తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు

డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి


(జానో జాగో వెబ్ న్యూస్_  విజయవాడ బ్యూరో)

తెలుగు ప్రజలకు SRC Laboratories అధినేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి విజయదశమి (దసరా) శుభాకాంక్షలు తెలిపారు. దసరా అంటేనే తెలుగు ప్రజలకు విశిష్టమైన పండగని.. ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటామని అన్నారు. చెడుపై మంచి, దుష్టశక్తులపై దైవశక్తులు సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండగ జరుపుకొంటున్నామన్నారు. చెడు ఎంత శక్తిమంతమైనదైనా అంతిమ విజయం మంచి పైనే ఉంటుందని ఈ సందర్భంగా ఏలూరి చెప్పారు. జగన్మాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ శాంతులతో ఉండాలని, సిరి సంపదలు లభించాలని ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు వరించేలా దుర్గామాత దీవించాలని కోరుకుంటూన్నానని ఆయన వెల్లడించారు. ఇక దేశంలో కరోనా వ్యాప్తి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రజలందరూ ప్రభుతం సూచించిన కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సంతోషంగా పండుగను జరుపుకోవాలని సూచించారు. అలాగే ప్రతిఒక్కరు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకొని తద్వారా కరోనా నియంత్రణకు పాటుపడాలని సూచించారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: