తమ సంప్రదాయాలను  ఇష్టంగా ఆచరించారు...

ఇతరుల విశ్వాసాలను గౌరవించారు

ఇదే నా భారత దేశ గొప్పతనం...ఇందుకు నిలువెత్తు నిదర్శనం ఈ వాస్తవిక కథ


తమ తమ మత ఆచారాలను ఇష్టంగా ఆచరించడం, ఇతర మత సోదరుల విశ్వాసాలను గౌరవించడమే అసలైన మత సామరస్యం. ఇది భారత దేశంలో మెండుగా కనిపిస్తుంది. రామ్ రామ్ జీ, అస్సలామ్ వాలైకుం భాయ్, ఓ పుత్తర్ కైసే హో, ఆమెన్ వంటి పలకులు నా భారతదేశానికి గొప్ప సిరులు. కానీ కొన్ని శక్తులు ఇటీవల మేం చెప్పింది పలికితేనే ఈ దేశంలో ఉంటారు. లేకుంటే దేశం విడిచి వెళ్లాలి అని మైనార్టీ వర్గాలపై చేస్తున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. కానీ నా దేశం ఇలాంటి వారితో నిండిలేదు. పరమత సహనం మెండుగా ఉండటమే కాదు ఇతర మతాల విశ్వాసాలను గౌరవించే ప్రజలే ఎక్కువగా ఉన్నారు. నా భారతదేశం గొప్పతనాన్ని తెలియజేసే వాస్తవ కథ మీ కోసం. 


అది పంజాబ్ రాష్ట్రంలోని మోగా జిల్లా భలూర్ గ్రామం. అక్కడ హిందూ, సిక్కు, ముస్లిం  కుటుంభాలు నివసిస్తున్నాయి. మరో విశేషం ఏమిటంటే ఆ గ్రామంలో నివాసముంటున్నది నాలుగు ముస్లిం  కుటుంభాలే. ఈ గ్రామంలో ఏడు దేవాలయాలు,  రెండు గురుద్వారాలు ఉన్నాయి. గ్రామంలోని నాలుగు ముస్లిం కుటుంభాలు నమాజు చేసుకోవడానికి అక్కడ మసీదు లేదు. దేశ విభజనకు ముందు ఆ గ్రామంలో ఉండే మసీదు కాస్త శిథిలావస్థకు చేరుకొంది. ఈ వాస్తవ పరిస్థితి గ్రహించి ఆ గ్రామంలోని హిందూ, సిక్కు సోదరులు తమ ముస్లిం సోదరుల నమాజు చేసుకోవడానికి కనీసం తమ గ్రామంలో మసీదు లేదే అన్న చింతన వారిలో కలిగింది. ఓ రకంగా చెప్పాలంటే వారిలో నాలుగు ముస్లింల  కుటుంభాల  పట్ల  సోదర ప్రేమ కలిగింది. దీంతో గ్రామ మంతా ఓ అభిప్రాయానికి రావడం కారణంగా ఆ గ్రామ సర్పంచ్ పాల సింగ్ ఓ ప్రకటన చేశాడు. ఆ ప్రకటన సాదాసీదామైనది కాదు, నేటి తరానికి స్పూర్తినిచ్చే ప్రకటన  చేశాడు. ఎవరి విశ్వాసాలను వారు ఆచరించేందుకు వారి వారి ప్రార్థనా మందిరాలున్నాయి. కానీ మన గ్రామంలోని నాలుగు ముస్లిం  కుటుంభాలకు ప్రార్థన చేసేందుకు మసీదు లేదు. గ్రామంలోని అన్ని వర్గాల  వారు తమ తమ ప్రార్థనా మందిరాలు కలిగివుండాలని గ్రామస్థులంతా కోరుకొంటున్నారు. కాబట్టి శిథిలావస్థకు చేరుకొన్న మసీదు స్థలంలోనే కొత్త మసీదు నిర్మించాలని కోరుకొంటున్నాం. అందుకే అక్కడ కొత్త మసీదు నిర్మించాలని మేం నిర్ణయించామని ఆ గ్రామ సర్పంచ్ పాల సింగ్ ప్రకటించారు. అంతేకాదు ఆ మసీదు నిర్మాణానికి  ఆ గ్రామంలోని హిందూ, సిక్కు, ఇతర వర్గాల ప్రజలు తమ తహత్తును బట్టి వంద రూపాయల నుంచి లక్ష రూపాయల  వరకు ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించారు. మన రాజకీయ నేతల ఇచ్చే హామీలాగా ఆ గ్రామ సర్పంచ్ ప్రకటన హామీల్లాగే ఉండిపోలేదు.  ఆ సర్పంచ్ ప్రకటన వెంటనే కార్యరూపం దాల్చింది. మసీదు నిర్మాణానికి పునాది పడింది. ఈ నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆ గ్రామంలోని అన్ని మతాల ప్రజలు పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు  చేశారు. అక్కడి సాంప్రదాయ  మిఠాయి జిలేబీ  పంచుకొని గ్రామస్థులంతా తమ ఆనందాన్ని పంచుకొన్నారు.  మత సామరస్యం అంటే ఇదే అని నేటి సమాజానికి చాటి చెప్పారు. మన దేశ ఐక్యత, పరమత  సహనం, భినత్వంలో ఏకత్వం గొప్పతనాన్ని మరోసారి తెలియజేసే ఉద్దేశంతో ఈ  చిరు వాస్తవ కథ మీ అందరి కోసం.


Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: