అన్నదాతకు మరణం లేదు

-------------------------------------

ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరి లో రైతుల పాశవిక హత్య పై నిరసన తెలుపుతూ స్పందన


దేశం నేడు

ఓ యుద్ధ భూమి.

లఖింపూర్ ఖేరీ నేడు

అన్నదాత హత్య చేయబడ్డభూమి.

రైతు పోరు నేడు

రగలి, కదలి

రక్తంతో తడిసి ముద్దయి

రేపు మహాసముద్ర మయి

కొత్త ఊపిరిలు పోసుకొని

జల ప్రళయం ఘోషతో

వాడి అధికార మదాన్ని అణిచి వేస్తుంది.

మృత్యువునే పరిహసిస్తూ

పోరు విత్తనాలు నాటుతూ దిక్కార స్వరాన్ని వినిపిస్తూ

భగత్సింగ్ స్ఫూర్తితో

ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ

నినదిస్తున్న ఓకర్షకుడా

జన హృదయాలలో

మండుతున్న ఓ సూర్యుడా

నడుస్తున్న చరిత్రవు నీవు

జ్వలిస్తున్న విప్లవానివినీవు

ఔను

నువ్వు వర్తమానంలో మరణించవచ్చు.

కానీ భవిష్యత్తు కాంతిరేఖవు.

నీవు లఖింపూర్ లో కన్నుమూసిన

ఎల్లప్పుడూ సజీవంగా ఉంటావు.

నీవు నేడు

తనువు చాలించిన

చరిత్ర గమనాన్ని నిర్దేశిస్తూ

అలలు, అలలుగా తరలి వస్తునే ఉంటావు.

నేడు రాజ్యం

కార్పొరేట్లకు

నీ రక్తాన్ని కానుకగా ఇచ్చింది

ఐనా మండేగుండెల జ్వాలలు

లక్షలాది పిడికెళ్ళు ఏకమై

చీకట్లను చీల్చుకుంటూ

నీ స్వేద బిందువుల సాక్షిగా

రేపటి పొద్దై పొడవాలి.

                   

రచయిత_ షేక్ కరీముల్లా





 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: