భక్తజనం తరలి రాగా...

ఘనంగా దసరా పండుగ ఉత్సవాలు

(జానో జాగో వెబ్ న్యూస్_  గడివేముల ప్రతినిధి)

కర్నూలు జిల్లా గడివేముల మండలం లో లో దసరా పండుగ మహోత్సవాలు మిన్నంటాయి. గడివేముల మండలం లోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు రాజరాజేశ్వరి అలంకరణలో దర్శనమిచ్చారు. దుష్టశక్తులను ,అరిష్టాలను, దూరం  చేసి  కొలువుదీరిన అమ్మవారిని భక్తులు దర్శనం చేసుకొని మా బాధలను తొలగించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకీ సేవ అమ్మవారి ప్రధాన అర్చకురాలు వసంత లక్ష్మి ఆధ్వర్యంలో ప్రధాన రహదారుల్లో నిర్వహించారు.

జమ్మి చెట్టుటు వద్ద భక్తుల ప్రదక్షణలు

  అనంతరం స్థానిక పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలోని జమ్మిచెట్టును దర్శించుకుని పిల్లలకు కరుణ మహమ్మారి సోకకుండా క్షేమంగా ఉండాలని ప్రదక్షిణలు చేసుకొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు ఆది నారాయణ శర్మ. ఆర్యవైశ్య సంఘం సభ్యులు బుజ్జయ్య, రఘు ఉ ఆర్యవైశ్య సంఘం సభ్యులు సోదర సోదరీమణులు గడివేముల మండల గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: