టీటీకే ప్రిస్టేజ్‌లో ఆకట్టుకుంటున్న,,,

 ‘శుభుత్సవ్‌’ పండుగ ఆఫర్లు

(జానో జాగో వెబ్ న్యూస్_బిజినెస్ బ్యూరో)

గృహోపకరణాలు, వంట సామాగ్రిలో భారతదేశంలో గత ఆరు దశాబ్దాలుగా ప్రసిద్ధి చెందిన టీటీకే ప్రిస్టేజ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ విజయదశమి పండుగ సందర్భంగా సరికొత్త ఆఫర్లను ‘శుభుత్సవ్‌’ పేరుతో తీసుకొచ్చింది. గత నెల (సెప్టెంబరు) 16వ తేదీన ప్రారంభమయిన శుభుత్సవ్‌ కలెక్షన్లు.. వచ్చే నెల (నవంబరు) 30వ తేదీ వరకు కొనసాగనున్నాయి. కొనుగోలుదారులకు అనుకూలంగా క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లు ప్రకటించారు. అదేవిధంగా కొన్నింటికి 10 శాతం రాయితీ ధరలు ఇస్తున్నారు. మరి కొన్ని సామాన్లకు గిఫ్టు ఓచర్లు కూడా అందజేస్తున్నారు. టీటీకే ప్రిస్టేజ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ దినేశ్‌ గార్గ్‌ మాట్లాడుతూ.. పండుగ ఆఫర్లను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. భారీ రాయితీలు, క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయన్నారు.


ఆఫర్లు ఇవే..

– స్వచ్‌ అల్యూమినియం ప్రెషర్‌ కుక్కర్‌ (3లీటర్లు.. అంతకంటే పెద్దది) కొనుగోలు చేస్తే రూ.695 విలువ గల వెజ్‌ కట్టర్‌ ఉచితంగా లభిస్తుంది.

– స్వచ్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ ప్రెషర్‌ కుక్కర్‌ (2 లీటర్లు.. అంతకంటే పెద్దది) కొనుగోలు చేస్తే ధరలో 10 శాతం రాయితీతో పాటు రూ.495 విలువ గల స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ వాటర్‌ బాటిల్‌ ఉచితం.

– స్వచ్‌ గ్లాస్‌ టాప్‌ గ్యాస్‌ స్టవ్‌పై 20 శాతం రాయితీతో పాటు రూ.1995 విలువ గల పీఎంసీ 1.0 మల్టీ కుక్కర్‌ ఉచితంగా అందజేస్తారు.


– 750 వాట్ల మిక్సర్‌ గ్రైండర్లు మూడు లేదా నాలుగు కొనుగోలు చేస్తే 20 శాతం రాయితీతో పాటు రూ.1,395 విలువ గల 1.8 లీటర్ల కెటిల్‌ ఉచితం.

– రూ.8,495 విలువ గల టైఫూన్‌ వాక్యూమ్‌ క్లీనర్‌పై 20 శాతం రాయితీతో పాటు రూ.1,595 విలువ గల బహుమతి అందజేస్తారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: