డీలర్ల చేతివాటానికి నిలువెత్తు నిదర్శనం

పాకెట్లను నుంచి కంది పప్పును వేరు చేసి

నిద్రావస్థలో పౌరసరఫరాల శాఖ


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

 ప్రభుత్వ రేషన్ దుకాణాలపై  పౌరసరఫరాల శాఖ  క్షేత్ర స్థాయిలో దృష్టి సారించకపోవడం తో  డీలర్లు  తమ చేతి వాటాన్ని యధేచ్ఛగా చూపుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వం  బడుగు బలహీన వర్గాల కోసం  చౌక దుకాణాల ద్వారా అందిస్తున్న రేషన్, చక్కెర, కందిపప్పు  దొడ్డిదారిన  బ్లాక్ మార్కెట్ కు ఏ స్థాయిలో తరలిపోతున్నాయి అనే దానికి ఈ పై చిత్రం దర్పణం పడుతుంది, మార్కాపురం పట్టణం లోని  సాయి బాలాజీ థియేటర్ వెనకాల  రేషన్ షాపుల్లో ఇవ్వవలసిన  కందిపప్పు ప్యాకెట్ లో నుంచి వేరు చేసిన ఖాలీ ప్యాకెట్లను  బస్తాల కొద్ది చిల్ల కంపల్లో  పడేసి ఉండడం  ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, ప్రభుత్వం, అవినీతిని పూర్తిస్థాయిలో  అరికట్టే యత్నంలో  ప్రత్యేక బియ్యపు వాహనాలను ప్రవేశపెట్టి  వీధులలో గడపగడపకు తిప్పుతూ భళారే  అంటూ  ఇది ఒక చక్కటి పథకమని  ప్రకటించుకుంటూ ఉండగా  సదరు బియ్యం వాహనాల  వారు  నెలలో ఒకసారి ఎప్పుడో ఒకప్పుడు  వార్డులలో కొచ్చి  కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారని, చక్కెర, కందిపప్పు లకు  మంగళం పాడారని  వినియోగదారులు ఈ సందర్భంగా అంటున్నారు,, గతంలో చౌక దుకాణాల ద్వారా  బియ్యం పంపిణీ చేసే  పద్ధతే బాగుందని  ప్రస్తుతం   కందిపప్పు  పంచదార కార్డుదారులకు అందడం లేదని  జగనన్న  బియ్యపు  బండి  కేవలం బియ్యం పంపిణీ కే పరిమితమైందని ప్రజలు విమర్శిస్తున్నారు, మరి  పేదలకు పంపిణీ చేయవలసిన  పౌరసరఫరాల శాఖ ముద్రణతో ఉన్న  ఈ కందిపప్పు ఖాళీ  ప్యాకెట్లు  ఇక్కడ ఎక్కడి నుండి వచ్చాయో అంటూ  డీలర్ల అధికారుల తీరుపై ప్రజలు పెదవి  విరుస్తున్నారు.

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్్ 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: