స్వయం సహాయక సంఘాలకు...

వైయస్ జగన్ బాసట

మంత్రి ఆదిమూలపు సురేష్


(జానో జాగో వెబ్ న్యూస్_  మార్కాపురం ప్రతినిధి)

అప్పుల్లో కూరుకుపోయిన స్వయం సహాయక సంఘాలకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అన్ని విధాల అండగా నిలిచారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఆసరా పధకంలో భాగంగా లబ్దిదారులకు రెండో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం గురువారం త్రిపురాంతకం లో జరిగింది. మండల స్ధాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమములో ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి సురేష్ మాట్లాడుతూ


ఇచ్చిన మాటకు కట్టుబడటం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నైజం అని అన్నారు. డ్వాక్రా రుణాల వడ్డీ మాఫీ చేస్తామని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత పాలకులు ఆ హామీని నెరవేర్చడంలో విఫలం అయ్యారని మంత్రి అన్నారు. ఫలితంగా ఆర్ధిక కష్టాల్లో కూరుకుపోయి అతలాకుతలమౌతున్న స్వయం సహాయక సంఘాల మహిళల కష్టాలను ప్రతిపక్ష నేతగా చేపట్టిన పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి చూసి చలించి పోయారని అన్నారు.

అప్పులు, వడ్డీలు కట్టలేక స్వయం సహాయక సంఘాల రేటింగ్ పడిపోయిందని ‘ ఏ గ్రేడ్ నుంచి బి గ్రేడ్ లోకి, బి గ్రేడ్ నుంచి సి గ్రేడ్ లోకి పడిపోయాయని చెప్పారు. అధికారంలోకి రాగానే రుణాలను మాఫీ చేస్తామని, సున్నా వడ్డీ పధకాన్ని తిరిగి ప్రారంభిస్తామని ఇచ్చిన హామిని వెంటనే ముఖ్యమంత్రి అమల్లోకి తెచ్చారని మంత్రి సురేష్ తెలిపారు. డ్వాక్రా రుణాల మాఫీతో పాటు మహిళలు ఆర్ధికంగా తమ కాళ్లపై తాము నిలబడేలా పలు పధకాలను సైతం ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారని అన్నారు. అన్ని వర్గాల వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.

ఈ సందర్భంగా లబ్దిదారులు అయిన మహిళలకు ఆసరా చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. మండలంలో స్త్రీ నిధి కింద రూ. 50 లక్షలు . ఆసరా కింద రూ 3.12 కోట్ల ఆర్ధిక ప్రయోజనం లభించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమములో డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ బాబురావు, మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు సుబ్బారెడ్డి  పలువురు ప్రతినిధులు, అధికారులు పాల్గోన్నారు.

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్



 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: