నిరుద్యోగ భారతం

మానవ వనరులు మెండుగా ఉన్నా

ఉపాధి అవకాశాలు అంతంతే

కరోనాతో మరింత దిగజారిన ఉద్యోగ అవకాశాలు

నైపుణ్యం లేని ఇంజనీరింగ్, వైద్య విద్యతో మరింత నష్టం


భారతదేశం వేగంగా అభివృద్ది వైపు దూసుకెళ్తున్న దేశం అన్నది నేడు ప్రచారంలోనున్న మాట. కానీ భారతదేశం నేడు ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య అంతా ఇంతా కాదు.  కరోనా  ప్రభావంతో మన దేశం నిరుద్యోగ భారతంగా మారింది.

ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో కష్టించే స్వభావమున్న కార్మికశక్తి 61 %గా ఉంది. ఆ శక్తి మన భారతదేశానికి 64 %గా ఉంది. ఇదే మన భారతదేశం ఎదిగేందుకు మార్గసుగుమం చేస్తుందన్నది ఆర్థిక నిపుణులు అభిప్రాయం. అయినా భారతదేశంలో ఇంకా నిరుద్యోగం ఎందుకు పెరిగిపోతోంది.  మన దేశంలో 105 కోట్ల మంది 15 సంవత్సరాలు కంటే పైబడినవారు ఉన్నారు. 100 % పట్టభద్రుల్లో 60 %పనిచేయటానికి సిద్ధంగా ఉన్నారు. వీరిలో 26 % మందికి పనిలేదు. మన పట్టభద్రుల్లో 20 -24ఏళ్లు మధ్యనున్న యువకుల్లో 46 % నిరుద్యోగం ఉంది , 25 -29 వయసులోని యువకుల్లో 15 %నిరుద్యోగముంది, 30 -34 మధ్య వయస్సున్న వారిలో 6 %, 45 -64మధ్య వయస్సున్న వారిలో  2 % నిరుద్యోగముంది. 


ఇక అచ్చే దిన్ వచ్చాక మోడీ ప్రభుత్వం సవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలను కల్పిస్తానంది. జనాభా విస్ఫోటనం వలన దేశంలో 2018 సంవత్సరం నుంచి పని చేయగల యువ శక్తి 15 -64 సంవత్సరాలు మధ్య ఉన్నారు .విరి సంఖ్య పని చేయని వారి కంటే ఎక్కువగా ఉంది.15 సంవత్సరాలు కంటే తక్కువ 64 సంవత్సరాలు కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు  రానున్న 30 సంవత్సరాలలో పనిచేసే యువ శక్తి కంటే తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే పనిచేయగల యువ శక్తి భారతదేశంలో ఉంది. జపాన్, చైనా, దక్షిణ కొరియా , సింగపూర్ దేశాలు తమ దేశంలోని యువ శక్తికి అనుగుణంగా ఉన్నత ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. వారి నవతరానికి మంచి పౌష్ఠిక ఆహరం, నైపుణ్యాలతో కూడిన విద్య , సమాన అవకాశాలు ,పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం మొదలైన మౌలిక సదుపాయాలు కల్పించాయి. అందుకే ఈ రోజు ఈ దేశాలు ప్రపంచ మార్కెట్ లను  శాశిస్తున్నాయన్నది ఆర్థిక నిపుణుల విశ్లేషణ. కానీ మన దేశం లో 2014 నుంచి స్థిరమైన ప్రభుత్వమున్నా యువ శక్తికి సరైన దిశా ,దశ నిర్దేశం చేయలేకపోతోంది.


మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, స్టార్టుప్ ఇండియా, స్కిల్ ఇండియా  లాంటి నినాదాలకే మన దేశంలోని పాలన విధానాలు పరిమితమయ్యాయి.  ప్రణాళిక సంఘంను నితి ఆయోగ్ డి, జిఎస్టి లాంటి మార్పులు చేసింది మోడీ ప్రభుత్వం. భారతదేశాన్ని 5 ట్రిలియన్  ఎకానమీ గా తీర్చిదిదుతా నరేంద్ర మోడీ అన్నారు, వాస్తవంగా చూస్తే భారత దేశంలో నిరుద్యోగం దీని ప్రభావం ఎలా  ఉంటుందో సెంటర్ ఫర్ మోనటరింగ్  ఇండియన్ ఎకానమీ సంస్థ వారు 5 సంవత్సరాల అధ్యయనం ప్రకారం మే 2016 నుంచి ఫిబ్రవరి 2021 డేటా ప్రకారం, మే 2016  లో 94 కోట్లమంది పనిచేయగల యువశక్తి ఉంది, ఈ ఐదు సంవత్సరాలలో ఫిబ్రవరి 2021 లో 105 కోట్లమంది పనిచేయగల యువశక్తి గా, 11 కోట్లమంది  పెరిగింది. మే 2016 లో 94 కోట్లమంది పనిచేయగల యువశక్తి లో 46  కోట్లమంది మాత్రమే ఉద్యోగాలలో ఉన్నారు .మిగిలిన 48 కోట్లమంది ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు లేదా  పని చేయకుండా ఉన్నారు అని తేల్చింది . 105 కోట్లమంది లో42 కోట్లమంది పనిచేయగల యువశక్తి ఉంది. మిగతా 63 కోట్లమంది ఉద్యోగ వేటలో ఉన్నారు . (సి ఎం ఐ ఈ) లెక్కలప్రకారం ప్రతి నలుగురిలో ఒకరు నిరుద్యోగిగా ఉంటున్నారు,

ఇదేదో కరోనా కారణం వల్ల  జరిగింది  కాదని ఆర్థిక నిపుణుల అంచనా. అయితే కరోనా భారతదేశంలో ఉపాధి అవకాశాలను ఎక్కువగా దెబ్బతీసిందని మాత్రం స్పష్టంగా తేలింది. పైన చెప్పిన నిరుద్యోగితకు  కరోనా వల్ల  మూతపడ్డ పరిశ్రమలకు ఏ మాత్రం సంబంధం లేదని గ్రహించాలి. 


ఇంజీనీరింగ్ విభాగంలో ఉద్యోగ అవకాశాలున్న వాటిని అందుకోవటానికి మన విద్యార్థులు సరైన నైపుణ్యాలు లేవు. 2003 జాతీయ ఉపాధికల్పన నివేదిక, యూ వీ రావు నివేదిక  ప్రకారం 90 % విద్యార్థులకు సరైన నైపుణ్యాలు లేవు .దీనికి కారణం పుట్టగొడుగుల్లా ఇంజీనీరింగ్ కళాశాలలు పుట్టుకురావడమే .మన తెలుగు రాష్ట్రాల్లో ఫీజు రియాంబర్స్ మెంట్ వల్ల లక్షల్లో ఇంజీనీర్లు తయారయ్యారు. దేశం మొత్తం మీద ఏ ఐ సి టి ఈ  1 .67 లక్షల సీట్స్ ను రద్దుచేసింది. ఇక మెడికల్ కాలేజీల మాఫియా గురుంచి చెప్పనక్కరలేదు. ఒకొక్క  ఎన్ ఆర్ ఐ సీట్ కి రూ.2 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. మెడికల్ కాలేజీలన్ని మనీ కాలేజీగా మారిపోయాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 57 % వైద్యుల దగ్గర సరైన వైద్య అనుభవంలేదు. ప్రతి 1700 మందికి ఒక డాక్టర్ మాత్రం ఉన్నాడు. మెడికల్ కౌన్సిల్ అఫ్ ఇండియా లెక్కల ప్రకారం 10 లక్షల డాక్టర్లు నమోదు చేసుకుంటే వారిలో కేవలం లక్ష మంది మాత్రమే మెడికల్ ప్రాక్టీస్ చేయటానికి అర్హత సాధిస్తున్నారు. దేశంలోని 5 వేల మానేజ్మెంట్ కాలేజీల నుంచి 2 లక్షల ఎం బి ఏ లు ఉద్యోగవేటలో ఉన్నారు .అసోచామ్ నివేదిక ప్రకారం 7 %మాత్రమే ఉద్యోగాలకు అర్హత కలిగివున్నారు. ప్రపంచంలో నిరుద్యోగం పెరగటానికి యాంత్రీకరణ అని చెప్పవచు . కానీ టెక్నాలజీ మార్పులను మనం అంగీకరించక తప్పదు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: