ప్రజానీకంలో కి శాస్త్ర విజ్ఞానం...

ఇదే మా ఆశయం

జన విజ్ఞాన వేదిక డివిజన్ కార్యదర్శి ఏనుగుల రవికుమార్


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో  సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు  ఎం.చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక డివిజన్ కార్యదర్శి ఏనుగుల రవికుమార్ మాట్లాడుతూ సామాన్య ప్రజానీకంలో శాస్త్ర విజ్ఞాన ప్రచారం చేయటం,పర్యావరణ కాలుష్య నివారణకు కృషి చేయటం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జన విజ్ఞాన వేదిక కృషి చేస్తుందన్నారు.
ప్రధానోపాధ్యాయులు  మునగాల చంద్రశేఖర్ రెడ్డి

ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక పట్టణ గౌరవ అధ్యక్షులు దుగ్గెంపూడి వెంకటేశ్వరరెడ్డి, పట్టణకార్యదర్శి వడ్డే రవికాంత్,  నాయకులు దండా వెంకటేశ్వరరెడ్డి,  వెంకట్రావు, శేఖర్, ఎస్ ఎన్ డి రఫీ, వెంకటేశ్వర్లు ,పండిత పరిషత్ నాయకులు జి ఎల్ రమేష్ బాబు, యుటిఎఫ్ నాయకులు ఒద్దుల వీరారెడ్డి, ఉపాధ్యాయులు దండా వెంకట రెడ్డి, రత్న రాజు, వెంకటరామయ్య, శ్రీనివాసులు,  అడుంగుల మోహన్,  కె.సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: