యూనివర్సిటీలను బలోపేతం చేయాలి 

మౌలిక సదుపాయాలు పెంచాలి

టెక్నాలజీని పరిశ్రమలకు అనుసంధానం చేయాలిి

డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి



(జానో జాగో వెబ్ న్యూస్_  విజయవాడ బ్యూరో)

ప్రఖ్యాత జవహర్‌లాల్ నెహ్రు టెక్నలాజికల్ యూనివర్సిటీ 50 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్బంగా SRC ఫార్మా కంపెనీ అధినేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి యూనివర్సిటీ బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ యాభైఏళ్లలో ఎంతో మంది విద్యార్థులను నిపుణులుగా  తయారు చేసిందని కొనియాడారు. దేశంలో JNTU లాంటి యూనివర్సిటీలు అవసరమన్న ఏలూరి.. అందుకోసం ఆయా ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు పెంచాలి.. అప్పుడే పరిశోధనలకు అవకాశం పెరుగుతుందని చెప్పారు ఏలూరి. ప్రస్తుతం చాలా విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు కావలసిన మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్నాయని.. కేంద్ర మరియు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వాటిమీద దృష్టిసారించాలని కోరారు. యూనివర్సిటీలలో సదుపాయాలు పెంచడం ద్వారా భవిషత్ లో కరోనా లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని సులువుగా ఎదుర్కోవడానికి దోహదపడుతుందని  అన్నారు. అలాగే యూనివర్సీటీలలో ఉన్న టెక్నాలజీని పరిశ్రమలకు అనుసంధానం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్న ఏలూరి.. ఇలా చేయడం ద్వారా కొత్త ఆవిష్కరణకు అవకాశం ఉంటుందని.. విద్యార్థులు బోధనాసమయం నుంచే స్కిల్స్ దిశగా అడుగులు వేస్తే.. కోర్సు పూర్తిచేసుకునే నాటికి ఉద్యోగ నైపుణ్యాలతో జాబ్ మార్కెట్లో అడుగుపెట్టొచ్చని వెల్లడించారు. ఇది యూనివర్సిటీల టెక్నాలజీని పరిశ్రమలకు అనుసంధానం చేయడం ద్వారానే బలోపేతం అవుతుందని చెప్పారు. ఇక భారతదేశం భవిషత్ లో మరింత అభివృద్ధి చెందాలి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కు ఎక్కువ నిధులు కేటాయించాలని కోరారు. కాగా సైన్స్  అండ్ టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలి అంటే అది యూనివర్సిటీ ల నుంచే సాధ్యమవుతుందని.. దీనికి ఆయా ప్రభుత్వాలు తోడ్పాటును అందిస్తే దేశం వెనుదిరిగి చూసుకునే పనిలేదని ఏలూరి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: