేశ్

ఒక రోజు వర్క్ షాప్

డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రంగంపై  ఏపీ ప్రత్యేక దృష్టి

ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్_ఏపీ పొలిటికల్ బ్యూరో)

విశాఖపట్నంలో సోమవారం 'దేశీ 2021 మేకిన్ ఆంధ్రప్రదేశ్ పేరిట ఒక రోజు వర్క్ షాప్' ను రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ ఏర్పాటు చేస్తోందని ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న కొప్పర్తి ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)తోపాటు  ఎలక్ట్రానిక్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను ప్రధానంగా ఈ వర్క్ షాప్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాటనుంది. ఈ వర్క్ షాప్ లో భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) సహా పలు కీలక ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు అనేక దేశీయ, విదేశీ సంస్థలు పాల్గొననున్నాయి. హోటల్ రాడిసన్ బ్లూలో ఉదయం  ఈ వర్క్ షాప్ ను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు.

మరోమారు వర్షాలు... 

అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

నేడు... రేపు అతిభారీ వర్షాలు 

రాయలసీమ, దక్షిణకోస్తాకు వర్షం గండం


(జానో జాగో వెబ్ న్యూస్_ఏపీ పొలిటికల్ బ్యూరో)

చినుకు పడితే గజగజ వణికిపోతున్న రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల ప్రజలకు మరో పిడుగు లాంటి వార్త అందింది. మరోమారు ఈ ప్రాంతాల్లోని జిల్లాలలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాయలసీమ, దక్షిణ కోస్తాకు మళ్లీ వాన గండం పొంచి ఉందని తెలియజేసింది. నెలవ్యవధిలో మూడోసారి అతిభారీ వర్షాలను ఇక్కడి జిల్లాలు ఎదుర్కోనున్నాయి. పదిరోజుల క్రితమే వాయుగుండంతో నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలు అతలాకుతలమైన విషయం తెలిసిందే. 29న అండమాన్‌ సముద్రంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో ముందుగానే ఈ జిల్లా ల్లో భారీవర్షాలు పడుతున్నాయి. మరికొన్ని గంటల్లోనే భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. గత నెలాఖరు, ఈ నెల మొదటి వారంలో వాయుగుండంతో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూ లు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురవగా, 16, 17 తేదీల్లో మరో వాయుగుండం ఏర్పడి నెల్లూరు, చిత్తూరు, కడ ప, అనంతపురం జల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసి తీరని న ష్టం వాటిల్లింది. 44మంది మరణించగా, 5వేలకు పైగా మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. 7వేల దాకా ఇళ్లు దెబ్బతిన్నాయి. దాదాపు 7లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. న ష్టం అంచనాకు కేంద్రబృందం పర్యటిస్తోంది. బాధితులకునష్టపరిహారం అందక ముందే మరో విపత్తు తరుముకురావడంతో మిగిలిన పంటలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.   


ఆ జిల్లాలకు 20 సెంటీమీటర్ల వర్షం: ఐఎండీ

శ్రీలంక తీర ప్రాంతం మీదున్న ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 1.5కి.మీ. ఎత్తు వరకు విస్తరించింది. దీని ప్రభావంతో దక్షిణ అండమాన్‌ సముద్రంలో మరో 36 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుంది. తర్వాత 48గంటల్లో అది మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దాని ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో శనివారం మధ్యాహ్నం నుంచే ఆకాశం మేఘావృతమైంది. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు మొదలయ్యాయి. కృష్ణా, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. ఆదివారం ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. తీరప్రాంతంలో గంటకు 40-50 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

కోస్తాకు తుఫాన్‌ ముప్పు? : కోస్తాకు తుఫాన్‌ గండం పొంచి ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీనిపై ఈ నెల 30 లేదా డిసెంబరు ఒకటో తేదీకల్లా స్పష్టత రానుందన్నారు. ఇప్పటికే వర్షాలకు రాయలసీమ, దక్షిణ కోస్తా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం కోస్తాలో ప్రధానంగా గుంటూరు నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇటువంటి తరుణంలో మరోసారి తుఫాన్‌/వాయుగుండం/చివరకు అల్పపీడనం వచ్చినా రైతులు తీవ్రంగా నష్టపోతారని వ్యవసాయ శాఖ ఆందోళన వ్యక్తంచేస్తోంది. ఈ నెల 29న దక్షిణ అండమాన్‌  సముద్రంలో అల్పపీడనం ఏర్పడనున్నదని ఐఎండీ తెలిపింది. తొలుత ఇది పశ్చిమ వాయువ్యంగా, ఆ తరువాత వాయువ్యంగా, అనంతరం ఉత్తరంగా, అటు పిమ్మట ఈశాన్య దిశలో పయనిస్తుందని పేర్కొంది. దీని ప్రకారం డిసెంబరు 4, 5 తేదీలకల్లా తుఫాన్‌గా మారే అవకాశం ఉందని పలువురు వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ తుఫాన్‌ ఉత్తర కోస్తా దిశగా వచ్చే అవకాశం ఉందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ప్రస్తుతం బంగాళాఖాతంలో వాతావరణం పెద్దగా అనుకూలంగా లేదని ఇస్రో నిపుణుడొకరు తెలిపారు.


 భూ బకార్సులపై చర్యలు తీసుకోండి

పీసీసీ అధికార ప్రతినిధి షేక్ సైదా డిమాండ్


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

భూత, భవిష్యత్, వర్తమానం, అన్ని కాలాలు ప్రకాశం జిల్లా  మార్కాపురం నియోజకవర్గం   పొదిలి లో ప్రభుత్వ భూముల   కబ్జా మయమవుతున్నాయని పీసీసీ అధికార ప్రతినిధి షేక్ సైదా విమర్శించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....;;ఇప్పటికే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో మార్కాపురంలో మండలంలో 15 మంది, తర్లుపాడు మండలం లో 3, పొదిలి మండలంలో 9. మొత్తం 27 మంది నీ జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేయడంతో పాటు ఇద్దరూ రెవిన్యూ తాసిల్దార్ లను మరో 4, ఇతర అధికారులను, పొదిలి భూ బకాసురుడి మీద క్రిమినల్ కేసులు  నమోదు చేయడం జరిగింది, అయినా ఇప్పటికీ భూ బకాసురుడికి అధికార్లు సహకరిస్తున్నారు. భూ బకాసురుడికి సిగ్గు , ఎగ్గు లేని రాజకీయ ముఖ్య నేతలు అండదండలందిస్తున్నారు. గతంలో చిన్న చెరువులో 68 ఎకరాలు కబ్జా, పెద్ద చెరువు అలుగు వాగు , పంట కాలువలు, ,చాకలి మాన్యం కబ్జా,  ఇటీవల కాలంలో ముగ్గురాళ్ళ వాగు, తోళ్ళమడుగు, వెంగమ్మ మడుగు కబ్జా, మొన్న పెద్ద చెరువుకు నీళ్లు వచ్చే పల్లె కంటే రు వాగు కబ్జా, నిన్న  ఏ ప్రభుత్వ భూములు కబ్జా అయ్యాయి, నేడు  ఏ ప్రభుత్వ భూములు మాయం   చేశారు, రేపు ఏ ప్రభుత్వ భూములు , మరియు పేదల భూములు కబ్జా కాబోతున్నాయి, పొదిలి “ పెద్ద చెరువుకు” ప్రధానంగా నీరు సరఫరా అయ్యే “ పల్లె కంటే రు వాగును “పొదిలి సర్వే నెంబర్ - 184 , విస్తీర్ణం 6.35 ఎకరాలు  పూర్తిగా ఆక్రమించి “ అక్రమ నిర్మాణాలు చేపడుతున్న” పొదిలి భూ బకాసురుడు శ్రావణి వెంకటేశ్వర్లు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ముగ్గు రాళ్ల వాగు ప్రాంతంలో భూ  బకాసురుడు అక్రమంగా నిర్మించిన 21 ఇళ్లను  సీజ్ చేయడమే కాకుండా పొదిలి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్, 292/2021 తేదీ: 1 - 10 - 2021  భూ బకాసురుడు పై కేసు నమోదు చేసి త్వరలో అరెస్టు కాబోతున్న బరితెగించి నీటిపారుదల శాఖ కాలువలు ఆక్రమిస్తున్న భూబకాసురులు, చోద్యం చూస్తున్న నీటిపారుదలశాఖ , రెవిన్యూ, నగర పంచాయతీ అధికారులు. ఇప్పటికైనా  బాధ్యత గల ప్రభుత్వ అధికార్లు,  ప్రజల ఓట్లు పొంది గెలుపొందిన ప్రజా ప్రతినిధులరా ! స్పందించండి ,!ప్రజలారా మేల్కొనండి! పొదిలి ప్రాంతం భవిష్యత్తులో కకావికలం కాకుండా కాపాడండి!.;; అంటూ ఆయన పేర్కొన్నారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


– ,