విద్యుత్ చార్జీల పెంపుపై,,,,

టిడిపి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ

పాల్గొన్న పాణ్యం మాజీ శాసన సభ సభ్యురాలు గౌరు చరితారెడ్డి


(జానోజాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ చార్జీల పెంపు, సర్ చార్జీల పేరుతో సామాన్య మానవుడికి చుక్కలు చూపిస్తున్న వైయస్సార్ సిపి  ప్రభుత్వం పై మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పాణ్యం నియోజకవర్గం , గడివేముల మండలం లోని  కె.బొల్లవరం గ్రామం లో పాణ్యం నియోజకవర్గ మాజీ శాసనసభ సభ్యురాలు గౌరు చరితారెడ్డి ఇంటిటి కి వెళ్లి పెరిగిన విద్యుత్ ధరలపై ప్రజాభిప్రాయ సేకరణ గ్రామంలోని ప్రజలు అందరిని అడిగి  తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వైయస్సార్ ప్రభుత్వం ప్రజలకు నవరత్నాలు అందిస్తామని ప్రజల ఆనందమే మా ఆనందమని తెలిపిన ప్రభుత్వం  నేడు నవరత్నాలు బదులు ఆకాశంలోని నవ నక్షత్రాలను చూపిస్తున్నాడని, అమ్మఒడి పథకం పేరుతో తల్లులకు డబ్బులు ఇచ్చి నాన్న బుడ్డీలు పగలగొడుతునాడని, అవ్వాతాతలకు వచ్చే పింఛను వివిధ రకాల కారణాల సాకు చూపి పింఛన్లు రద్దు చేశారని, ఆవేదన వ్యక్తం చేశారు.


నంద్యాల పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేని ,ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రతిపక్ష పార్టీల ఆఫీసులపై, నాయకులపై దాడి చేయడం, తప్పు అని నిలదీసిన వ్యక్తులను అక్రమ కేసుల్ పెట్టి వారిని జైలుకు పంపించడం ఇది వ వైఎస్ఆర్ సిపి పార్టీ సంస్కృతికి అద్దం పడుతుందని,

 


టిడిపి హయాంలో మంజూరు అయిన ఇల్లు కేవలం ఒక రూపాయికే ఇస్తామని చెప్పిన ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ అంటూ పదివేల రూపాయలు చెల్లిస్తేనే ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పడం ప్రజల జేబులకు చిల్లులు పెట్టడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గడివేముల టిడిపి మండల కన్వీనర్ దేశం సత్యనారాయణ రెడ్డి,

 

 మంచాలకట్ట శ్రీనివాస్ రెడ్డి, నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ, గడివేముల సీనియర్ టిడిపి నాయకులు సీతారామి రెడ్డి , రామకృష్ణారెడ్డి, బంగారు షాపు శ్రీకాంత్, గపూర్, మాబు వలి, టిడిపి మహిళా సోషల్ మీడియా కోఆర్డినేటర్ సుభద్రమ్మ, చిందుకూరు గ్రామ సర్పంచ్ అనసూయమ్మ. ఎస్సీ సెల్ అధ్యక్షులు నాగ శేషులు, వడ్డు ప్రశాంతి, గడిగరేవుల సిద్ధం శీను, కృష్ణ మోహన్, కొరటమద్ది సుకుమార్, దుర్వేసి కృష్ణ యాదవ్, కరిమద్దెల శివారెడ్డి ,ఈశ్వర్ రెడ్డి, గడివేముల మండల టిడిపి నాయకులు, అభిమానులు ,పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: