భారత్ లోకి,,,

చీలీ వాల్ నట్స్  రాక

(జానోజాగో వెబ్ న్యూస్-బిజినెస్ బ్యూరో)

ఈ సీజన్ బహుమతులు ఇచ్చిపుచ్చుకునే సీజన్. పండుగలు సమీపించాయి. వాల్ నట్స్ ఫ్రమ్ చీలీ ఇప్పు డు భారతదేశం లోకి వచ్చింది, మన వేడుకల్లో భాగమవుతోంది. చీలీ వాల్ నట్స్ పెంపకందారులు, ఎగుమతి దారుల అసోసియేషన్ అయిన చీలీ నట్, ప్రపంచవ్యాప్తంగా చీలీ ఉత్పత్తుల సరఫరాల ప్రాచుర్యానికి కృషి చేస్తున్న చీలీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ  మద్దతుతో భారతదేశంలో మొట్టమొదటి క్యాంపెయిన్ చేప ట్టింది. భారతీయ వినియోగదారులకు చీలీ వాల్ నట్స్ ను పరిచయం చేసే ఉద్దేశంతో ఈ క్యాంపెయిన్ నిర్వహి స్తున్నారు.

భారతదేశంలో చీలీ దౌత్యవేత్త శ్రీ జువాన్ అంగులో అక్టోబర్ 1న న్యూదిల్లీలో తన నివాసంలో జరిగిన కార్యక్రమం లో ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అంగులో మాట్లాడుతూ, ‘‘చీలీ, భారత్ రెండూ కూడా వ్యూహాత్మక భాగస్వాములు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచుకోవడంలో రెండు దేశాలూ సన్నిహితంగా క లసి పనిచేస్తున్నాయి. దక్షిణార్థ గోళంలో ఉన్న చీలీ భారతదేశంలో సరఫరాలు తగ్గే సమయంలో తన సరఫరా లను అందించగలుగుతుంది. ఈ విధంగా రుతువుల మధ్య ఉన్న వ్యత్యాసం కారణంగా, ఇతర ప్రాంతాలకు చెం దిన సరఫరాలు అందుబాటులో లేని సమయం లోనూ భారతీయులు చీలీకి చెందిన తాజా ఉత్పాదనలను వి నియోగించేందుకు వీలవుతుంది. చీలీ వాల్ నట్ ప్రపంచం లోనే అత్యుత్తమమైందిగా గుర్తింపు పొందింది. అద నపు తేలికపాటి రంగు, తాజాదనం, అధిక దిగుబడులు లాంటివి చీలి వాల్ నట్ ప్రత్యేకతలుగా ఉన్నాయి. వాటిని భారతదేశంలో చూడడం నాకెంతో ఆనందం కలిగిస్తోంది’’ అని అన్నారు. 


 

చీలీనట్ ప్రెసిడెంట్ శ్రీ ఎడ్ముండో వాడెర్మా వీడియో కాల్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ, ‘‘దక్షిణార్థగోళంలో వాల్ నట్స్ అతిపెద్ద ఎగుమతిదారు చీలీ. అంతర్జాతీయంగా ఇది రెండో స్థానంలో ఉంది. చీలీ వాల్ నట్స్ 70 దే శాలకు ఎగుమతి అవుతున్నాయి. భారత్ ఇప్పుడు మాకు శరవేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్ గా ఉంది’’ అని అన్నారు.

ప్రొచీలీ ట్రేడ్ కమిషనర్ (న్యూదిల్లీ) మార్కెలా జునిగా అలెగ్రియా ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘చీలీ ప్రత్యేకమై న ప్రకృతి పరిస్థితులను కలిగిఉంది. అవి అత్యంత నాణ్యమైన వాల్ నట్స్ ను పెంచేందుకు వీలు కల్పిస్తాయి. అందుకే అవి ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రసిద్ధి చెందాయి. తూర్పున ఆండెస్, పశ్చిమాన పసిఫిక్ మహా స ముద్రం, ఉత్తరాన అటకామా ఎడారి, దక్షిణా అంటార్కిటికా చీలీకి ప్రకృతిపరమైన సరిహద్దులుగా ఉన్నాయి. పండ్లతోటలకు ఎలాంటి హాని కలుగకుండా కూడా ఇవి చూస్తాయి. ప్రపంచవ్యాప్తంగా అంతా అభిమానించే ఈ వాల్ నట్స్ ను భారతీయ వినియోగదారులు కూడా ఎంతగానో అభిమానిస్తారని నేను కచ్చితంగా చెప్పగలను’’ అని అన్నారు. ఈ సందర్భంగా చీలీ వాల్ నట్స్ కు ఇన్ కంట్రీ మార్కెటింగ్ రిప్రజంటేటివ్ అయిన శ్రీ సుమిత్ సరాన్ మాట్లాడు తూ, ‘‘భారతదేశంలో చీలీ వాల్ నట్స్ కు తక్షణ డిమాండ్ ఉండగలదని మేం భావిస్తున్నాం. అధిక నాణ్యమైన వాల్ నట్స్ కు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. చీలీలో వాల్ నట్స్ ఉత్పత్తి సమయం నూటికి నూరు శాతం భారతీయ రుతువులకు విభిన్నంగా ఉంటుంది. అంతేకాదు, ఈ మార్కెట్ సరఫరా చేసే ఉత్తరార్థగోళం వాల్ న ట్ ఉత్పత్తి దేశాలకూ ఈ సమయం భిన్నంగా ఉంటుంది. చీలీ వాల్ నట్స్ మే-జులై మధ్య కోతకు వచ్చి. భారత దేశంలోకి ఆగస్టు తరువాత వస్తాయి. అది సరిగ్గా పండుగల సమయం. దేశవ్యాప్తంగా భారతీయ వినియోగదా రులకు వీటిని అందించేందుకు మేం విస్తృత వాణిజ్య, మీడియా వ్యూహాలతో ముందుకెళ్తున్నాం. రిటైలర్ల వద్ద, ఇ-కామర్స్ వేదికలపై ఈ వాల్ నట్స్ లభ్యమవుతాయి’’ అని అన్నారు. ప్రముఖ భారతీయ పోషకనిపుణులు నీలాంజన సింగ్, ప్రపంచ ప్రఖ్యాత షెఫ్ మంజిత్ సింగ్ గిల్, అగ్రగామి పాటిస్సెరీ షెఫ్ సాహిల్ మెహతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధిక నాణ్యత కలిగిన చీలీ వాల్ నట్స్ గురించి, వినియోగదారులు వాటిని తమ ఆహారంలో భాగం చేసుకోవాల్సిన ఆవశ్యకత గురించి వారు మీడి యాతో మాట్లాడారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: