అధికారులు లేని విద్యుత్ కార్యాలయం

సమస్య వచ్చి వెళితే... ఫిర్యాదు స్వీకరించే వారేది


(జానో జాగో వెబ్ న్యూస్_తర్లుపాడు ప్రతినిధి)

ప్రకాశం జిల్లా తర్లుపాడు సబ్ స్టేషన్ లో ఉన్న విద్యుత్ శాఖ కార్యాలయం ఎప్పుడు చూసినా తాళం వేసి ఉంటుంది. విద్యుత్ సమస్యలపై కార్యాలయానికి వచ్చే రైతులు, ప్రజలు ఎవరు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కొందరు రైతులు విద్యుత్ సమస్యలపై కార్యాలయానికి వెళ్లిన అక్కడ అధికారులు అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగి వెళుతున్నారు. ఏఈ గారు వివిధ గ్రామాలకు క్యాంపు వెళ్ళినప్పుడు కచ్చితంగా సబ్ ఇంజనీర్ ఉండవలసి వస్తుంది. కానీ సబ్ ఇంజనీర్ ఎప్పుడు తాళం తీస్తాడో, ఎప్పుడు వెళ్తాడో ప్రజలకు తెలియని పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం అరగంట మాత్రమే కార్యాలయం తలుపులు తీసి తిరిగి మూత వేశారు. మూడు గంటల సమయంలో వివిధ పనులపై రైతులు కార్యాలయానికి వెళ్తే తాళం వేసి ఉండటంతో ఉసూరుమంటూ ఇంటికి వెళ్లారు. ఉన్నతాధికారులు  స్పందించి ఉదయం 10 గంటలనుండి 5 గంటల వరకు కార్యాలయం తెరచి ఉండేలా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు.

 ఏఈ గారు  వివరణ కోరగా తర్లుపాడు సబ్ ఇంజనీర్ కార్యాలయానికి తాళం వేసి ఉన్న మాట వాస్తవమే అన్నారు. పలువురు రైతులు విషయాన్ని  తన దృష్టికి తీసుకొచ్చారు. కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కచ్చితంగా సబ్ ఇంజనీర్ ఉండాలి. తాను క్యాంపుకు వెళ్ళినప్పుడు కార్యాలయానికి తాళాలు వేసినట్లు తమ దృష్టికి వచ్చింది. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఏ ఈ హనుమానాయక్ తెలియజేశారు

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: