దొంగతనం కేసు చేధించిన పోలీసులు

వివరాలు వెల్లడించిన మార్కాపురం డిఎస్పి


(జానో జాగో వెబ్ న్యూస్_  మార్కాపురంమార్కాపురం ప్రతినిధి)

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం లోని దరిమడుగు గ్రామంలో జరిగిన దొంగతనం కేసులో పోలీసులు ఛేదించారు. వివరాలలోకి వెళితే...దరిమడుగు గ్రామానికి చెందిన గోమసాని శశికళ భర్త వెంకటేశ్వర్లు అనునామె తన గ్రామంలో కిరాణా కొట్టు  నడుపుతున్నట్లు, తేది 22.09.2021 న రాత్రి, ఆమె తన షాప్ లో ఉండగా, ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ సైకిల్ పై ఆమె షాప్ వద్దకు వెళ్లి, సిగరెట్ లు కావాలని, ఆమె వద్ద సిగరెట్స్ కొంటున్నట్లు నటించి, వారిలో ఒక  వ్యక్తి ఆమె మెడ నుండి, తాళిబొట్టు సరుడును బలవంతంగా లాక్కొనగా, అది తెగిపోవడంతో, తెగిన ముక్కను, దానికి ఉన్న లక్ష్మి దేవి బిళ్ళను, గుండ్లను తీసుకొని మరొక వ్యక్తి తో కలసి మోటార్ సైకిల్ పై పారిపోయినట్లు పిర్యాదు చేయగా, మార్కాపురం రూరల్ SI గారు కేసు నమోదు చేసినారు. 


                  అదే విధంగా తేది 06.07.2021 న రాత్రి, 7.00 గంటల సమయంలో కంభం లోని  కందులాపురం కాలనీలో, కిరాణా షాప్ నడుపుతున్న ఆరవీటి లక్ష్మి రంగమ్మ అనునామె తన షాప్ లో ఉండగా, ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ సైకిల్ పై ఆమె షాప్ వద్దకు వెళ్లి, సిగరెట్ లు కావాలని, ఆమె వద్ద సిగరెట్స్ కొంటున్నట్లు నటించి, వారిలో ఒక  వ్యక్తి ఆమె మెడ నుండి తాళిబొట్టు సరుడును బలవంతంగా లాక్కొని, మరొక వ్యక్తి తో కలసి మోటార్ సైకిల్ పై పారిపోయినట్లు, పిర్యాదు చేయగా, కంభం  SI గారు కేసు నమోదు చేశారు. ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ IPS, ఆదేశాల మేరకు, మార్కాపురం రూరల్ ఎస్ ఐ వారి సిబ్బంది,  మార్కాపూరo ఎస్ డి పి ఓ పర్యవేక్షణలో దొంగిలించబడిన బంగారు ఆభరణాలను రికవరీ చేయడానికి, నిందితులను గుర్తించడానికి బృందాలుగా ఏర్పడి, నిందితుల ఆచూకి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. తేది 02.10.2021 న మార్కాపురం రూరల్ SI గారికి రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు, తన సిబ్బందితో కలిసి, పైన పేర్కొన్న A1 నిందితుడిని మార్కాపురం టౌన్ లోని, ZPH School వద్ద అరెస్ట్ చేసి, అతడిని క్షుణ్ణంగా పరిశీలించి తన ఒప్పుకోలు వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఒప్పుకోలు సమయంలో నిందితుడు తన స్నేహితుడు అయిన సునీల్ తో కలసి,


మొదటగా
టగా ఈ సంవత్సరం జూలై నెలలో, కంభం లోని  కందులాపురం కాలనీలో, కిరాణా షాప్ నడుపుతున్న ఒక మహిళ వద్దకు మోటార్ సైకిల్ పై వెళ్లి, సిగరెట్ లు కావాలని, ఆమె వద్ద సిగరెట్స్ కొంటున్నట్లు నటించి, ఆమె మెడ నుండి, తాళిబొట్టు సరుడును బలవంతంగా లాక్కొని, మోటార్ సైకిల్ పై పారిపోయినట్లు, అదేవిధంగా, సుమారు 10 రోజుల క్రితం దరిమడుగు గ్రామంలో కూడా,కిరాణా షాప్ నడుపుతున్న ఒక మహిళ మేడలో నుండి, తాళిబొట్టు  సరుడు లాక్కోనగా అది తెగిపోవడంతో, తెగిన ముక్కను, దానికి ఉన్న లక్ష్మి దేవి బిళ్ళను, గుండ్లను, తీసుకొని తన స్నేహితుడు సునిల్ తో కలిసి, మోటార్ సైకిల్ పై పారిపోయినట్లు అంగీకరించగా, ముద్దాయి ఒప్పుకోలునామా మేరకు మార్కాపురం రూరల్ SI గారు, తేది 02.10.2021 న ఉదయం 10.00 గంటలకు నిందితుడిని అరెస్టు చేసి, అతనివద్ద నుండి పైన పేర్కొన్న రెండు కేసులకు సంబందించిన చోరి సొత్తును  స్వాదీన  పర్చుకున్నారు. ఈ కేసులో మరొక ముద్దాయి అయిన సునిల్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీస్ లు గాలిస్తున్నారు. ఈ సమావేశంలో లో బి టి నాయక్, మార్కాపురం రూరల్ ఎస్సై కోటయ్య, కంభం ఎస్ఐ పాల్గొన్నారు.

                      ఈ కేసులో ముద్దాయిని  రిమాండ్ నిమిత్తం, మార్కాపురం గౌరవ AJFCM కోర్ట్ లో  హాజరుపరుస్తున్నారు. ఈ కేసులో త్వరితగతిన  పురోగతి సాదించినందుకు గాను, ప్రకాశంజిల్లా SP శ్రీమతి. మల్లికాగార్గ్ IPS గారు, మార్కాపురo DSP గారిని, మార్కాపురం CI గారిని, మార్కాపురం రూరల్ SI గారిని  మరియు వారి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: