గ్రామ సమస్యలపై,,,

సర్వ సభ సమావేశం 

(జానో జాగో వెబ్ న్యూస్_ తర్లుపాడు ప్రతినిధి)

ప్రకాశం జిల్లా   తర్లుపాడు మండలం లోని అన్ని శాఖలకు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తర్లుపాడు మండలం లోని ఎంపీడీవో కార్యాలయంలో సర్వ సభ సమావేశం ఏర్పాటు  ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి గారి ఆధ్వర్యంలో  ముఖ్యఅతిథిగా విచ్చేసిన మార్కాపురం శాసన సభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి  అన్నీ అధికార శాఖలతో సమీక్ష సమావేశం లో గ్రామ సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి అన్ని పంచాయతీల సర్పంచులు, ఎంపిటిసిలు  అన్ని శాఖల అధికారులతో వారి  గ్రామాల సమస్యలు తెలిపారు. విద్యాశాఖలో కేతగుడిపి , బుడ్డ పల్లి, నాగేళ్లముడిపి, సీతానాగులవరం స్కూలు మరమ్మతులు చేయాలని, ఉపాధ్యాయుల కొరత ఉందని విద్యావలంటీర్లను ఏర్పాటు చేయాలని సర్పంచ్ దూదేకుల మస్తాన్, తాటికొండ ఆంజనేయులు, అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా మండలంలో త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉందని, ఓవర్ హెడ్ ట్యాంకు లు శిథిలావస్థలో తర్లుపాడు, సూరేపల్లి, కేతగుడిపి, తాడివారిపల్లి గ్రామాలలో నీటి సమస్య పై ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.


ఈ సమస్యపై  స్పందించాలని శాసనసభ్యులు అధికారికి కుదిరితే మరమ్మతులు చేయాలని లేని పక్షాన నూతన నిర్మాణానికి తోడ్పడేలా చేయాలని అన్నారు. ప్రతి ఒక్క అధికారి ఒక వారం పాటు అన్ని గ్రామాల్లో పర్యటించి ఈ సమస్యలన్నీ  పరిష్కారానికి తోడ్పడాలని అన్నారు.ఈ సందర్భంగా ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి మాట్లాడుతూ ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి తోడ్పాటుకు కృషిచేస్తానని అన్నారు.


ఈ కార్యక్రమంలో  మండల అభివృద్ధి అధికారి ఎస్.నరసింహులు, మండల తహసీల్దార్ పి. శైలేంద్ర కుమార్, సర్వేర్  మస్తాన్ వలీ అన్ని శాఖల అధికారులు, వైసిపి నాయకులు సూరెడ్డి. రామసుబ్బారెడ్డి, కుందూరు సత్యనారాయణ రెడ్డి, గ్రామ సర్పంచ్ ఇతరులు పాల్గొన్నారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: