విజయదశమి ప్రత్యేకత ఏంటి...

చరిత్ర ఏం చెబుతోంది

దసరా అంటే విజయదశమి పండుగ. చెడుపై మంచి సాధించిన విజయంగా ఈ పండుగను జరుపుకుంటారు. విజయదశమి రోజున అహంకారి అయిన రావణుడిని శ్రీరామచంద్రుడు అంతం చేశారని నమ్ముతారు. అంతేకాదు ఓ రాక్షసుడి నుంచి భూమిని శ్రీరామచంద్రప్రభు రక్షించాడని విశ్వసిస్తారు. రావణుడి దురాగతాలు ఈ రోజుతో ముగిశాయని భావిస్తారు. అబద్దం పై సత్యం విజయం సాధించిదని చెబుతూ విజయదశమి పండగను జరుపుకుంటారు.

ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా, అడ్డంకులు ఎదురైనా సత్యం ధర్మం అనే దారి నుంచి పక్కకు రాకూడదు. వాటిని ఎప్పటికీ వదులుకోకూడదు. ప్రతికూల పరిస్థితుల్లో సత్యం ధర్మం తూచా తప్పకుండా పాటించే వ్యక్తి ఎప్పటికీ పరధ్యానంతో ఉండడు. అలాంటి వ్యక్తికి విజయం సాధించకుండా ఏ శక్తి అడ్డుకోలేదు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ సాటి మనిషి పట్ల దయ, కరుణ, జాలి అనేది చూపించాలి.

రచయిిత _మునగాల చంద్రశేఖర్ రెడ్డిి

దసరా పండుగ రోజున రావణుడిని దహనం చేస్తారు. రావణుడితో పాటు కుంభకర్ణ, మేఘనాథుల దిష్టిబొమ్మలను కూడా దహనం చేస్తారు. పంచాంగం ప్రకారం దీపావళికి 20 రోజుల ముందర దసరా పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం అంటే 2021లో దీపావళి పండగను కార్తీకమాసంలోని కృష్ణ పక్ష అమావాస్య రోజు, అంటే 4 నవంబర్ 2021 గురువారం రోజు జరుపుకుంటారు. ఇక దీని ప్రకారం చూస్తే *దసరా పండగా 15 అక్టోబర్ 2021న జరుపుకుంటున్నాము.

దసరా రోజున చంద్రుడు మకరరాశి మరియు శ్రావణ నక్షత్రాలలో ఉంటాడు. ఆ రోజున మకర రాశిలో మూడు గ్రహాల కలయిక ఉంటుంది. మకరరాశిలో గురు, శని మరియు చంద్రులు సంచరిస్తారు. దసరా రోజున పంచాంగం ప్రకారం విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 2 నిమిషాల నుంచి 2 గంటల 48 నిమిషాల వరకు ఉంటుంది.ఏదైనా మంచి కార్యం తలపెట్టేందుకు దశమి ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. దశమి తిథి 2021 అక్టోబర్ 14న సాయంత్రం 6గంటల 52 నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ 15వ తేదీ సాయంత్రం 6 గంటల 2 నిమిషాలకు ముగుస్తుందని పంచాంగం చెబుతోంది.

రావణుడిని శ్రీరామచంద్రుడు అంతమొందించాడని చెబుతూ దసరా జరుపుకుంటున్నామనేది ఒక కారణమైతే...మహిషాసురుని దుర్గామాత అంతమొందించిందనే కారణంగా కూడా దసరా వేడుక జరుపుకుంటాం. దసరా రోజున శమీ పూజ,అపరజిత పూజ,సీమ అవలంగ్హన్ పూజలు నిర్వహిస్తారు. పశ్చిమ బెంగాల్‌లో దసరా పెద్ద వేడుకగా నిర్వహిస్తారు. దుర్గా పూజ 10వ రోజున బెంగాళీలు బిజోయ దశమిని పాటిస్తారు.ఈ రోజున దుర్గామాత ప్రతిమలను ఊరేగింపుగా తీసుకెళ్లి నదిలో నిమజ్జనం చేస్తారు.

రచయిత_మునగాల చంద్రశేఖర్ రెడ్డి

ప్రధానోపాధ్యాయులు

జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల 

మార్కాపురం

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: